వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు తడబడిన భారత జట్టును ఆర్.అశ్విన్ (297 బంతుల్లో 118; 6 ఫోర్లు; 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (227 బంతుల్లో 104; 13 ఫోర్లు) వీరోచిత శతకాలతో ఆదుకున్నారు. దీంతో కోహ్లిసేన తొలి ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 353 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌటయింది. 126 పరుగులకు ఐదు వికెట్లు పడిన దశలో అశ్విన్, సాహా అద్భుత బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయారు.