మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాస్యపూరితమైన సన్నివేశం చోటు చేసుకుంది.
రాంచీ: భారత్- ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో డీఆర్‌ఎస్ వివాదం, స్లెడ్జింగ్‌లతో ఇరు జట్ల మధ్య వాతావరణం వేడిక్కింది. కానీ రాంచీలోజరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాస్యపూరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ 97 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా ఇది జరిగింది.
జడేజా 80వ ఓవర్లో వేసిన బంతిని స్మిత్ ఢిఫెన్స్ ఆడగా బంతి బ్యాట్‌కు తగిలి అతని ప్యాడ్‌లల్లో ఇరుక్కుంది. దీనిని అందుకోవాలని ప్రయత్నించిన భారత కీపర్ వృద్దిమాన్ సాహా స్మిత్‌తో కుస్తీ పడ్డాడు. అయితే స్మిత్ మాత్రం చాకచక్యంగా ప్రవర్తించి కింద కూర్చున్నాడు. సాహా వెంటనే అప్పీల్ చేయగా అంపైర్ ఇయాన్ గౌల్డ్ లోలోపల నవ్వుకున్నారు. దీంతో స్టేడియం అంతా నవ్వులు పూసాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్టర్‌లో ‘క్యాచ్ అండ్ అప్పీల్’ అని ట్వీట్ చేసింది. కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.