Binny
-
అతడిని తీసుకుని రిస్క్ చేశాం: ధోని
లాడర్‌హిల్: వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20లో అమిత్ మిశ్రాను తీసుకుని రిస్క్ చేశామని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. అమిత్ మిశ్రా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో టి20 వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. 150 ఛేదించదగిన స్కోరు. అయితే మేమే గెలుస్తామని కచ్చితంగా చెప్పలేను. మా బ్యాటింగ్ బలంగా ఉంది. బిన్నీ స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకుని కొద్దిగా రిస్క్ చేశాం. ఎందుకంటే మాకు ఒక బ్యాట్స్‌మన్ తగ్గుతాడు. అయితే ఈ వికెట్ కు లెగ్ స్పిన్నర్ అవసరమని భావించి అమిత్ మిశ్రాను తీసుకున్నాం. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్విన్ నుంచి అతడికి మంచి సహకారం లభించింది. ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు. అమెరికాలో మరిన్ని మ్యాచ్ లు నిర్వహించాలని కోరుకుంటున్నాన’ని చెప్పాడు. -
వికెట్లు పడుతున్నా.. భారీ లీడ్ దిశగా భారత్
శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది. లోయర్ ఆర్డర్ రాణించడంతో బారత్ 350 పరుగుల లీడ్ దిశగా సాగుతోంది. టీ విరామ సమయానికి 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. దీంతో మూడో టెస్ట్ లో ఓవరాల్ లీడ్ 345 పరుగులకు చేరింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, స్టువర్ట్ బిన్నీలు ఒక మోస్తరు పరుగులు చేయడంతో పాటు... లోయర్ ఆర్డర్ లో నమన్ ఓజా, అమిత్ మిశ్రాలు రాణించారు. ప్రస్తుతం అశ్విన్ 27 పరుగలతో నాటౌట్ గా ఉన్నాడు. -
రాణించిన రోహిత్, బిన్నీ.. భారీ లీడ్ దిశగా భారత్
శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, బిన్నీలు రాణించడంతో 300 పరుగుల పైగా లీడ్ సాధించింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సైతం నిలకడగా రాణించడంతో టీమిండియా చివరి టెస్టులో పటిష్ట స్థితికి చేరుకుంది. -
రాణించిన పుజారా, బిన్నీ
భారత్ 341/6 డిక్లేర్డ్ డెర్బీ: ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ నిలకడైన ఆటతీరు ప్రదర్శించారు. డెర్బీషైర్‌తో జరుగుతున్న ఈ మూడు రోజుల మ్యాచ్‌లో రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా జట్టుకు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. చతేశ్వర్ పుజారా (131 బంతుల్లో 81 రిటైర్డ్ అవుట్; 13 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (111 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ధోని (46), జడేజా (45), కోహ్లి (36) ఫర్వాలేదనిపించగా... ధావన్ (6) , విజయ్ (6) విఫలమయ్యారు. పుజారా, ధోని కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగులు జోడించడం విశేషం. గురువారం మ్యాచ్‌కు చివరి రోజు.