Keegan Petersen Stunning Catch: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్ మూడో రోజు ఆటలో అద్భుతం చోటు చేసుకుంది. సఫారీ ఆటగాడు కీగన్ పీటర్సన్.. పక్షిలా గాల్లోకి ఎగురుతూ రెప్పపాటులో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కీలక మ్యాచ్‌లో తప్పక రాణిస్తాడని భావించిన పుజారా.. పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగాడు. మూడో రోజు తొలి ఓవర్ రెండో బంతికే మార్కో జన్సెన్ బౌలింగ్‌లో పుజారా ఔటయ్యాడు. ఫలితంగా భారీ స్కోర్‌పై కన్నేసిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలినట్లైంది.
Keegan Petersen with a magnificent catch on the second ball of the day😍 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/zqcAtMahSi
— Cricket South Africa (@OfficialCSA) January 13, 2022
ఇదిలా ఉంటే, 57 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(127 బంతుల్లో 28; 4 ఫోరు).. తన సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతుండగా.. రిషబ్ పంత్(60 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడుతున్నాడు. లంచ్ సమయానికి భారత్ 143 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది.
చదవండి: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment