job placement
-
మేలో నియామకాల్లో క్షీణత
ముంబై: ఉద్యోగ నియామకాల పట్ల కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మే నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చినప్పుడు 7 శాతం తగ్గాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫౌండిట్ (మాన్స్టర్ ఏపీఏసీ అండ్ ఎంఈ) ‘ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్’ పేరుతో నెలవారీ నియామకాల ధోరణులపై నివేదికను విడుదల చేసింది. అహ్మదాబాద్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం నియామకాల పరంగా సానుకూల ధోరణులు కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లో నియామకాల క్షీణత కనిపిస్తోందని, నెలవారీగా చూస్తే మేలో 4 శాతం తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఆర్థిక వృద్ధి నిదానించడంతో వ్యయాలు తగ్గించుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం నియామకాలు తగ్గడానికి కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. నైపుణ్యాల అంతరం ఉండడంతో, అర్హత కలిగిన ఉద్యోగులను గుర్తించడం కంపెనీలకు సవాలుగా మారినట్టు పేర్కొంది. విప్లవాత్మక టెక్నాలజీల పాత్రను కూడా ప్రస్తావించింది. ఇవి పరిశ్రమలు, ఉద్యోగ స్వరూపాలను మార్చివేస్తున్నట్టు తెలిపింది. ఆటోమేషన్ తదితర టెక్నాలజీల ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతున్నట్టు వివరించింది. కొత్త నైపుణ్యాలతోనే రాణింపు..: ‘‘ప్రస్తుత నియామక ధోరణలు భారత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనం. ఈ సవాళ్ల మధ్య ఉద్యోగార్థులకు అవకాశాలను అందించే వృద్ధి విభాగాలు కూడా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో షిప్పింగ్/మెరైన్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు, రిటైల్, రవాణా, పర్యాటక విభాగాల్లో నియామకాలు పెరిగాయి. సమీప కాలానికి సవాళ్లతో కనిపిస్తున్నా, ఆర్థిక వృద్ధి బలపడితే అన్ని రంగాల్లోనూ నియామకాలు తిరిగి పుంజుకుంటాయి. నేడు డిమాండ్ ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తులోనూ రాణిస్తాయని చెప్పలేం. కనుక ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, నూతన నైపుణ్యాలను అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. ఆన్లైన్లో వివిధ ని యామక పోర్టళ్లలోని వివరాల ఆధారంగా నెలవారీగా ఈ నివేదికను ఫౌండిట్ విడుదల చేస్తుంటుంది. హైదరాబాద్‌లోనూ డౌన్ హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ/ఎన్సీఆర్ పట్టణాల్లో మే నెలలో నియామకాలు, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 –16 శాతం తక్కువగా నమోదైనట్టు ఫౌండిట్ తెలిపింది. అహ్మదాబాద్‌లో 8 శాతం పెరగ్గా, బెంగళూరులో 24 శాతం తగ్గాయి. -
International Womens Day: మహిళల హైరింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
ముంబై: దేశీయంగా ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతోంది. కంపెనీల్లో వైట్ కాలర్ ఉద్యోగాల్లో (ఆఫీసుల్లో చేసే) మహిళల రిక్రూట్మెంట్కు సంబంధించి గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో డిమాండ్ 35 శాతం పెరిగింది. జాబ్ ప్లాట్‌ఫామ్ ఫౌండిట్ (గతంలో మాన్స్టర్ ఏపీఏసీ, ఎంఈ) తమ పోర్టల్‌లో నమోదైన హైరింగ్ గణాంకాల ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే దిశగా.. నెలసరి, శిశు సంరక్షణ తదితర సందర్భాల కోసం ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం, కార్యాలయాల్లో పక్షపాత ధోరణులను నిరోధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలాంటి అంశాలపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. అలాగే పని విషయంలో వెసులుబాటు కల్పించడం వంటివి చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు డిమాండ్‌పరంగా చూస్తే ఐటీఈఎస్/బీపీవో రంగంలో అత్యధికంగా 36 శాతం, ఐటీ/కంప్యూటర్స్–సాఫ్ట్వేర్ (35%), బ్యాంకింగ్/అకౌంటింగ్/ఆర్థిక సర్వీసులు (22%)గా ఉంది. -
