Galle test
-
పాకిస్తాన్ ఓపెనర్ ప్రపంచ రికార్డు.. 93 ఏళ్ల తర్వాత తొలి సారిగా..!
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టు యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 160 పరుగులతో ఆజేయంగా నిలిచి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్ ఏకంగా 408 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చేజింగ్ సమయంలో అత్యధిక సేపు క్రీజులో నిలిచిన తొలి బ్యాటర్‌గా షఫీక్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 524 నిమిషాలు పాటు షఫీక్ క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు ఈ రికార్డు.. 1998లో జింబాబ్వేపై ఛేజింగ్‌లో 460 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆటగాడు అరవింద డి సిల్వా పేరిట ఉండేది. అదే విధంగా ఛేజింగ్‌లో 400 బంతులు ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చిన రెండో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. అంతకు ముందు 1928-29లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 462 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. దాదాపు 93 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రికార్డును షఫీక్ సాధించడం విశేషం. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 400 పైగా బంతులను ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. షఫీక్ కంటే ముందు హెర్బర్ట్ సట్‌క్లిఫ్, సునీల్ గవాస్కర్, మైక్ అథర్టన్, బాబర్ ఆజాం ఈ ఘనత సాధించారు. అదే విధంగా టెస్టులో నాల్గవ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో పాక్ ఆటగాడిగా షఫీక్ నిలిచాడు. చదవండి: NZ vs IRE: తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..! Pakistan's second-highest successful run-chase in Tests ✅ A remarkable win to take a 1️⃣-0️⃣ lead in the series 👏#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/n5B4iFJmZf — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 Who is Abdullah Shafique, Pakistan's new batting star? Read more: https://t.co/qZbdgM5r4B#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/RjM1hKxlbQ — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 🗣️ The star 🇵🇰 duo of @babarazam258 and @imabd28 reflect on the special Galle triumph 🌟🌟#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/oGjOXG2LJw — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 -
లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా
-
లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా
గాలె: శ్రీలంకతో జరుగుతున్న గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా భారీ శతకాలతో రాణించడంతో తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి విరాట్ కోహ్లీ సేన 3 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) విధ్వంసం సృష్టిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడినా తృటిలో డబుల్ సంచరీ చేజార్చుకున్నాడు. వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా లంక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి పుజారా (144 నాటౌట్; 247 బంతుల్లో 12 ఫోర్లు), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (39 నాటౌట్; 94 బంతుల్లో 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ముకుంద్ (12), కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. లంక బౌలర్ ప్రదీప్ కే ఈ మూడు వికెట్లు దక్కాయి. రహానే, పుజారా రెండోరోజు సాధ్యమైనంత ఎక్కువ ఓవర్లు ఆడితే భారత్ సులువుగా భారీ స్కోరు చేసి డిక్లేర్ ఇచ్చే అవకాశం ఉంది. -
పుజారా సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
గాలే: శ్రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా శతకం సాధించాడు. 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. ఇన్నింగ్స్ 67వ ఓవర్లో లంక బౌలర్ కుమార వేసిన ఐదో బంతిని మిడాన్ వైపు ఆడి రెండు పరుగులు తీయడంతో పుజారా సెంచరీ మార్కు చేరుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 27 పరుగుల వద్ద ముకుంద్(12) వికెట్ ను కోల్పోవడంతో పుజారా బ్యాటింగ్ కు దిగాడు. ఓ వైపు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా, మరోవైపు వన్ డౌన్ ఆటగాడు పుజారా ఆచితూచి ఆడాడు. 80 బంతుల్లో అర్థ శతకం చేసిన పుజారా.. ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) ఔటయ్యాక మరీ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డుకు పరుగులు జోడించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) మాత్రం నిరాశపరిచినా, అనంతరం క్రీజులోకొచ్చిన అజింక్య రహానే సహకారంతో సెంచరీ చేశాడు. పరుగులు చేసేందుకు రహానే ఇబ్బంది పడుతున్నా పుజారా మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా లంక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 71 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 328పరుగులు చేసిన టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. -
శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ
గాలే: భారత్ తో టెస్టు సిరీస్ లో తొలిరోజే శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. లంక క్రికెటర్ అసేల గుణరత్నే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడి పోయిన లంక ప్లేయర్ బాధతోనే మైదానం నుంచి డ్రెస్సింగ్ రూముకు వెళ్లిపోయాడు. భారత్ తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలేలో జరుగుతున్న తొలిటెస్టులో 14వ ఓవర్ లహిరు కుమారా బౌలింగ్ చేశాడు. అయితే ఆ ఓవర్లో చివరి బంతిని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ షాట్ ఆడగా సెకండ్ స్లిప్ లో ఉన్న గుణరత్నే క్యాచ్ పట్టేందుకు ఎడమవైపు డైవ్ చేశాడు. బంతి గుణరత్నే ఎడమచేతి బొటనవేలికి తాకుతూ వెళ్లడంతో ధావన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ లంక ప్లేయర్ మాత్రం నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఫిజయో వచ్చి పరీక్షించి చివరికి డ్రెస్సింగ్ రూముకు తీసుకెళ్లారు. మణికట్టును కదిలిస్తూ గుణరత్నే బాధతో మైదానాన్ని వీడాడు. ఔట్ నుంచి బయటపడ్డ ధావన్ మాత్రం లంక బౌలర్లపై చెలరేగిపోయి 110 బంతుల్లో శతకం సాధించాడు. అయితే డబుల్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) ప్రదీప్ బౌలింగ్ లో రెండో వికెట్ గా ఔటయ్యాడు. లంక జట్టులో గుణరత్నే మంచి ఆల్ రౌండర్. ఇటీవల జింబాబ్వేతో జరిగిన చివరి టెస్టులో 80 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన గుణరత్నే టెస్టు చరిత్రలోనే లంక జట్టు అత్యుత్తమ ఛేదనలో భాగస్వామి అయ్యాడు. అసలే సాధారణంగా ఉన్న లంక జట్టుకు కీలక ఆటగాడు గుణరత్నే గాయపడటం ప్రతికూలాంశమే. -
ధావన్ మెరుపు ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీ మిస్
గాలే: శ్రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. ఇన్నింగ్స్ 55వ ఓవర్లో లంక బౌలర్ ప్రదీప్ తన తొలి బంతికి ధావన్ ను ఔట్ చేసి లంకకు ఊరట కలిగించాడు. ధావన్ ముందుకొచ్చి మిడాఫ్ దిశగా షాట్ ఆడగా ఆ స్థానంలో ఉన్న మాథ్యూస్ క్యాచ్ పట్టడంతో ధావన్ భారీ ఇన్నింగ్స్ కు తెరపడింది. రెండో వికెట్ కు చతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ (75 నాటౌట్)తో కలిసి 283 బంతుల్లోనే 253 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించిన అనంతరం నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఓపెనర్ ముకుంద్ (12) వికెట్ ను త్వరగా కోల్పోయింది. ప్రదీప్ బౌలింగ్ లో ముకుంద్ ఆడిన బంతిని కీపర్ డిక్ వెల్లా క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. తనకు వచ్చిన అవకాశాన్ని ముకుంద్ వినియోగించుకోలేక పోయాడు. మరోవైపు క్రీజులోకొచ్చిన పుజారాతో కలిసి ధావన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 29 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ ప్రమాదాన్ని తప్పించుకున్న ధావన్ 110 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. సెంచరీ తర్వాత ఫోర్లతో ధావన్ చెలరేగిపోయాడు. అయితే టీ సెషన్ వెళ్లేముందు ఓవర్లో ఔటయ్యాడు. ప్రదీప్ బౌలింగ్ లో మిడాఫ్ దిశగా షాట్ ఆడగా మాథ్యూస్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. ధావన్ ఔటైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకొచ్చాడు. భారత్ 55 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. -
జట్టుకు అతడు నిజంగా ఓ వరం: కోహ్లి
-
జట్టుకు అతడు నిజంగా ఓ వరం: కోహ్లి
గాలే: సొంతగడ్డపై గత టెస్టు సీజన్లో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా రేపు (బుధవారం) శ్రీలంక గడ్డపై గాలే టెస్టుతో కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా మంగళవారం కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. 'ఆల్ రౌండర్లకు జట్టులో ఎప్పుడూ చోటుంటుంది. అదనపు ఆల్ రౌండర్ బ్యాట్స్ మెన్ ఉంటే జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు జట్టుకు నిజంగానే ఓ వరం. పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. దీంతో ప్రత్యర్ధి జట్టుపై సులువుగా ఒత్తిడి పెంచవచ్చు. ప్రతి కెప్టెన్ హార్దిక్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకుంటాడు. చివరగా 2015లో గాలేలో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓడినా ఆ వెంటనే పుంజుకుని 2-1తో సిరీస్ చేజిక్కుంచుకున్నాం. ప్రస్తుతం జట్టులో సమతూకం ఏర్పడింది. టాపార్డర్ తో పాటు మిడిలార్డర్ ఆటగాళ్లు కూడా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ప్రత్యర్థి లంకపైనే ఒత్తిడి ఉందని భావిస్తున్నాను. ఓపెనర్ల విషయంపై కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. నూతనోత్సాహంతో లంక పర్యటనకు వచ్చాం. విజయాలతో తిరిగివెళ్తామన్న నమ్మకం ఉందని' కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. -
ఆసీస్ మళ్లీ 'కంగారు' పడుతోంది..!
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన ఆస్ట్రేలియా కాస్త కంగారు పడుతుంది. రేపు (గురువారం) గాలేలో ప్రారంభంకానున్న రెండో టెస్టులోనే పాతకథ రిపీట్ అవుతుందేమేనని ఆసీస్ ఆందోళనలో ఉంది. ఎందుకంటే 17 ఏళ్ల తర్వాత తమ జట్టును లంక ఓడించడం.. అందులోనూ సంగక్కర, జయవర్ధనే, ముత్తయ్య మురళీదరన్, సనత్ జయసూర్య లాంటి దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత ఇది సంభవించడం ఆసీస్ ఓ పట్టాన జీర్ణించుకోలేక పోతుంది. అందులోనూ టెస్టు ర్యాంకింగ్స్ లో తమ అగ్రస్థానానికి ముప్పు వాటిల్లి మూడో స్థానానికి పడిపోతామని ఆసీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. టెస్టు ర్యాంకింగ్స్ లో ఆసీస్ 118, భారత్ 112, పాకిస్తాన్ 111 పాయింట్లతో వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. యువ సంచలనాలు కుశాల్ మెండిస్ అద్భుత బ్యాటింగ్, స్పిన్నర్ సందకన్ (7/107) తో చెలరేగడం చారిత్రక విజయానికి నాంది పలికింది. గాలేలో లంక 11 టెస్టులాడగా 7 మ్యాచ్ ల్లో నెగ్గి కేవలం నాలుగు మ్యాచులలో ఓడింది. గాలే ముఖ్యంగా స్పిన్నర్ల స్వర్గధామం కావడంతో గత టెస్టులో అదరగొట్టిన హెరాత్(9వికెట్లు)కు తోడు సందకన్ చెలరేగితే ఆసీస్ కష్టాలు తప్పవని కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడుతున్నాడు. 61.79 శాతం స్పిన్నర్లకు ఈ పిచ్ అనుకూలం. లంకకు కూడా గాలేలో మంచి రికార్డు ఉంది. తొలి టెస్టులో గాయపడ్డ స్టీవ్ ఓ కెఫె స్థానంలో మరో స్పిన్నర్ జాన్ హోలాండ్ను ఆసీస్ జట్టులోకి ఆహ్వానించింది. మరోవైపు లంక పేసర్ నువాన్ ప్రదీప్ ఫిట్ నెస్ లేని కారణంగా రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.