పూజారా హాఫ్ సెంచరీ
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన భారత ఆటగాడు చటేశ్వర పూజారా.. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 128 బంతుల్లో 3 ఫోర్లు సాయంతో అర్థ శతకం సాధించాడు. భారత కోన్ని కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడ్డ సమయంలో పూజారా నిలకడగా ఆడాడు. ఆసీస్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో పరిస్థితిని చక్కదిద్దాడు. అతనికి జతగా రహానే క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు అభినవ్ ముకుంద్(16),కేఎల్ రాహుల్(51),కోహ్లి(15), రవీంద్ర జడేజా(2)లు పెవిలియన్ కు చేరాడు.