TS: కొత్త కొలువుల ఏడాది.. వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు జరగనున్నాయి. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీచేయగా, త్వరలో మరికొన్ని కొలువులకు ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వచ్చిన పలు నోటిఫికేషన్లకు సంబంధించి జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవనుంది. వాటికి 2023 ఏడాది మధ్యలో నియామక పరీక్షలు జరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ముందు వెలువడబోయే నోటిఫికేషన్లకు ఆ తర్వాత రాత పరీక్షలు ఉంటాయని అంటున్నాయి. మొత్తంగా 2023 ఏడాది పొడవునా నియామక సంస్థలు ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నిరుద్యోగులు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 42 వేల పోస్టులకు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గత ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 80 వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా పలు పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియామక సంస్థలు 42,293 కొలువులకు ప్రకటనలు జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు 17,516 పోస్టులకు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17,457 పోస్టులకు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 7,320 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాయి. మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా 12వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి. వీటికితోడు ఉపాధ్యాయ పోస్టులు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కూడా ప్రకటనలు వెలువడనున్నాయి. ఈ ఉద్యోగాలన్నింటి భర్తీకి 2023 సంవత్సరమే వేదిక కానుంది. వరుసగా భర్తీ పరీక్షలు ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడిన ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు నిర్వహించేందుకు నియామక సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అదే విధంగా గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా త్వరలో వెలువడనుంది. వచ్చే మే తర్వాత మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఆ పరీక్షల తర్వాత కొంత విరామమిచ్చి గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు అంచనా. ఇదే సమయంలో ఇతర పోస్టులకు సంబంధించి అర్హత పరీక్షలను కూడా నిర్వహించనుంది. మరోవైపు గురుకుల పోస్టులకు సంబంధించి జనవరిలో ప్రకటనలు వెలువడితే.. జూన్ తర్వాత పరీక్షలు జరిగే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలివీ.. ► తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) 17,515 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో 587 సబ్ ఇన్స్పెక్టర్, 16,929 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించిన బోర్డు.. దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత మెయిన్ పరీక్షలను 2023 ఏడాది మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది. ► టీఎస్పీఎస్సీ 2022లో మొత్తంగా 22 నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 కేటగిరీలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులతోపాటు ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో కలిపి 17,457 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేసింది. కీలకమైన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలతోపాటు పలు కేటగిరీల్లో కొలువుల భర్తీకి అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ► తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మొత్తం 7,320 ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ 969, స్టాఫ్ నర్సులు 5,204, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో 1,147 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఎంపిక దాదాపు పూర్తవగా.. మిగతా కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ► తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) సైతం గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కేటగిరీల్లో 12వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. జనవరి నెలాఖరుకల్లా దాదాపు అన్నిరకాల కొలువులకు ప్రకటనలు వెలువడనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ పోస్టులకు 2023 ఏడాదిలోనే అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. -
మరో 10,105 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా జీవో నంబర్ 83 నుంచి 97 వరకు మొత్తం 15 జీవోలను విడివిడిగా జారీ చేశారు. ఈసారి అనుమతి ఇచ్చిన వాటిలో 9,096 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకు లాల్లోనే ఉన్నాయి. ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
AP: టాప్‘ ప్లేస్’!.. మూడేళ్లలో రెట్టింపు..
