Cheteshwar Pujara: చాలాకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ.. శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటును సైతం కోల్పోయిన నయా వాల్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. తన సహజ శైలికి విరుద్ధంగా భారీ షాట్లతో అలరించాడు. టీ20 తరహాలో 109.64 స్ట్రైక్‌రేట్‌తో రెచ్చిపోయాడు. 83 బంతుల్లో సిక్సర్, 16 ఫోర్ల సాయంతో 91 పరుగులు సాధించి 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపర్చిన పుజరా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఫాలో ఆన్ ఆడిన తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (275), రహానే (129) అద్భుత శతకాలతో చెలరేగడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు కుప్పకూలడంతో ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర జట్టును స్నెల్ పటేల్ (98), పుజారా (91), కెప్టెన్ ఉనద్కత్ (32 నాటౌట్) ఆదుకోవడంతో మ్యాచ్ ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసి ఓటమి గండం నుంచి గట్టెక్కింది.
చదవండి: చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు!
Comments
Please login to add a commentAdd a comment