‘హ్యూస్’ గట్టెక్కాడు | hughes was saved | Sakshi
Sakshi News home page

‘హ్యూస్’ గట్టెక్కాడు

Published Sun, Jan 25 2015 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

hughes was saved

మెల్‌బోర్న్: బంతి తగిలి ఫిలిప్ హ్యూస్ మరణించిన వార్త ఇంకా మరువకముందే అదే తరహాలో మరో ఆసీస్ క్రికెటర్ డానియల్ హ్యూస్ గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ తనకేమీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సిడ్నీలో జరిగిన తొలి గ్రేడ్ మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్ తరఫున బరిలోకి దిగిన డానియల్‌కు బ్లాక్‌టౌన్ జట్టు బౌలర్  నూపియర్ వేసిన బౌన్సర్ గట్టిగా మెడ వెనుక  తాకింది. దీంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో  ప్రమాదమేమీ లేదని తేలింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement