నా ఫేవరేట్ ఐపీఎల్ టీం అదే.. మనసులో మాట చెప్పేసిన శ్రీవల్లి | Rashmika Mandanna Express Names Her Favourite IPL Cricketer And Team | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: నా ఫేవరేట్ క్రికెటర్‌ అతనే: రష్మిక మందన్నా

May 1 2023 8:55 PM | Updated on May 1 2023 9:00 PM

Rashmika Mandanna Express Names Her Favourite IPL Cricketer And Team - Sakshi

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ డమ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్‌లో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప-2లో బన్నీ సరసన మరోసారి ‍అలరించనుంది. ఇప్పటికే పుష్ప-2 షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది శాండల్‌వుడ్ భామ. 

(ఇది చదవండి: సోషల్‌ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక)

అయితే ఈ ఏడాది ఐపీఎల్-2023 ప్రారంభోత్సవంలో తమన్నా భాటియాతో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఫేవరేట్‌ జట్టు గురించి మనసులోని మాటను బయటపెట్టింది. అంతే కాకుండా తన ఫేవరేట్ క్రికెటర్‌  ఎవరో చెప్పేసింది ముద్దుగుమ్మ. 

రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ' నేను కర్ణాటక నుంచి వచ్చా. ఈసారి ఐపీఎల్ తప్పకుండా ఆర్సీబీ గెలుస్తుందని ఆశిస్తున్నా.( ఈ సాలా కప్ నమ్దే) . ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆర్సీబీ ఆటను ఆస్వాదిస్తున్నా. ఐపీఎల్‌లో నా ఫేవరేట్ క్రికెటర్ విరాట్ సర్. అతను ఓ స్వాగర్. అతనొక అద్భుతం.' అంటూ కొనియాడింది. కాగా.. ప్రస్తుతం దేవ్‌మోహన్‌తో కలిసి రెయిన్‌బో చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. మరోవైపు టాలీవుడ్ హీరో నితిన్‌తో ఓ చిత్రంలో కనిపించనుంది.

(ఇది చదవండి: మహారాణి పాత్రలో నటించనున్న రష్మిక మందన్నా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement