ఇదే నా బెస్ట్ సెంచరీ: సాహా
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ సాధించిన భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కెరీర్‌లో ఇదే నా బెస్ట్ సేంచరీ అని అభిప్రాయపడ్డాడు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో నాల్గోరోజు సాహా 233 బంతుల్లో 117 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేరీర్‌లో ఇప్పటి వరకు సాధించిన నాల్గు సెంచరీల్లో ఇదే అత్యుత్తమమైనదిగా అభివర్ణించాడు. పుజారాతో 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినందుకు గర్వంగా ఉందన్నాడు. మా భాగస్వామ్యం నెమ్మదిగా మొదలై పుజారా డబుల్ సెంచరీ, నేను శతకం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు.
ఇప్పుడు నా బ్యాటింగ్ మెరుగుపడినట్లు భావిస్తున్నాని చెప్పాడు. కానీ నా బ్యాటింగ్ శైలి ఏ మాత్రం మార్చలేదన్నాడు. ఎక్కువగా స్వీప్ షాట్లు ఆడనాని, ఆటలో ఉన్న నా సందేహాలను నివృత్తి చేసుకోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపాడు. నాకు జట్టు మద్దతు ఇస్తుందనీ, ఇది నాపై మంచి ప్రభావం చూపుతుందన్నాడు. పుజారా ఎంతో ఓపికతో ఆడాడని, అతనికి డబుల్ సెంచరీలు చేయడం సర్వసాధారణమని చెప్పాడు. పుజారా డొమెస్టిక్ క్రికెట్లో ఎన్నోసార్లు 200-300 పరుగులు సాధించాడని సాహా తెలిపాడు. పుజారా ఒక వైపు సహచరులు ఔటవుతున్న చక్కటి షాట్లతో బ్యాటింగ్ చేశాడని, దీంతో ఓ మంచి భాగస్వామ్యం నమోదు చేశామని పేర్కొన్నాడు.
ఆసీస్ బౌలర్ హజల్‌వుడ్ స్లేడ్జింగ్‌కు పాల్పడ్డాడని మేము మాత్రం స్పందించలేదని తెలిపాడు. హాజల్‌వుడ్ తనతో ఎదో చెప్పాలని ప్రయత్నిస్తే.. వెనక్కి వెళ్లి బౌల్ చేయమన్నట్లు సూచించానన్నాడు. అయితే పుజారా, సాహా భాగస్వామ్యం, జడేజా మెరుపు బ్యాటింగ్‌తో భారత్ ఆసీస్‌పై 152 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 603/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆసీస్ 23 పరుగులకు రెండు వికెట్లు కోల్పొయింది.