
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ స్థానాన్ని దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జే భర్తీ చేయనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం ప్రకటించింది. 26 ఏళ్ల నోర్జేకు ఇదే తొలి ఐపీఎల్ కాగా... దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్టులు, 7 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 20 లక్షల మొత్తానికి నోర్జేను దక్కించుకున్నప్పటికీ భుజం గాయం కారణంగా అతను లీగ్ ఆడలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగం అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు నోర్జే ఇన్‌స్టగ్రామ్ ద్వారా తెలిపాడు. అనారోగ్య కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఢిల్లీ రూ. 1.5 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment