లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా | India scores 399 lose of 3 wickets against sri lanka | Sakshi
Sakshi News home page

లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా

Published Wed, Jul 26 2017 6:36 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా

లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా

గాలె: శ్రీలంకతో జరుగుతున్న గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా భారీ శతకాలతో రాణించడంతో తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి విరాట్ కోహ్లీ సేన 3 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) విధ్వంసం సృష్టిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడినా తృటిలో డబుల్ సంచరీ చేజార్చుకున్నాడు.

వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా లంక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి పుజారా (144 నాటౌట్; 247 బంతుల్లో 12 ఫోర్లు), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (39 నాటౌట్; 94 బంతుల్లో 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ముకుంద్ (12), కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. లంక బౌలర్ ప్రదీప్ కే ఈ మూడు వికెట్లు దక్కాయి. రహానే, పుజారా రెండోరోజు సాధ్యమైనంత ఎక్కువ ఓవర్లు ఆడితే భారత్ సులువుగా భారీ స్కోరు చేసి డిక్లేర్ ఇచ్చే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement