వరుసగా రెండో సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యల్లో భాగంగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనలు చేస్తున్న ఆటగాళ్లపై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. త్వరలో ప్రారంభంకాబోయే విండీస్ టూర్ కోసం టీమిండియాలో సమూల మార్పుల చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. వీరి స్థానంలో యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ పలు మార్పులకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉండవచ్చని సమాచారం.
టీ20ల్లో రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మోహిత్ శర్మలకు దాదాపుగా ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. విండీస్ టూర్‌లో సీనియర్ల గైర్హాజరీలో వీరికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని బోర్డు యోచిస్తున్నట్లు వినికిడి. ఇదే విండీస్ టూర్‌లో వన్డేల కోసం పలువురు ఆటగాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేయవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో శిఖర్ ధవన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ధవన్‌కు వయసు పైబడుతుండటంతో వరల్డ్‌కప్‌కు ముందు వీలైనన్ని అవకాశాలు కల్పించాలన్నది బీసీసీఐ యోచనగా తెలుస్తోంది.
కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది.
విండీస్ పర్యటన వివరాలు..
తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా
రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్
జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్
ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా
ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా
ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా
ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా
చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు
Comments
Please login to add a commentAdd a comment