Daniel Hughes
-
పుజారాకు నిరాశ..!
లండన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా వచ్చే ఏడాది కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోడని గురువారం ససెక్స్ క్లబ్ వెల్లడించింది. పుజారా స్థానంలో ఆ్రస్టేలియా ఆటగాడు డేనియల్ హ్యూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.గత మూడేళ్లుగా ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారాను ఈసారి ఆ క్లబ్ రిటైన్ చేసుకోలేదు. ‘పుజారాను కాదని హ్యూస్‌ను ఎంపిక చేసుకోవడం కష్టమైన పనే. కానీ, హ్యూస్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. అంతేకాక టి20 మ్యాచ్‌లు కూడా ఆడతాడు. పుజారాకు సరైన ప్రత్యామ్నాయం అతడే అనిపించింది’ అని ససెక్స్ హెడ్ కోచ్ పాల్ ఫార్బస్ అన్నాడు. -
‘హ్యూస్’ గట్టెక్కాడు
మెల్బోర్న్: బంతి తగిలి ఫిలిప్ హ్యూస్ మరణించిన వార్త ఇంకా మరువకముందే అదే తరహాలో మరో ఆసీస్ క్రికెటర్ డానియల్ హ్యూస్ గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ తనకేమీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సిడ్నీలో జరిగిన తొలి గ్రేడ్ మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్ తరఫున బరిలోకి దిగిన డానియల్‌కు బ్లాక్‌టౌన్ జట్టు బౌలర్ నూపియర్ వేసిన బౌన్సర్ గట్టిగా మెడ వెనుక తాకింది. దీంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ప్రమాదమేమీ లేదని తేలింది.