అశ్విన్, సాహా సెంచరీలు
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 353
వెస్టిండీస్‌తో మూడో టెస్టు
గ్రాస్ ఐలెట్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు తడబడిన భారత జట్టును ఆర్.అశ్విన్ (297 బంతుల్లో 118; 6 ఫోర్లు; 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (227 బంతుల్లో 104; 13 ఫోర్లు) వీరోచిత శతకాలతో ఆదుకున్నారు. దీంతో కోహ్లిసేన తొలి ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 353 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌటయింది. 126 పరుగులకు ఐదు వికెట్లు పడిన దశలో అశ్విన్, సాహా అద్భుత బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయారు.
రెండో రోజు లంచ్ విరామం అనంతరం అశ్విన్ భారీ సిక్స్‌తో కెరీర్‌లో నాలుగో సెంచరీ సాధించాడు. అశ్విన్ నాలుగు సెంచరీలూ వెస్టిండీస్‌పైనే రావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే సాహా కెరీర్‌లో తొలి సెంచరీ చేశాడు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ 213 పరుగులు జతచేశారు. విండీస్ బౌలర్లు భారత్ చివరి నాలుగు వికెట్లను కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే తీశారు.
స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) బ్రాత్‌వైట్ (బి) చేజ్ 50; ధావన్ (సి) డౌరిచ్ (బి) గాబ్రియల్ 1; కోహ్లి (సి) బ్రేవో (బి) జోసెఫ్ 3; రహానే (బి) చేజ్ 35; రోహిత్ (సి) డౌరిచ్ (బి) జోసెఫ్ 9; అశ్విన్ ; సాహా (సి) డౌరిచ్ (బి) జోసెఫ్ 104; జడేజా (సి) డౌరిచ్ (బి) కమ్మిన్స్ 6; భువనేశ్వర్ జాన్సన్ గాబ్రియల్ 0; షమీ నాటౌట్ 0; ఇషాంత్ (సి) జాన్సన్ (బి) కమ్మిన్స్ 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (129.4 ఓవర్లలో ఆలౌట్) 353. వికెట్ల పతనం: 1-9, 2-19, 3-77, 4-87, 5-126, 6-339, 7-351, 8-353, 9-353, 10-353. బౌలింగ్: గాబ్రియల్ 23-4-84-2; జోసెఫ్ 24-6-69-3; కమిన్స్ 21.4-8-54-3; హోల్డర్ 19-7-34-0; చేజ్ 33-9-70-2 ; బ్రాత్‌వైట్ 9-1-27-0.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో వికెట్ నష్టపోయి 107 పరుగులు చేసింది.