రాణించిన పుజారా, బిన్నీ | Pujara, Binny hit fifties as Indian batsmen enjoy outing | Sakshi
Sakshi News home page

రాణించిన పుజారా, బిన్నీ

Published Thu, Jul 3 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

Pujara, Binny hit fifties as Indian batsmen enjoy outing

భారత్ 341/6 డిక్లేర్డ్
 డెర్బీ: ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ నిలకడైన ఆటతీరు ప్రదర్శించారు. డెర్బీషైర్‌తో జరుగుతున్న ఈ మూడు రోజుల మ్యాచ్‌లో రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా జట్టుకు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
 
 
  చతేశ్వర్ పుజారా (131 బంతుల్లో 81 రిటైర్డ్ అవుట్; 13 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (111 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ధోని (46), జడేజా (45), కోహ్లి (36) ఫర్వాలేదనిపించగా... ధావన్ (6) , విజయ్ (6) విఫలమయ్యారు. పుజారా, ధోని కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగులు జోడించడం విశేషం. గురువారం మ్యాచ్‌కు చివరి రోజు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement