Pujara Will Be Rested Soon Says Sarandeep Singh: గతకొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుజారా వైఫల్యాల పరంపర ఇలాగే కొనసాగితే అతి త్వరలో జట్టు నుంచి సాగనంపడం ఖాయమని హెచ్చరించాడు. అతని స్థానాన్ని ఆక్రమించేందుకు శ్రేయస్ అయ్యర్ లాంటి నైపుణ్యం గల ఆటగాళ్లు కాసుకు కూర్చున్నారని, ఇకనైనా అలస్యం వీడకపోతే కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదముందని అలర్ట్ చేశాడు.
గతకొంత కాలంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, అడపాదడపా మయాంక్ అగర్వాల్ మినహా టీమిండియాలో ఎవ్వరూ పెద్దగా రాణించడం లేదని, పుజారాతో పాటు రహానే, కోహ్లిలు సైతం ఫామ్‌ని అందుకునేందుకు ప్రయత్నించాలని, లేకపోతే చాలామంది మహామహులకు పట్టిన గతే వీరికి పడుతుందని హితబోధ చేశాడు.
ఈ సందర్భంగా భారత బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించిన శరణ్‌దీప్.. టీమిండియాదే టెస్ట్ సిరీస్ అని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై కూడా అతను స్పందించాడు. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసిన శరణ్‌దీప్.. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అతను ఈ మేరకు వ్యాఖ్యానించాడు.
చదవండి: కోహ్లితో పోలిస్తే అతను బెటర్.. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక సరైందే..!
Comments
Please login to add a commentAdd a comment