PC: IPL.com
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ భుజం గాయం కారణంగా దూరమయ్యాడు.
బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా టాప్లీ భుజంకు గాయమైంది. ఈ క్రమంలో అతడు నొప్పితో మైదానంలో విలవిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అదించనప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడు ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో టాప్లే గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో డేవిడ్ విల్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడిన టాప్లే తన స్వదేశానికి వెళ్లనున్నట్లు ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా సృష్టం చేశాడు. అతడి స్థానంలో మరో విదేశీ ఆటగాడిని భర్తీ చేయనున్నట్లు బంగర్ తెలిపాడు.
"టాప్లే తన స్వదేశానికి వెళ్లనున్నాడు. అతడు మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని రిప్లేస్ చేయనున్నాం" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగర్ పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు జోష్ హేజిల్‌వుడ్, రజత్ పాటిదార్, విల్ జాక్స్ గాయం కారణంగా ఐపీఎల్-2023కు దూరమయ్యారు. కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘోర పరాజయం పాలైంది.
చదవండి: RCB: అర్థం కాని ఆర్‌సీబీ.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు
Comments
Please login to add a commentAdd a comment