పుజారా అరుదైన ఘనత | pujara becomes the 7th Indian batsman for a Test hundred in his 50th match | Sakshi
Sakshi News home page

పుజారా అరుదైన ఘనత

Published Thu, Aug 3 2017 3:58 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

పుజారా అరుదైన ఘనత - Sakshi

పుజారా అరుదైన ఘనత

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా సెంచరీ నమోదు చేశాడు. 164 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని సత్తా చాటుకున్నాడు.  తన కెరీర్ లో యాభైవ టెస్టు ఆడుతున్న పుజారా అరుదైన ఘనతను సైతం సొంతం చేసుకున్నాడు. యాభై టెస్టులో శతకం సాధించిన ఏడో భారత ఆటగాడిగా పుజరా గుర్తింపు పొందాడు. ఓవరాల్ గా 36 ఆటగాడిగా పుజరా నిలిచాడు. ఇది పుజరాకు 13వ టెస్టు సెంచరీ కాగా, శ్రీలంకపై మూడో సెంచరీ.

మరొకవైపు అజింక్యా రహానే హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(57) హాఫ్ సెంచరీ సాధించగా, ధావన్(35) ఫర్వాలేదనిపించాడు. కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(13) నిరాశపరిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement