Saha
-
సాహా..ఇదెక్కడి రూల్..?
-
వార్నర్ దూరమైనా ఇబ్బంది లేదు: సాహా
కోల్‌కతా: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అతను లేకున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎలాంటి నష్టం లేదని ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా తెలిపాడు. తమ జట్టు రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని... వార్నర్ గైర్హాజరీ తమపై పెద్దగా ప్రభావం చూపబోదని పేర్కొన్నాడు. ‘ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మా జట్టులో ఉంది. కెప్టెన్ ఆధారంగానే జట్టు ఎంపిక జరుగుతుంది. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో ఇబ్బంది పడొచ్చేమో కానీ... మా రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఎక్కువగా ఉండదు’ అని అన్నాడు. వార్నర్ స్థానాన్ని శిఖర్ ధావన్ భర్తీ చేస్తాడా అనే ప్రశ్నకు బదులిస్తూ... ‘అది జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయిస్తుంది. సారథి ఎవరైనా లక్ష్యం మాత్రం విజయమే’ అని స్పష్టం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం వరకు వార్నర్‌పై ఎలాంటి ప్రకటన చేయబోమని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తెలపగా... ప్రస్తుత పరిణామాల ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ఫై ఏడాది నిషేధం విధించే యోచనలో కనిపిస్తోంది. -
ప్రభాస్‌తో ఐదోసారి..
తమిళసినిమా: సాహో చిత్రంలో నాయకి అనుష్కనేనా? అవుననే అంటున్నారు సినీవర్గాలు. బాహుబలి–2లో అమరేంద్ర బాహుబలి, దేవసేనల జంటను మనదేశమే కాదు ప్రపంచదేశాల ప్రేక్షకులు తెగ మెచ్చేశారు. అంతగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రభాస్, అనుష్కల జంట అంతకు ముందే బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు. బాహుబలి–2తో ఈ జంట మళ్లీ కలిసి నటిస్తే బాగుండు అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి–2 చిత్రం తరువాత ప్రభాస్ సాహో అనే త్రిభాషా(తమిళం, తెలుగు, హిందీ) చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రంలోనూ ఆయనకు జంటగా అనుష్క నటిస్తే బాగుంటుందని భావించిన వారు లేకపోలేదు. అయితే సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సాహో చిత్రంలో వేరే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్ బ్యూటీస్ సోనంకపూర్, అలియాభట్, పూజాహెగ్డేలతో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ చిత్రంలో అనుష్కకు అవకాశం లేదేమో అనుకున్న వారికి శుభవార్త సాహో చిత్రంలో అనుష్కనే నాయకి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద ప్రభాస్, అనుష్క జంట ఐదోసారి జత కట్టనున్నారన్నమాట. మరి ఈ జంట మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అన్నది వేసి చూడాలి. -
చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్
-
సాహోరే... పంజాబ్
-
సాహోరే... పంజాబ్
►చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్ ►ప్లే ఆఫ్ ఆశలు సజీవం ►పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ►సాహా మెరుపు ఇన్నింగ్స్ ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు వరుసగా మూడు మ్యాచ్‌లను నెగ్గాల్సిన ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ‘కింగ్స్’లా చెలరేగింది. వృద్ధిమాన్ సాహా (93 నాటౌట్) తుదికంటా క్రీజులో నిలిచి భారీ స్కోరు సాధించి పెట్టగా.. ఆ తర్వాత బౌలర్లు పట్టు విడవకుండా ప్రయత్నించి లీగ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించారు. అయితే పొలార్డ్ చివరి బంతి వరకు విజయం కోసం ప్రయత్నించి పంజాబ్‌ను వణికించాడు. మ్యాక్స్‌వెల్ సేన ఇక తమ చివరి మ్యాచ్‌లో పుణేపై కచ్చితంగా నెగ్గి ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ముంబై: వాంఖెడే మైదానం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. 231 పరుగుల లక్ష్యం.. టి20ల్లో ఇది కష్టసాధ్యమైనదే అయినా ముంబై ఇండియన్స్ మాత్రం చివరి బంతి వరకు పోరాడింది. అయితే ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ ఓ భారీ సిక్స్ బాదినా మోహిత్ అద్భుతంగా బంతులేసి తమ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 7 పరుగుల తేడాతో నెగ్గి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. అంతకుముందు వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్లో తొలిసారి తమ కీలక మ్యాచ్‌లో చెలరేగడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), గప్టిల్ (18 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ఆ తర్వాత 231 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడింది. సిమన్స్ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పార్థివ్ (23 బంతుల్లో 38; 7 ఫోర్లు), పొలార్డ్ (24 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 30; 4 సిక్సర్లు) చెలరేగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాహాకు దక్కింది. సాహా, మ్యాక్స్ దూకుడు... ఫామ్‌లో ఉన్న ఆమ్లా లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆ లోటు లేకుండా ఓపెనర్లు గప్టిల్, సాహా అద్భుత ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లోనే గప్టిల్ రెండు, సాహా ఓ ఫోర్‌తో జట్టు 13 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఓవర్లో సాహా రెచ్చిపోయి మూడు ఫోర్లు బాదడంతో స్కోరు దూసుకెళ్లింది. ఈ దూకుడుకు పంజాబ్ 3.4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే ఆరో ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన గప్టిల్ మూడో బంతికి వెనుదిరిగాడు. ఇక మ్యాక్స్‌వెల్ రాకతో రన్‌రేట్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కరణ్ శర్మ ఓవర్లో రెండు సిక్సర్లు, ఆ తర్వాత హర్భజన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన తను అర్ధ సెంచరీ వైపు దూసుకెళుతున్న దశలో బుమ్రా బోల్తా కొట్టించాడు. అప్పటికే జట్టు స్కోరు 11 ఓవర్లలో రెండు వికెట్లకు 131 పరుగులకు చేరింది. ఓవర్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన సాహా 31 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్లో మార్‡్ష (16 బంతుల్లో 25; 2 సిక్సర్లు) అవుటైన అనంతరం స్కోరులో కాస్త వేగం తగ్గింది. శుభారంభం అందినా.. లక్ష్యం భారీగా ఉండటంతో ప్రారంభంలో ముంబై ఇన్నింగ్స్ కూడా దానికి తగ్గట్టుగానే సాగింది. ఓపెనర్లు పార్థివ్, సిమన్స్ ధాటిగా ఆడి శుభారంభాన్ని అందించారు. రెండో ఓవర్లో పార్థివ్ మూడు ఫోర్లు బాదాడు. ఆరో ఓవర్లో సిమన్స్ రెండు సిక్సర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లోనే సిమన్స్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే తొమ్మిదో ఓవర్ నుంచి ముంబై పతనం ప్రారంభమైంది. మోహిత్ శర్మ వేసిన ఆ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగిన పార్థివ్ నాలుగో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక పదో ఓవర్లో సిమన్స్ లాంగ్ ఆన్‌లో ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర గప్టిల్ అమాంతం పైకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ తీసుకోవడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ (5), నితీశ్ రాణా (12) వరుసగా అవుట్ కావడంతో 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా గేరు మార్చారు. హెన్రీ వేసిన 16వ ఓవర్లో వీరిద్దరు రెండేసి సిక్సర్లు బాదడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సందీప్.. పాండ్యా వికెట్ తీయడంతో ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా కరణ్ శర్మ ఆడిన ఆరు బంతుల్లోనే మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాది 19 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో ముంబై తడబడి విజయానికి దూరమైంది. ఆదివారం వరకు వేచి చూడాలేమో! ►ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ గెలవడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్‌కు చేరుకోగా... మిగతా మూడు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ►నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై రైజింగ్ పుణే గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పుణే ఓడినా ఆ జట్టు ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ►శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే పుణేతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడిపోవాలి. ►శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ కోల్‌కతా ఓడితే మాత్రం ఆ జట్టు భవితవ్యం గుజరాత్, హైదరాబాద్... పుణే, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ప్లే ఆఫ్‌కు చేరే అన్ని జట్లు ఏవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదేమో! -
ఫలించిన పంజాబ్ వ్యూహం
► సాహా విజృంభణ.. ముంబైకి భారీ లక్ష్యం ► రాణించిన మాక్స్ వెల్, గప్టిల్, షాన్ మార్ష్ ముంబై: కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ బ్యాట్స్ మెన్ వృద్దిమాన్ సాహా 93 పరుగులతో విజృంభించడంతో పంజాబ్ ముంబైకి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరో వైపు ఓపెనర్ ఆమ్లా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సాహాను ఓపెనర్ గా ప్రయత్నించిన పంజాబ్ వ్యూహం ఫలించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు. ఇక మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహా లు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు పిండుకున్నారు. ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది. వేగంగా ఆడుతున్న మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్, సాహా తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మాక్స్ వెల్ హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్ లు బాదడంతో జట్టుకు 21 పరుగులు చేరాయి. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసిన మాక్స్ వెల్ బూమ్రా బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షాన్ మార్ష్ తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు. హార్భజన్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సాహా కి తోడుగా మార్ష్ కూడా చెలరేగడంతో 15 ఓవర్లకే పంజాబ్ 173 పరుగులు చేయగలిగింది.ఈ తరుణంలో భారీ షాట్ కుప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన వారంతా పోటా పోటిగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పంజాబ్ 18 ఓవర్లోనే 200 పరుగులకు చేరుకొంది. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధికంగా 230 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కరణ్ శర్మ, మెక్లిన్ గన్ లకు తలో వికెట్ దక్కింది. -
2014 సీజన్ పునరావృతం చేస్తాం:సాహా
కొల్కతా: గత సీజన్లో చతికిలపడి పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన కింగ్స్ పంజాబ్ జట్టు ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విజయాలకు కారణం డ్రెస్సింగ్‌రూం వాతవరణమే కారణమని పంజాబ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా ఇది 2014 సీజన్‌లా కొనసాగుతుందన్నాడు. 2014 సీజన్ ఫైనల్లో కొల్కతా నైట్‌రైడర్స్‌తో ఓడి పంజాబ్ రన్నరప్‌గా నిలిచింది. అప్పుడున్న వాతవరణమే ఇప్పుడుందని సాహా పేర్కొన్నాడు. ఈ సీజన్లో కూడా ఫైనల్‌కు చేరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఆ సీజన్లో పంజాబ్ 5 విజయాలు నమోదు చేసిందని గుర్తు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ సూచనలు మాకు ప్రయోజనమయ్యాయని, ఇప్పటికే జరిగిన మ్యాచ్‌ల్లో అవి కనపడ్డాయని సాహా పేర్కొన్నాడు. ప్రత్యర్ధి జట్టుకు పరుగులివ్వకుండా కట్టడి చేస్తున్నామని ఇది జట్టుకు లాభదాయకమని సాహా పేర్కొన్నాడు. మా జట్టులో ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్ లేదని, పరిస్ధితులను బట్టి బ్యాట్స్మన్లు క్రీజులోకి వస్తారన్నాడు. మాక్స్వెల్ మంచి దూకుడైన ఆటగాడని ఈ విషయంలో ఎలాంటి సందేహాం లేదని సాహా తెలిపాడు. రేపు జరిగే కొల్కతా మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మా బౌలింగ్, బ్యాటింగ్ లైనప్, పటిష్టంగా ఉందన్నాడు. కొల్కతా ముంబైతో ఓడిపోవడం, క్రిస్‌లీన్ గాయపడటం మాకు కలిసొచ్చె విషయమని సాహా వ్యాఖ్యానించాడు. పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై 8 వికెట్ల తేడాతో, పుణే పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి దూకుడు మీద ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు చేజింగ్‌లోనే పంజాబ్ నెగ్గింది. గురువారం కొల్కతాతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. -
జడేజా హాఫ్ సెంచరీ..భారత్ ఆధిక్యం
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అర్ధ శతకం సాధించిన జడేజా.. చివరిదైన నాల్గో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భారత జట్టు కష్టాల్లో పడిన సమయంలో జడేజా 83 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ద శతకం సాధించాడు. దాంతో తిరిగి తేరుకున్న భారత్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 248/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు నిలకడగా ఆడుతూ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును లంచ్ లోపే అధిగమించింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు జడేజా-వృద్ధిమాన్ సాహాలు బాధ్యతాయుతంగా ఆడి టీమిండియా పైచేయి సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఒకవైపు జడేజా దూకుడును కొనసాగిస్తే, సాహా మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. ఈ జోడి 96 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన తరువాత జడేజా(63;95 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. -
ఇదే నా బెస్ట్ సెంచరీ: సాహా
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ సాధించిన భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కెరీర్లో ఇదే నా బెస్ట్ సేంచరీ అని అభిప్రాయపడ్డాడు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో నాల్గోరోజు సాహా 233 బంతుల్లో 117 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేరీర్లో ఇప్పటి వరకు సాధించిన నాల్గు సెంచరీల్లో ఇదే అత్యుత్తమమైనదిగా అభివర్ణించాడు. పుజారాతో 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినందుకు గర్వంగా ఉందన్నాడు. మా భాగస్వామ్యం నెమ్మదిగా మొదలై పుజారా డబుల్ సెంచరీ, నేను శతకం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇప్పుడు నా బ్యాటింగ్ మెరుగుపడినట్లు భావిస్తున్నాని చెప్పాడు. కానీ నా బ్యాటింగ్ శైలి ఏ మాత్రం మార్చలేదన్నాడు. ఎక్కువగా స్వీప్ షాట్లు ఆడనాని, ఆటలో ఉన్న నా సందేహాలను నివృత్తి చేసుకోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపాడు. నాకు జట్టు మద్దతు ఇస్తుందనీ, ఇది నాపై మంచి ప్రభావం చూపుతుందన్నాడు. పుజారా ఎంతో ఓపికతో ఆడాడని, అతనికి డబుల్ సెంచరీలు చేయడం సర్వసాధారణమని చెప్పాడు. పుజారా డొమెస్టిక్ క్రికెట్లో ఎన్నోసార్లు 200-300 పరుగులు సాధించాడని సాహా తెలిపాడు. పుజారా ఒక వైపు సహచరులు ఔటవుతున్న చక్కటి షాట్లతో బ్యాటింగ్ చేశాడని, దీంతో ఓ మంచి భాగస్వామ్యం నమోదు చేశామని పేర్కొన్నాడు. ఆసీస్ బౌలర్ హజల్‌వుడ్ స్లేడ్జింగ్కు పాల్పడ్డాడని మేము మాత్రం స్పందించలేదని తెలిపాడు. హాజల్‌వుడ్ తనతో ఎదో చెప్పాలని ప్రయత్నిస్తే.. వెనక్కి వెళ్లి బౌల్ చేయమన్నట్లు సూచించానన్నాడు. అయితే పుజారా, సాహా భాగస్వామ్యం, జడేజా మెరుపు బ్యాటింగ్‌తో భారత్ ఆసీస్‌పై 152 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 603/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆసీస్ 23 పరుగులకు రెండు వికెట్లు కోల్పొయింది. -
రాంచీ టెస్టులో నవ్వుల్.. నవ్వుల్!
రాంచీ: భారత్- ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో డీఆర్ఎస్ వివాదం, స్లెడ్జింగ్లతో ఇరు జట్ల మధ్య వాతావరణం వేడిక్కింది. కానీ రాంచీలోజరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాస్యపూరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ 97 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా ఇది జరిగింది. జడేజా 80వ ఓవర్లో వేసిన బంతిని స్మిత్ ఢిఫెన్స్ ఆడగా బంతి బ్యాట్‌కు తగిలి అతని ప్యాడ్లల్లో ఇరుక్కుంది. దీనిని అందుకోవాలని ప్రయత్నించిన భారత కీపర్ వృద్దిమాన్ సాహా స్మిత్‌తో కుస్తీ పడ్డాడు. అయితే స్మిత్ మాత్రం చాకచక్యంగా ప్రవర్తించి కింద కూర్చున్నాడు. సాహా వెంటనే అప్పీల్ చేయగా అంపైర్ ఇయాన్ గౌల్డ్ లోలోపల నవ్వుకున్నారు. దీంతో స్టేడియం అంతా నవ్వులు పూసాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్టర్లో ‘క్యాచ్ అండ్ అప్పీల్’ అని ట్వీట్ చేసింది. కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ముకుంద్‌కు మళ్లీ పిలుపు
పార్థివ్ స్థానంలో సాహా బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఐదున్నరేళ్ల క్రితం భారత్ తరఫున తన చివరి టెస్టు ఆడిన తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌కు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది. బంగ్లాదేశ్‌తో ఈనెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్‌లో జరిగే ఏకైక టెస్టు కోసం మంగళవారం ప్రకటించిన భారత జట్టులో ముకుంద్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్ కోసం సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ముకుంద్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. 2016–17 రంజీ సీజన్లో 4 సెంచరీలు సహా 849 పరుగులు చేసి అతను సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. విజయ్, లోకేశ్ రాహుల్ రూపంలో ప్రధాన ఓపెనర్లు కూడా జట్టులో ఉండటంతో ముకుంద్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నా... 27 ఏళ్ల వయసులో అతను జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. మరోవైపు ఊహించినట్లుగానే రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల తర్వాత గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. సాహా స్థానంలో వచ్చిన పార్థివ్ పటేల్ మిగిలిన మూడు టెస్టుల్లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పినట్లు సాహాకే మొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఇరానీ కప్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ చెలరేగి సాహా డబుల్ సెంచరీ కూడా చేయడం అతనికి కలిసొచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జట్టుతో పాటే ఉన్నా, మ్యాచ్ ఆడే అవకాశం దక్కని మనీశ్ పాండేని కూడా తప్పించారు. గాయాల నుంచి కోలుకున్న విజయ్, రహానే, జయంత్, హార్దిక్ పాండ్యాలను కూడా టెస్టు జట్టులోకి ఎంపిక చేయగా, ఇంకా కోలుకొని షమీ పేరును పరిశీలించలేదు. భారత జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, కరుణ్ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, ఇషాంత్, భువనేశ్వర్, మిశ్రా, ముకుంద్, పాండ్యా. ‘ఎ’ జట్టులో సిరాజ్, రాహుల్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఈనెల 16 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా జట్టు ముంబైలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో తలపడే భారత్ ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. హైదరాబాద్ పేసర్ సిరాజ్, హైదరాబాద్‌కే చెందిన సర్వీసెస్ బ్యాట్స్‌మన్ రాహుల్ సింగ్‌లకు స్థానం లభించింది. జట్టు వివరాలు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అఖిల్, ప్రియాంక్, శ్రేయస్, అంకిత్ బావ్నే, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, నదీమ్, గౌతమ్, కుల్దీప్ యాదవ్, నవదీప్, దిండా, సిరాజ్, రాహుల్ సింగ్, ఇంద్రజిత్. ఆరు గంటలు ఆలస్యంగా... భారత జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా హైడ్రామా నడిచింది. సుప్రీం కోర్టు కొత్తగా నియమించిన కమిటీ ఈ ప్రక్రియను సరైన పద్ధతిలో నిర్వహించాలని పట్టుదల కనబర్చడమే దానికి కారణం. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్వీనర్ హోదాలో ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయత్నించగా పరిపాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ అందుకు అనుమతించలేదు. అమితాబ్‌కు అర్హత లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సమావేశం ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తనకు తెలీదంటూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూడా సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్ హోటల్ బయట తచ్చాడుతూ కనిపించారు. చివరకు సాయంత్రం ఆరు గంటలకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్లి ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. బీసీసీఐలో ఈ తరహా గందరగోళానికి త్వరలోనే తెర పడితే బాగుంటుందని, ప్రతీ రోజూ చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిగా మారాయని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డారు. -
రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
సాహా డబుల్ సెంచరీ పుజారా అజేయ శతకం ముంబై: రెస్టాఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్‌ను నిలబెట్టుకుంది. మంగళవారం ఇక్కడ ముగిసిన ఐదు రోజుల మ్యాచ్‌లో రెస్ట్ జట్టు ఆరు వికెట్ల తేడాతో రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. వృద్ధిమాన్ సాహా (272 బంతుల్లో 203 నాటౌట్; 26 ఫోర్లు, 6 సిక్సర్లు) డబుల్ సెంచరీ, చతేశ్వర్ పుజారా (238 బంతుల్లో 116; 16 ఫోర్లు) సెంచరీ సహాయంతో రెస్టాఫ్ ఇండియా 4 వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 266/4తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. చివరి రోజు రెస్ట్ జట్టు 19.1 ఓవర్లలో 113 పరుగులు సాధించగా, సాహా, పుజారా ఐదో వికెట్‌కు అభేద్యంగా 316 పరుగులు జోడించారు. ఇరానీ కప్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ఈ ట్రోఫీని రంజీ విజేత 27 సార్లు గెలవగా, ఇప్పుడు రెస్టాఫ్ ఇండియా కూడా 27 టైటిల్స్‌తో దానిని సమం చేసింది. చివరి రోజు ఛేదనలో సాహా, పుజారాలకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. అనుభవం లేని గుజరాత్ బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు అలవోకగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో ముందుగా పుజారా 215 బంతుల్లో తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 37వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాహా, 270 బంతుల్లో కెరీర్లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. ఇరానీ కప్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఒక బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ పొరపాట్లపై గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ మరోసారి బహిరంగంగా తన అసంతృప్తిని ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాట్‌కు బంతి తగలకుండానే అవుట్ ఇచ్చాడంటూ ‘మీరు అసలు అంపైరింగ్ ఎందుకు చేస్తారు’ అని నేరుగా అంపైర్ మొహంపైనే ప్రశ్నించడం వివాదం రేపింది. -
కుంబ్లే సలహా.. సాహా విశ్రాంతి
న్యూఢిల్లీ:ఇటీవల తన సత్తా చాటుకుంటూ భారత క్రికెట్ జట్టులో వృద్ధిమాన్ సాహా కీలక ఆటగాడిగా మారిపోయాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రెండు హాఫ్ సెంచరీలు సాధించి పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే టెస్టు సిరీస్ కు ముగిసిన తరువాత ఆ ప్లేయర్ కు టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఒక సలహా సూచించాడట. రంజీ టోర్నీ ఆరంభమైన తరుణంలో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్న సాహాను కనీసం రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండమని కుంబ్లే సలహా ఇచ్చాడట. దాంతో బెంగాల్ ఆడనున్న తొలి రెండు రంజీ మ్యాచ్ లకు సాహా దూరంగా ఉండనున్నాడు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్ లతో ఆడే రంజీ మ్యాచ్ ల్లో సాహా పాల్గొనడం లేదనే విషయాన్ని బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ తెలిపాడు. 'కుంబ్లే సలహా మేరకు తొలి రెండు రంజీ మ్యాచ్‌లకు సాహా దూరంగా ఉండనున్నాడు. భారత్ కు వరుస టెస్టు సిరీస్ ల నేపథ్యంలో సాహాను కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోమని కుంబ్లే చెప్పాడు. ఈ క్రమంలోనే బెంగాల్ ఆడే మొదటి రెండు మ్యాచ్ ల్లో సాహా ఆడే అవకాశం లేదు. త్వరలో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఉండటంతో సాహాపై చాలా భారం ఉంది. ఇది కేవలం అతను తీసుకునే సూచనపరమైన విశ్రాంతి మాత్రమే' అని తివారీ పేర్కొన్నాడు. అయితే అక్టోబర్ 27 నుంచి రైల్వేస్ తో జరిగే మ్యాచ్ కు సాహా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తో సిరీస్ నేపథ్యంలో రైల్వేస్ తో జరిగే మ్యాచ్‌ను సాహా ప్రాక్టీస్ కు ఉపయోగించుకోవచ్చు. -
అశ్విన్, సాహా సెంచరీలు
-
అశ్విన్, సాహా సెంచరీలు
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 353 వెస్టిండీస్‌తో మూడో టెస్టు గ్రాస్ ఐలెట్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు తడబడిన భారత జట్టును ఆర్.అశ్విన్ (297 బంతుల్లో 118; 6 ఫోర్లు; 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (227 బంతుల్లో 104; 13 ఫోర్లు) వీరోచిత శతకాలతో ఆదుకున్నారు. దీంతో కోహ్లిసేన తొలి ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 353 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌటయింది. 126 పరుగులకు ఐదు వికెట్లు పడిన దశలో అశ్విన్, సాహా అద్భుత బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయారు. రెండో రోజు లంచ్ విరామం అనంతరం అశ్విన్ భారీ సిక్స్‌తో కెరీర్లో నాలుగో సెంచరీ సాధించాడు. అశ్విన్ నాలుగు సెంచరీలూ వెస్టిండీస్‌పైనే రావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే సాహా కెరీర్లో తొలి సెంచరీ చేశాడు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ 213 పరుగులు జతచేశారు. విండీస్ బౌలర్లు భారత్ చివరి నాలుగు వికెట్లను కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే తీశారు. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) బ్రాత్‌వైట్ (బి) చేజ్ 50; ధావన్ (సి) డౌరిచ్ (బి) గాబ్రియల్ 1; కోహ్లి (సి) బ్రేవో (బి) జోసెఫ్ 3; రహానే (బి) చేజ్ 35; రోహిత్ (సి) డౌరిచ్ (బి) జోసెఫ్ 9; అశ్విన్ ; సాహా (సి) డౌరిచ్ (బి) జోసెఫ్ 104; జడేజా (సి) డౌరిచ్ (బి) కమ్మిన్స్ 6; భువనేశ్వర్ జాన్సన్ గాబ్రియల్ 0; షమీ నాటౌట్ 0; ఇషాంత్ (సి) జాన్సన్ (బి) కమ్మిన్స్ 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (129.4 ఓవర్లలో ఆలౌట్) 353. వికెట్ల పతనం: 1-9, 2-19, 3-77, 4-87, 5-126, 6-339, 7-351, 8-353, 9-353, 10-353. బౌలింగ్: గాబ్రియల్ 23-4-84-2; జోసెఫ్ 24-6-69-3; కమిన్స్ 21.4-8-54-3; హోల్డర్ 19-7-34-0; చేజ్ 33-9-70-2 ; బ్రాత్‌వైట్ 9-1-27-0. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో వికెట్ నష్టపోయి 107 పరుగులు చేసింది. -
సెంచరీ భాగస్వామ్యం టీమిండియాకు కీలకం
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) అజేయ సెంచరీ భాగస్వామ్యం జట్టుకు చాలా కీలకమని భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ పేర్కొన్నాడు. 126/5 తో ఉన్న భారత్‌ను అశ్విన్, సాహా విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నారని, బ్యాట్స్ మన్ ఇప్పుడైనా బాధ్యతాయుతంగా క్రీజులో నిలవాలని సూచించాడు. 180-200 పరుగుల లోపే టీమిండియా ఆలౌట్ అవుతుందని తాను భావించానని, అయితే అశ్విన్, సాహా ఆరో వికెట్ కు అజేయ సెంచరీ(108) భాగస్వామ్యంతో భారత్ తిరిగి కోలుకుందన్నాడు. 'బ్యాటింగ్ కు దిగిన వెంటనే పిచ్ పరిస్థితి అర్థం చేసుకున్నాను. పరుగులు చేయడానికి చాలా కష్టంగా ఉంది. అందుకే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ విండీస్ పై ఒత్తిడి పెంచాలనుకున్నాను. విండీస్ బౌలర్లు రాణించారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో ఇబ్బందిపెట్టారు' అని రాహుల్ వివరించాడు. ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయినా చివరికి తొలిరోజు ఆటతో చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. లోకేష్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. -
విండీస్‌కు పరీక్ష పెట్టిన అశ్విన్, సాహా!
