
50వ టెస్టులోనూ మెరుగ్గా రాణిస్తా: పుజారా
శ్రీలంకతో జరగబోయే రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు భారత స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా తెలిపాడు. ఈ మ్యాచ్ అతడి కెరీర్‌లో 50వ టెస్టు కానుంది. ‘ఇప్పటిదాకా నా కెరీర్ అద్భుతంగా సాగింది. దేశం తరఫున 50వ టెస్టు ఆడబోతుండటం గర్వంగా అనిపిస్తోంది.
కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే తదుపరి మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తాననే నమ్మకముంది. కెరీర్‌లో గాయాలు కూడా నన్ను తీవ్రంగా బాధించాయి’ అని పుజారా అన్నాడు.