మూడో టెస్ట్‌ డ్రా : సిరీస్‌ భారత్‌ కైవసం | India vs Sri Lanka 3rd Test Drawn | Sakshi
Sakshi News home page

మూడో టెస్ట్‌ డ్రా : సిరీస్‌ భారత్‌ కైవసం

Published Wed, Dec 6 2017 4:19 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

India vs Sri Lanka 3rd Test Drawn - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0 తో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్‌ మ్యాచ్‌ను కూడా చివరి రోజు భారత్‌ గెలుస్తుందని భావించినా ధనంజయ డిసిల్వా (210 బంతుల్లో 119 రిటైర్డ్ హర్ట్‌: 15 ఫోర్లు, 1 సిక్స్) సమయోచిత ఇన్నింగ్స్‌తో శ్రీలంకను ఆదుకున్నాడు. అనంతరం రోషన్ డిసిల్వా (74 నాటౌట్‌), డిక్‌వెల్లా(44 నాటౌట్‌)లు కూడా వికెట్‌ను కోల్పోకుండా ఆడటంతో శ్రీలంక 103 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్‌లో లంక స్కోరు 299/5 పరుగులు చేసింది. జడేజాకు మూడు, అశ్విన్‌, షమీలకు చెరో వికెట్‌ దక్కింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 536/7  డిక్లేర్‌, రెండో ఇన్నింగ్స్‌ 246/5 డిక్లేర్‌

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 373 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 299/5

మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కోహ్లీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement