సమావేశంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఖాళీల భర్తీపై రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ముషీరాబాద్‌లో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అ«ధ్యక్షతన నిరుద్యోగ మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ..
ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు రాజీనామా చేసినా, సభ్యులు మరణించినా ఆరు నెలల్లోపు భర్తీ చేయాలని రాజ్యాంగం చెబుతుందన్నారు. అయితే ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన 10 నుంచి 20 ఏళ్ల వరకు భర్తీ చేయడం లేదన్నారు. అన్ని రాజకీయ పోరాటాలు ఏకమై పార్లమెంటులో బిల్లు పెట్టి ఖాళీలు ఏర్పడిన నెలలోపు భర్తీ చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment