
అమితాబ్
విజయమో, వీర విహారమో అని బుధవారం వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా పైకి బ్యాటింగ్‌కి దిగింది ఇండియన్ టీమ్. ఫస్ట్ ఫస్టే దక్షిణాఫ్రికా ఫట్ ఫట్‌మని రెండు వికెట్లు పడగొట్టేసింది. చేతేశ్వర్ పుజారా బ్యాటు పట్టుకుని వచ్చాడు. ప్రతి బంతినీ ఇలా టచ్ చేసి అలా వదిలేస్తున్నాడు. యాభై బాల్స్‌కి ఒక్క రన్ను కూడా తీయలేకపోయాడు! 54వ బంతి దగ్గర పుజారా ఫస్ట్ రన్ రికార్డ్ అయింది. ఆ ఒక్క రన్నుకే ఇండియన్ ఫ్యాన్స్ పెద్ద రిలీఫ్ ఫీలయ్యారు! ఆ వెంటనే ట్విట్టర్ పరుగులు తీసింది.
రకరకాలుగా అతడిపై సెటైర్లు వేసింది. ఒకరైతే.. యంగ్ అమితాబ్, ఓల్డ్ అమితాబ్ ఫొటోలను పక్కపక్కన ఉంచి కింద కాప్షన్ పెట్టారు. ‘పుజారా బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు’ అని యంగ్ ఫొటోకి, ‘పుజారా ఫస్ట్ రన్ కొట్టినప్పుడు’ అని ఓల్డ్ ఫొటోకి క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు. సిరీస్ పోయిన మ్యాచ్‌ని సీరియస్‌గా ఆడి సాధించేదేముంది అనుకున్నాడో ఏమో పుజారా! ట్విట్టర్ మాత్రం.. పుజారాను సాధించి సాధించి వదిలింది.
Comments
Please login to add a commentAdd a comment