సాక్షి, అమరావతి: ‘‘మన విద్యార్థులు అత్యుత్తమ నైపుణ్యాలతో ప్రపంచ పౌరులుగా ఎదగాలి. అత్యున్నత స్థాయి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి..’’ ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష! ఆ సంకల్పం ఇపుడు సాకారమవుతోంది. గత మూడేళ్లలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు సంబంధించి మన రాష్ట్ర విద్యార్థుల ప్లేస్మెంట్లు రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య ఏటా 37 వేలు మాత్రమే కాగా ప్రస్తుతం అది 69 వేలకు చేరుకుంది. రానున్న ఒకటి రెండేళ్లలో ఈ సంఖ్య లక్ష దాటుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాల వల్లే ఇది సాకారమైందని స్పష్టం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే కార్యాచరణ సీఎం జగన్ తాను కాంక్షించిన లక్ష్యాల సాధన కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి పాఠశాలల నుంచి ఉన్నత స్థాయి వరకు కీలక సంస్కరణలు, కార్యక్రమాలను చేపట్టారు. విద్యార్ధులు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలకు తగ్గ నైపుణ్యాలతో కాలేజీల నుంచి బయటకు వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీలో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను నెలకొల్పుతున్నారు. 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ శిక్షణ రాష్ట్ర విద్యార్ధులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్, నెట్ వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితరాలపై సర్టిఫికేషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందచేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.37 కోట్ల వరకు వెచ్చించింది. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, క్లౌడ్, డేటా అనలటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఐఓటీ అంశాల్లో రూ.కోట్ల విలువైన శిక్షణ అందేలా చర్యలు తీసుకున్నారు. ఇవే కాకుండా నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ద్వారా లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్ శిక్షణ ఇప్పించారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ప్రెస్’ సంస్థ 50 వేల మందికి శిక్షణ ఇస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హీరోహోండా, మారుతీ సుజికి లాంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బీఎఫ్ఎస్ఐ అనలిస్ట్ తదితర అంశాలలో ఈ శిక్షణ ఇచ్చారు. ఇంటర్న్‌షిప్, క్షేత్ర స్థాయి శిక్షణ డిగ్రీ చదివి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకునేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలు సంతరించుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రణాళికలను అమల్లోకి తెచ్చింది. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్‌షిప్ చేసేలా కోర్సులను రూపొందించారు. పూర్తిస్థాయి నైపుణ్యాలు సాధించేలా క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా ఏటా శిక్షణార్ధుల సంఖ్య పెరుగుతుండగా ఉద్యోగావకాశాలు కూడా అదే స్థాయిలో మెరుగుపడుతున్నాయి. పరిశ్రమలతో కాలేజీల అనుసంధానం విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం కాలేజీల స్థాయిలోనే ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌కు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసింది. కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య కేంద్రాలు సహా 27,119 సంస్థలతో అనుసంధానించారు. ఆయా సంస్థలతో సమన్వయం కోసం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులను సభ్యులుగా నియమించారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాల్లోనూ.. ఆధునిక సాంకేతిక అంశాల్లో రానున్న కాలంలో 1.1 బిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తోంది. ‘ప్రీ–మాస్టర్ ఇండియా’ పేరుతో జర్మనీ ప్రారంభించిన కార్యక్రమం ద్వారా మన విద్యార్థులు ఆ దేశంలో అవకాశాలను దక్కించుకునేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర విద్యార్థులు బీటెక్ పూర్తి చేశాక జర్మనీలో మాస్టర్ డిగ్రీని అభ్యసించడంతోపాటు నేరుగా అక్కడి కంపెనీల్లో ఉద్యోగాల్లో కొలువుదీరుతున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఐబీఎం, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, పర్పుల్ టాక్, సెలెక్ట్, నూక్కాడ్, సినాప్సిస్, థాట్వరŠుక్స, అనలాడ్ డివైజెస్ తదితర సంస్థలు రాష్ట్ర విద్యార్ధులకు పెద్ద ఎత్తున ప్లేస్మెంట్లు కల్పిస్తున్నాయి. లక్ష ప్లేస్మెంట్లు లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువు ముగించుకుని బయటకు వచ్చేనాటికి సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. మన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా రాణించి అవకాశాలను అందిపుచ్చుకొనేలా ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానించి శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. రానున్న కాలంలో ప్లేస్మెంట్ల సంఖ్య ఏటా లక్షకు చేరువ కావాలన్నది లక్ష్యం. – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కరోనాలోనూ పెరిగిన ప్లేస్‌మెంట్స్ రాష్ట్రంలో 2018–2019లో 2.5 లక్షల మంది వివిధ స్థాయిల్లో చదువు పూర్తి చేసుకుని బయటకు రాగా నాడు 37 వేల ప్లేస్మెంట్లు మాత్రమే ఉన్నాయి. ఇక 2019–20లో 3.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య ముగించుకొని బయటకు రాగా ప్లేస్మెంట్లు 51 వేలకు చేరుకున్నాయి. 2021–2022లో 4.2 లక్షల మంది చదువులు పూర్తి చేయగా 69 వేల ఉద్యోగావకాశాలు లభించాయి. కరోనా సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఈ పెరుగుదల సాధ్యమైంది. -
ఉద్యోగ భర్తీల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం
ముషీరాబాద్: ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఖాళీల భర్తీపై రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ముషీరాబాద్‌లో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అ«ధ్యక్షతన నిరుద్యోగ మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు రాజీనామా చేసినా, సభ్యులు మరణించినా ఆరు నెలల్లోపు భర్తీ చేయాలని రాజ్యాంగం చెబుతుందన్నారు. అయితే ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన 10 నుంచి 20 ఏళ్ల వరకు భర్తీ చేయడం లేదన్నారు. అన్ని రాజకీయ పోరాటాలు ఏకమై పార్లమెంటులో బిల్లు పెట్టి ఖాళీలు ఏర్పడిన నెలలోపు భర్తీ చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగాల భర్తీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సంస్కరణలు
సాక్షి, అమరావతి: పారదర్శకంగా ఉద్యోగ నియామకాలతోపాటు పోస్టుల భర్తీలో అక్రమాలకు తావులేకుండా పలు కీలక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దు, డిజిటల్ మూల్యాంకనం, ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలు, రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు తదితరాలు ఇందులో ఉన్నాయి. ఎక్కువ అభ్యర్థులున్న పోస్టులకే ప్రిలిమ్స్ గ్రూప్–1 పోస్టులకు మినహా మిగతా అన్ని కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం, మెరిట్ అభ్యర్థులను నిర్ణయించడంలో సమస్యలు తలెత్తడంతో కొన్ని మినహాయింపులు చేపట్టింది. అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందే పోస్టులకు మినహా మిగతా వాటికి ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. దీంతోపాటు గ్రూప్–1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలను పూర్తిగా తొలగించారు. గత సర్కారు హయాంలో ఇంటర్వ్యూల పేరిట తమ వారికే పోస్టులు వచ్చేలా చేసి అర్హులకు అన్యాయం చేశారు. అన్ని బోర్డులకు ఏపీపీఎస్సీ చైర్మనే నేతృత్వం వహించడంతో అక్రమాలకు తెర లేచింది. దీన్ని పూర్తిగా రద్దు చేసి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని పోస్టులకు బహుళ బోర్డులతో ఇంటర్వ్యూలను నిర్వహించారు. బోర్డులకు వేర్వేరు చైర్మన్లను నియమించారు. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దయిన నేపథ్యంలో ఏపీ స్టేట్ సర్వీస్ కేడర్ పోస్టుల అభ్యర్థుల ఎంపికలో వ్యక్తిత్వం, పరిపాలనా దక్షతను అంచనా వేసేందుకు ప్రత్యామ్నాయ విధానాలపై కమిషన్ కసరత్తు చేస్తోంది. మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రం టీడీపీ సర్కారు గ్రూప్ 1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని రద్దు చేసి 1:15 ప్రకారం మార్చింది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారు. పాత విధానాన్ని కొనసాగించాలని ఆందోళన చేసినా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని మార్చి నిరుద్యోగులకు మేలు చేసేలా 1: 50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టింది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజ్ లాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. అవకతవకలను నివారించేందుకు ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకనాన్ని చేపట్టింది. దీనివల్ల పారదర్శకతతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు రద్దు.. