Saran Deep Singh
-
అతి త్వరలో అతన్ని టీమిండియా నుంచి సాగనంపడం ఖాయం..!
Pujara Will Be Rested Soon Says Sarandeep Singh: గతకొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుజారా వైఫల్యాల పరంపర ఇలాగే కొనసాగితే అతి త్వరలో జట్టు నుంచి సాగనంపడం ఖాయమని హెచ్చరించాడు. అతని స్థానాన్ని ఆక్రమించేందుకు శ్రేయస్ అయ్యర్ లాంటి నైపుణ్యం గల ఆటగాళ్లు కాసుకు కూర్చున్నారని, ఇకనైనా అలస్యం వీడకపోతే కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదముందని అలర్ట్ చేశాడు. గతకొంత కాలంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, అడపాదడపా మయాంక్ అగర్వాల్ మినహా టీమిండియాలో ఎవ్వరూ పెద్దగా రాణించడం లేదని, పుజారాతో పాటు రహానే, కోహ్లిలు సైతం ఫామ్‌ని అందుకునేందుకు ప్రయత్నించాలని, లేకపోతే చాలామంది మహామహులకు పట్టిన గతే వీరికి పడుతుందని హితబోధ చేశాడు. ఈ సందర్భంగా భారత బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించిన శరణ్‌దీప్.. టీమిండియాదే టెస్ట్ సిరీస్ అని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై కూడా అతను స్పందించాడు. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసిన శరణ్‌దీప్.. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అతను ఈ మేరకు వ్యాఖ్యానించాడు. చదవండి: కోహ్లితో పోలిస్తే అతను బెటర్.. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక సరైందే..! -
WTC Final: భువీని తీసుకెళ్లకపోవడం అతిపెద్ద పొరపాటు..
న్యూఢిల్లీ: భువనేశ్వర్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడైన స్వింగ్ బౌలర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు తీసుకెళ్లకపోవడం టీమిండియా యాజమాన్యం చేసిన అతిపెద్ద పొరపాటని భారత మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని విశ్లేషిస్తూ ఆయన ఈమేరకు వ్యాఖ్యానించాడు. భారత జట్టులో అత్యుత్తమ స్వింగ్ బౌలరైన భువీని ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు టీమిండియా ప్రకటించిన 15 మంది జాబితాలో శార్ధూల్ ఠాకూర్ పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించాడు. అలాగే, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌పై అతిగా ఆధారపడటాన్ని ఆయన తప్పుపట్టాడు. గత కొంత కాలంగా హార్ధిక్ బౌలింగ్ చేయకపోవడాన్ని ఉదహరించాడు. ఈ క్రమంలో శార్ధూల్, విజయ్‌శంకర్, శివమ్ దూబేలలో ఒకరిని ప్రోత్సహించాలని ఆయన సూచించాడు. ప్రస్తుత జట్టులో యువ పేసర్ మహ్మద్ సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడని, రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో అతనికి వీలైనన్ని ఎక్కవ అవకాశాలు కల్పించాలని ఈ మాజీ సెలెక్టర్ సూచించారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియా రొటేషన్ పద్ధతి పాటించి, ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయడ్డాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా పరిస్థితులను బట్టి అదనపు పేసర్‌ను కూడా తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా బ్యాటింగ్‌లో లోపాలను కూడా ఎత్తి చూపాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన స్థాయి మేరకు రాణించలేకపోతున్నాడని, అతను అతిగా ఒత్తిడికి లోనవుతున్నాడని తెలిపాడు. పుజారా, రహానే లాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నారని, వారు పరిస్థితులకు తగ్గట్టు మారాలని సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్‌లపై భారం తగ్గించే ఆటగాళ్లు కావాలని తెలిపాడు. మొత్తంగా కోహ్లీ సారథ్యంలోని టీమిండియా బాగానే ఆడుతున్నా, ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. చదవండి: WTC Final: పాస్ పోర్టులు లాక్కొని మరీ గద కోసం ఆరా తీశారు.. -
‘అసలు కోహ్లి గురించి మీకేం తెలుసు?’
ముంబై: ఫీల్డ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని చూసిన వారంతా.. అతడికి చాలా కోపం అని.. ఎవరి మాట వినని వ్యక్తిగా అంచనా వేస్తుంటారు. ఫీల్డ్‌లో కోహ్లి బిహేవియర్ కూడా ఇలానే ఉంటుంది. దీని గురించి సోషల్ మీడియాలో నెటిజనులు రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. ఆఫ్‌ఫీల్డ్‌లో కూడా కోహ్లి ఇలానే ఉంటాడా.. ఇంత దూకుడుగా వ్యవహరిస్తాడా అంటే కాదు అంటారు అతడి గురించి బాగా తెలిసిన కొందరు ఆటగాళ్లు. ఫీల్డ్ బయట కోహ్లి ఎంతో ప్రశాంతంగా ఉంటాడట.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం తనది అంటారు. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్, సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి బయట ఎంతో వినయంగా ఉంటాడని తెలిపాడు. ఈ సందర్భంగా శరణ్‌దీప్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లిని చూస్తే.. ఎంతో దూకుడుగా కనిపిస్తాడు. కానీ ఆఫ్‌ఫీల్డ్‌లో కోహ్లి ఎంతో వినయంగా ఉంటాడు. తను మంచి శ్రోత. సెలక్షన్ మీటింగ్స్‌లో చాలా శ్రద్ధగా అందరూ చెప్పేది వింటాడు. గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో కోహ్లి అందరూ చెప్పేది శ్రద్ధగా విని.. ఆ తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు’’ అన్నాడు ‘‘ఇక ఇంట్లో కోహ్లి ప్రవర్తనని చూసిన వారు అస్సలు నమ్మలేరు. అతడి ఇంట్లో పని వాళ్లు ఉండరు. కోహ్లి ఇంటికి భోజనానికి వెళ్తే అతడు, అతని భార్య దగ్గరుండి అతిథులకు భోజనం వడ్డిస్తారు. మనతో పాటే కూర్చుని మాట్లాడతాడు. మనతో కలిసి డిన్నర్‌కి బయటకు వస్తాడు. మిగతా ఆటగాళ్లు అందరూ కోహ్లిని ఎంతో గౌరవిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కోహ్లిది’’ అని చెప్పుకొచ్చాడు. "కెప్టెన్ అయినందున మైదానంలో అతను అలానే ఉండాలి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో కోహ్లి ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటాడు.. చాలా సార్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో అతడు దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తాడు" అన్నాడు. కోహ్లి అధ్వర్యంలో భారత జట్టు బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే డే-నైట్ టెస్టులో పాల్గొంటుంది. చదవండి: ఆ సమయంలో ఎవరూ లేరు: కోహ్లి కోహ్లి.. నీ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి -
అక్టోబర్ 21న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: అశ్వనీ నాచప్ప (క్రీడాకారిణి, నటి), శరణ్ దీప్ సింగ్ (మాజీ క్రికెటర్) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. పుట్టినతేదీ 21. ఇది కూడా బృహస్పతికి చెందిన సంఖ్యే కావడం వల్ల వీరు బృహస్పతి ప్రభావంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. వీరిని విజయాలు వరిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడి, వాటివల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులకు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరమంతా సుఖసంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇంటాబయటా మాటకు విలువ ఏర్పడుతుంది. ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యంతో ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. లక్కీ నంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు. సూచనలు: దక్షిణామూర్తి, సాయిబాబా, దత్తాత్రేయస్వామి వంటి గురుపరంపరకు చెందిన వారిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్