► 90ఓవర్లలో భారత్ 234/5 ►రాహుల్, అశ్విన్ అర్ధశతకాలు ►రాణించిన వృద్ధిమాన్ సాహా గ్రాస్‌ఐలట్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరికి మనదే పైచేయి అనిపించారు. డారెన్ స్యామీ స్టేడియంలో మంగళవారం మొదలైన మూడో టెస్టులో తొలి రోజు టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసిన జట్టు రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) నిలకడ బ్యాటింగ్ తీరుతో 90 ఓవర్లలో ఆట ముగిసే సమయానికి 234/5తో కోలుకుంది. రెండొందల పరుగుల లోపే ఆలౌటవుతుందనుకున్న టీమిండియాను అశ్విన్, సాహా వికెట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రాధాన్యమిస్తూ పట్టుదలతో క్రీజులో నిలిచి, చివరికి తొలిరోజు భారత్‌కు మంచి భాగస్వామ్యం అందించారు. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. రహానే (133 బంతుల్లో 35; 4 ఫోర్లు) సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచినా పెద్దగా పరుగులు చేయలేదు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కోహ్లి (3), రోహిత్ శర్మ (9) విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన జోసెఫ్ రెండు వికెట్లు తీయగా, ఛేజ్‌కూ రెండు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. ఉమేశ్ స్థానంలో భువనేశ్వర్, పుజారా స్థానంలో రోహిత్, మిశ్రా స్థానంలో జడేజా తుది జట్టులోకి వచ్చారు. విండీస్ కు చుక్కలు చూపించారు! ఓ దశలో 126/5 తో ఉన్న భారత్‌ను అశ్విన్, సాహా ఆదుకున్నారు. వికెట్ పడకుండా 40 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి వీరిద్దరూ విండీస్ బౌలర్ల సహానాన్ని పరీక్షించారు. చివరి సెషన్లో 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ 104 పరుగులు జత చేసింది. అయితే ఇందులో 46 పరుగులు చివరి 9 ఓవర్లలో వచ్చాయంటేనే ఈ ఇద్దరూ కరీబియన్లను ఎంతగా ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆరో వికెట్ జోడీని విడదీయడానికి విండీస్ విశ్వప్రయత్నాలు చేసినా విజయం సాధించలేక పోయారు. టాపార్డర్ ను సులువుగా పెవిలియన్ బాట పట్టించిన విండీస్ బౌలర్లు అశ్విన్, సాహాలను ఔట్ చేయలేక నానాతిప్పలు పడ్డారు. దీంతో టీ విరామం వరకూ కరీబియన్ ఆటగాళ్లలో ఉన్న ఆనందం తర్వాతి సెషన్ నుంచి కొంచెం కొంచెంగా దూరమైంది. మ్యాచ్ తొలిరోజు నిలిపివేసే సమయానికి భారత్ మాత్రం తమ ప్రదర్శన పట్ల హ్యాపీగా ఉంది. ఈ జోడీ మరిన్ని పరుగులును జత చేస్తే విండీస్ కష్టాలు రెట్టింపవుతాయి. -
ధోనికి తొమ్మిది... నాకు రెండున్నర
ఆటగాడిగా, కీపర్‌గా ధోని నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవడం మరే వికెట్ కీపర్‌కూ సాధ్యం కాదని టెస్టు క్రికెటర్ సాహా అన్నాడు. ధోని పదికి తొమ్మిది పాయింట్లు సాధిస్తే... తాను ఇప్పటికి రెండున్నర పాయింట్లు మాత్రమే సాధించానని అభిప్రాయపడ్డాడు. ధోని నీడలోంచి బయటకు రావడానికి చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుందన్నాడు.