India - Australia Test
-
ఆంక్షల్లో సడలింపులివ్వండి
న్యూఢిల్లీ: భారత్–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో చర్చనీయాంశంగా నిలుస్తోన్న బ్రిస్బేన్ టెస్టు క్వారంటైన్ నిబంధనల్ని సడలించాలని పేర్కొంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు లేఖ రాసింది. పర్యటన ప్రారంభంలోనే టీమిండియా కఠిన ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్నందున మళ్లీ నాలుగో టెస్టు కోసం బ్రిస్బేన్‌లో నిర్బంధంలో ఉండటం కష్టమని లేఖలో స్పష్టం చేసింది. సిరీస్ కోసం ఇరు బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందంలోనూ రెండు వేర్వేరు నగరాల్లో భారత జట్టు రెండుసార్లు కఠిన ఐసోలేషన్ పాటిస్తుందని ఎక్కడా పేర్కొనలేదని గుర్తు చేసింది. ఈనెల 15నుంచి బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు జరగనుంది. బ్రిస్బేన్ ఉన్న క్వీన్స్లాండ్ రాష్ట్రం కరోనా కట్టడి నిబంధనల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం కేవలం వారి గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే యూఏఈలో ఐపీఎల్ ముగించుకొని ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు అప్పుడే సిడ్నీలో ఈ తరహా కఠిన క్వారంటైన్‌ను పాటించింది. మళ్లీ బ్రిస్బేన్‌లో గదులకే పరిమితం అవ్వడాన్ని ఇబ్బందిగా భావిస్తోన్న భారత క్రీడాకారులు... హోటల్లోని బయోబబుల్‌లో సహచరులతో కలిసి భోజనం చేసేందుకు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు పేర్కొన్న ప్రకారం ఒకే అంతస్థులో ఉండే ఆటగాళ్లు కలుసుకోవచ్చు, కానీ వేరే అంతస్థులో ఉంటోన్న సహచరులతో దూరం పాటించాలి. ఇలాంటి నిబంధనలనే సడలించాలని లేఖలో కోరిన బీసీసీఐ, ఆటగాళ్లు ఐపీఎల్ తరహా బయోబబుల్ నిబంధనల్ని కోరుకుంటున్నట్లు చెప్పింది. భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సైతం బయటంతా మామూలుగా ఉన్నప్పుడు కేవలం హోటల్ గదులకే పరిమితం కావడం సవాలుతో కూడుకున్నదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
ఐపీఎల్ కోసమే కోహ్లీ మ్యాచ్‌కు దూరం
మెల్బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసమే నాల్గో టెస్టు మ్యాచ్ దూరమయ్యాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం హాడ్జ్ గుజరత్ లయన్స్ ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా ఫిట్నెస్ లేకపోవడంతో భారత్-ఆస్ట్రేలియా ధర్మశాల టెస్టుకు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై హాడ్జ్ తన అభిప్రాయాన్ని ఆసీస్ మీడియాతో పంచుకున్నాడు. సీరీస్‌లో కీలకమైన మ్యాచ్‌లో కోహ్లి ఆడకపోవడాన్ని బ్రాడ్ హాడ్జ్ తప్పుబట్టాడు. ఎప్రిల్ 5న జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్- రాయల్ చాలేంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసమే కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడిని హడ్జ్ వ్యాఖ్యానించాడు. రాయల్ చాలేంజర్స్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ గాయంతో గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఆడడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రతి ఒక క్రికెటర్‌కు ముఖ్యమన్నాడు. ఐపీఎల్ అందరి క్రికెటర్లకు డబ్బులు సంపాదించిపెడ్తుందని, కోహ్లికి కూడా బెంగళూరు చాలేంజర్స్ చాల డబ్బులు ఇచ్చిందని తెలిపాడు. అయితే కోహ్లీ తిరిగి ఐపీఎల్లో ఆడటం తమకు బాధ కల్గించే విషయమేనని పేర్కొన్నాడు. అయితే కోహ్లి మాత్రం ధర్మశాల టెస్టుకు ఒక రోజు ముందే 100 శాతం ఫిట్‌అని తేలితే మాత్రమే ఆడుతానని చెప్పిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ కావడంతో కోహ్లీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కోహ్లీ ఐపీఎల్‌కు తిరిగిరాకపోవడం ఎంతో మంది క్రికెటర్లకు మేలు చేస్తుందని హాడ్జ్ తెలిపాడు. అయితే గాయపడ్డ కోహ్లీ డ్రింక్స్ బాటిళ్లు అందించడం తనని అయోమయానికి గురిచేసిందన్నాడు. తను అలా చేయడం అనవసరమని పేర్కొన్నాడు. గాయంతో మ్యాచ్‌కు దూరమైనపుడు డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోవాలని, కానీ రహానేకు సలహాలు ఇవ్వడం మంచిది కాదన్నాడు. బ్రాడ్ హాడ్జ్ ఆసీస్ తరపున 5 టెస్టులు 25 వన్డేలు ఆడాడు. -
రాంచీ టెస్టులో నవ్వుల్.. నవ్వుల్!
రాంచీ: భారత్- ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో డీఆర్ఎస్ వివాదం, స్లెడ్జింగ్లతో ఇరు జట్ల మధ్య వాతావరణం వేడిక్కింది. కానీ రాంచీలోజరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాస్యపూరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ 97 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా ఇది జరిగింది. జడేజా 80వ ఓవర్లో వేసిన బంతిని స్మిత్ ఢిఫెన్స్ ఆడగా బంతి బ్యాట్‌కు తగిలి అతని ప్యాడ్లల్లో ఇరుక్కుంది. దీనిని అందుకోవాలని ప్రయత్నించిన భారత కీపర్ వృద్దిమాన్ సాహా స్మిత్‌తో కుస్తీ పడ్డాడు. అయితే స్మిత్ మాత్రం చాకచక్యంగా ప్రవర్తించి కింద కూర్చున్నాడు. సాహా వెంటనే అప్పీల్ చేయగా అంపైర్ ఇయాన్ గౌల్డ్ లోలోపల నవ్వుకున్నారు. దీంతో స్టేడియం అంతా నవ్వులు పూసాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్టర్లో ‘క్యాచ్ అండ్ అప్పీల్’ అని ట్వీట్ చేసింది. కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.