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంట్ పరీక్షల్లో గత సర్కారు నెగిటివ్ మార్కులు ప్రవేశపెట్టడంతో పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగులు నష్టపోయారు. దీన్ని రద్దు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆలకించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిపార్టుమెంట్ పరీక్షలలో నెగిటివ్ మార్కులను రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయోపరిమితి పొడిగింపు ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వర్గాలకు కల్పిస్తున్న సడలింపు కాలపరిమితి 2021 మే నెలతో ముగిసింది. కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఈ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా వయోపరిమితి సడలింపును 2026 మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు గత సర్కారు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు తమ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ముఖ్యంగా వయోపరిమితి మినహాయింపును వినియోగించుకుంటే వారిని ఆ కేటగిరీ పోస్టులకే పరిమితం చేస్తూ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనర్హులుగా చేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులందరికీ తీరని నష్టం వాటిల్లింది. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదులు అందినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్నా మెరిట్లో అగ్రస్థానంలో ఉంటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులుగా నిర్ణయిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి మేలు చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడ బ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటాను రిజర్వు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఆ కోటా సంగతిని ప్రస్తా వించకుండా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఆ వర్గాల యువతకు అన్యాయం జరిగింది. పైగా పది శాతం కోటాలో 5 శాతాన్ని కాపులకు ప్రత్యేకిస్తున్నట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వడంతో అది న్యాయపరంగా చెల్లుబాటు కాకుండా నిలిచిపోయింది. దీనివల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు చర్యలు తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఏపీపీఎస్సీ ఆమేరకు చర్యలు చేపట్టింది. కొత్త నోటిఫికేషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల వివరాలను పొందుపర్చేలా వీలు కల్పించింది. -
కొలువుల చదువులు.. నైపుణ్యాభివృద్ధికి ఇంటర్న్‌షిప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి ఫలాలు విద్యార్థులకు అందేలా కార్యాచరణ రూపొందించారు. డిగ్రీ పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకొనేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమల్లోకి తెస్తున్నారు. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్‌షిప్ చేసేలా కోర్సులను రూపొందించారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానిస్తున్నారు. విద్యార్థులు తమ కోర్సులతో సంబంధమున్న అంశాల్లో అందుబాటులో ఉన్న సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఇందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్‌లోని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)లో వీటిని పొందుపరుస్తారు. జిల్లాలవారీగా ఈ సంస్థలను ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పెడతారు. జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగానే జిల్లాలోని కంపెనీలను సంప్రదించి, ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేస్తాయి. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు కోఆర్డినేటర్ల సహకారంతో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సంస్థలు వాటికి అవసరమైన సంఖ్యలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పిస్తాయి. మైక్రో నుంచి మెగా సంస్థల వరకు.. ఇంటర్న్‌షిప్‌కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఇందులో మాన్యుఫాక్చరింగ్, సర్వీసు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ద్వారా ఆయా సంస్థలకు కూడా మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. ఉభయ ప్రయోజనకరంగా ఈ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. మరోపక్క విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను పెంపొందించడానికి ఉన్నత విద్యా మండలి