వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌కి ఐపీఎల్-2022 మెగా వేలంలో భారీ ధర దక్కింది. స్మిత్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 6కోట్లకు కొనుగోలు చేసింది. కాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో స్మిత్ అద్భుతంగా రాణించాడు. టీమిండియాతో రెండు వన్డేలు ఆడిన స్మిత్ 60 పరుగలతో పాటు, మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2021లో కూడా స్మిత్ రాణించాడు.
ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా స్మిత్ నిలిచాడు. స్మిత్ బ్యాట్‌తోను, బాల్‌తోను విద్వంసం సృష్టించగలడు. అందుకే పంజాబ్ అతడిని పోటీ పడి మరి దక్కించుకుంది. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు భారీ ధర దక్కింది. వేలంలో లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.
చదవండి: IPL 2022 Mega Auction: టీమిండియా కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధర ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment