
తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 188/7
5 పరుగుల తేడాలో 4 వికెట్లు కోల్పోయిన డిఫెండింగ్ చాంపియన్
విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 ఆలౌట్
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీలో ముంబై మేటి చాంపియన్ జట్టు. దేశవాళీ టోర్నీలో ఏకంగా 48 సార్లు ఫైనల్ చేరి 42 సార్లు విజేతగా నిలిచిన ఈ జట్టుకు ఈసారి సెమీఫైనల్లో విదర్భ నుంచి కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. తొలి రోజు బ్యాటింగ్‌లో సత్తా చాటుకున్న విదర్భ... రెండో రోజు బౌలింగ్‌తో ముంబైని ముప్పుతిప్పలు పెట్టింది. ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ ఎదురీదుతోంది.
ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 308/5తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ 107.5 ఓవర్లలో 383 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లలో యశ్ రాథోడ్ (54; 7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకొని వెనుదిరిగాడు. కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (34; 4 ఫోర్లు) కాసేపు కుదురుగా ఆడాడు. హర్ష్ దూబే (18; 3 ఫోర్లు), నచికేత్ (11; 2 ఫోర్లు), దర్శన్ నల్కండే (12; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు.
రెండో రోజు 3 వికెట్లు పడగొట్టిన శివమ్ దూబేకు మొత్తం 5 వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (171 బంతుల్లో 67 బ్యాటింగ్; 6 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. శార్దుల్ ఠాకూర్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్), సిద్దేశ్ లాడ్ (35; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఫాలోఆన్ గండాన్ని తప్పించుకున్న ముంబై జట్టు విదర్భ స్కోరుకు ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది.
ముంబై ఒక దశలో 113/2 స్కోరు వద్ద పటిష్టంగా ఉంది. కేవలం రెండో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతున్న పార్థ్ రెఖాడే తన స్పిన్ మాయాజాలంతో ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. అనుభవజ్ఞుడైన భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత ముంబై సారథి అజింక్య రహానే (18; 4 ఫోర్లు) సహా టీమిండియా హార్డ్‌హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0)లను అసలు ఖాతానే తెరువనీయలేదు. ఒకే ఒక్క ఓవర్లో ఈ ముగ్గురినీ పార్థ్ అవుట్ చేశాడు.
ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన పార్థ్ తొలి బంతికి రహానేను, మూడు, ఐదో బంతులకు సూర్య, దూబేలను బోల్తా కొట్టించాడు. ఇది చాలదన్నట్లు మరుసటి ఓవర్లోనే (42వ) హర్ష్ దూబే... షమ్స్ ములానీ (4) అవుట్ కావడంతో ముంబై 113/2 నుంచి 10 బంతుల వ్యవధిలోనే 118/6 స్కోరుతో కుదేలైంది. ఆనంద్, శార్దుల్ మెరుగ్గా ఆడటంతో ముంబై కోలుకుంది. ప్రస్తుతం ఆనంద్‌తో పాటు తనుశ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
స్కోరు వివరాలు
విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్‌స్టన్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రెఖాడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (సి అండ్ బి) శార్దుల్ 54; అక్షయ్ (సి) ఆనంద్ (బి) రాయ్‌స్టన్ 34; హర్‡్ష దూబే (సి) ఆనంద్ (బి) శివమ్ దూబే 18; నచికేత్ (సి) ములానీ (బి) శివమ్ దూబే 11; దర్శన్ (నాటౌట్) 12; యశ్ ఠాకూర్ (సి)అవస్థి (బి) శివమ్ దూబే 3; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (107.5 ఓవర్లలో ఆలౌట్) 383.
వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261, 6–324, 7–346, 8–364, 9–369, 10–383.
బౌలింగ్: శార్దుల్ 19–0–78–1, మోహిత్ 14–2–61–0, రాయ్‌స్టన్ డయస్ 18–5–48–2, తనుశ్ 22–0–78–0, శివమ్ దూబే 11.5–1–49–5, షమ్స్ ములానీ 23–4–62–2.
ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (బ్యాటింగ్) 67; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్ష్ దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (59 బంతుల్లో 7 వికెట్లకు) 188.
వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178.
బౌలింగ్: దర్శన్ నల్కండే 10–1–40–1, యశ్ ఠాకూర్ 11–0–56–2, హర్‡్ష దూబే 15–1–51–1, నచికేత్ 7–1–22–0, పార్థ్ రెఖాడే 16–6–16–3.
Comments
Please login to add a commentAdd a comment