ఐపీఎల్ కోసమే కోహ్లీ మ్యాచ్‌కు దూరం
మెల్‌బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసమే నాల్గో టెస్టు మ్యాచ్ దూరమయ్యాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం హాడ్జ్ గుజరత్ లయన్స్ ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా ఫిట్‌నెస్ లేకపోవడంతో భారత్-ఆస్ట్రేలియా ధర్మశాల టెస్టుకు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై హాడ్జ్ తన అభిప్రాయాన్ని ఆసీస్ మీడియాతో పంచుకున్నాడు. సీరీస్‌లో కీలకమైన మ్యాచ్‌లో కోహ్లి ఆడకపోవడాన్ని బ్రాడ్ హాడ్జ్ తప్పుబట్టాడు. ఎప్రిల్ 5న జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్- రాయల్ చాలేంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసమే కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడిని హడ్జ్ వ్యాఖ్యానించాడు.
రాయల్ చాలేంజర్స్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ గాయంతో గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఆడడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రతి ఒక క్రికెటర్‌కు ముఖ్యమన్నాడు. ఐపీఎల్ అందరి క్రికెటర్లకు డబ్బులు సంపాదించిపెడ్తుందని, కోహ్లికి కూడా బెంగళూరు చాలేంజర్స్ చాల డబ్బులు ఇచ్చిందని తెలిపాడు. అయితే కోహ్లీ తిరిగి ఐపీఎల్‌లో ఆడటం తమకు బాధ కల్గించే విషయమేనని పేర్కొన్నాడు. అయితే కోహ్లి మాత్రం ధర్మశాల టెస్టుకు ఒక రోజు ముందే 100 శాతం ఫిట్‌అని తేలితే మాత్రమే ఆడుతానని చెప్పిన విషయం తెలిసిందే. ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ కావడంతో కోహ్లీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కోహ్లీ ఐపీఎల్‌కు తిరిగిరాకపోవడం ఎంతో మంది క్రికెటర్లకు మేలు చేస్తుందని హాడ్జ్ తెలిపాడు. అయితే గాయపడ్డ కోహ్లీ డ్రింక్స్ బాటిళ్లు అందించడం తనని అయోమయానికి గురిచేసిందన్నాడు. తను అలా చేయడం అనవసరమని పేర్కొన్నాడు. గాయంతో మ్యాచ్‌కు దూరమైనపుడు డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోవాలని, కానీ రహానేకు సలహాలు ఇవ్వడం మంచిది కాదన్నాడు. బ్రాడ్ హాడ్జ్ ఆసీస్ తరపున 5 టెస్టులు 25 వన్డేలు ఆడాడు.