కమ్యూనిటీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. సమాజంపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు అక్కడి సమస్యలకు తాము నేర్చుకున్న విఙ్ఙానం ద్వారా పరిష్కారాలను అన్వేషించేలా చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సమస్యలను అధిగమించే తత్వం ఏర్పడుతుంది. ఇంటర్న్‌షిప్ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన సంస్థలు జిల్లా పేరు మైక్రో స్మాల్ మీడియం లార్జ్ మెగా మొత్తం అనంతపురం 1,631 962 65 107 14 2,779 చిత్తూరు 1,453 1,443 107 232 34 3,269 తూర్పు గోదావరి 1,031 971 67 150 16 2,235 గుంటూరు 1,436 1,252 43 67 7 2,805 కృష్ణా 1,134 1,018 77 131 5 2,365 కర్నూలు 619 524 28 59 11 1,241 ప్రకాశం 1,118 1,813 35 45 1 3,012 నెల్లూరు 726 688 58 121 15 1,608 శ్రీకాకుళం 778 603 16 30 11 1,438 విశాఖపట్నం 788 1,041 139 317 36 2,321 విజయనగరం 543 376 17 43 6 985 పశ్చిమ గోదావరి 832 794 57 87 4 1,774 వైఎస్సార్ కడప 799 441 9 29 9 1,287 మొత్తం 12,888 11,926 718 1,418 169 27,119 వీటిలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ విభాగాల సంఖ్య ఇలా కేటగిరీ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీస్ మైక్రో 11,510 1,378 స్మాల్ 10,169 1,757 మీడియం 569 149 లార్జ్ 1,191 227 మెగా 144 25 ఇంటర్న్‌షిప్ కోసం వివిధ జిల్లాల్లో గుర్తించిన కొన్ని ముఖ్యమైన సంస్థలు 400 ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏపీ జెన్కో, తలారిచెరువు, అనంతపురం హ్యుందాయ్ ట్రాన్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కియా మోటార్స్ అనంతపురం విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ పిస్టన్ రాడ్ ప్లాంట్ అనంతపురం అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, కరకంబాడి, చిత్తూరు కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఎక్స్‌ట్రాన్ సర్వర్స్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు హీరో మోటోకార్్ప లిమిటెడ్, చిత్తూరు గుంటూరు టెక్స్టైల్ పార్కు, గుంటూరు జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గుంటూరు మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా ది కేసీపీ లిమిటెడ్ సిమెంటు యూనిట్, కృష్ణా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, కృష్ణా ది రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, కృష్ణా గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, కర్నూలు ఎస్బీజీ క్లింటెక్ ప్రాజెక్టు కో ప్రైవేట్ లిమిటెడ్. కర్నూలు టీజీవీ స్రాక్ లిమిటెడ్, కర్నూలు అమ్మన్ ట్రై స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెల్లూరు ఎన్జీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు సెంబ్కార్్ప ఎనర్జీ లిమిటెడ్, నెల్లూరు అరబిందో ఫార్మా లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, శ్రీకాకుళం శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీకాకుళం స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, విశాఖపట్నం హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, విశాఖపట్నం ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్, విజయనగరం శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ లిమిటెడ్, విజయనగరం ఎస్ఎంఎస్ ఫార్మాస్యుటికల్స్ లిమిటెడ్, విజయనగరం నవభారత్ లిమిటెడ్, పశ్చిమగోదావరి పాండురంగ ఎనర్జీ సిస్టమ్ ప్రయివేటు లిమిటెడ్, పశ్చిమ గోదావరి వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమ గోదావరి ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వైఎస్సార్ కడప ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్, వైఎస్సార్ కడప టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్, వైఎస్సార్ కడప మిడ్వెస్ట్ నియోస్టోన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం జేసీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం కల్లామ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, ప్రకాశం పెరల్ డిస్టిలరీ లిమిటెడ్, ప్రకాశం ఇంజినీరింగ్ విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లులు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ 1. వ్యవసాయంలో నేల ఆరోగ్యం , పంట రీసైక్లింగ్ కోసం సిఫార్సు చేసే వ్యవస్థ అభివృద్ధి 2. వ్యవసాయం కోసం స్ప్రింక్లర్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు 3. అంటువ్యాధులకు సంబంధించి కంప్యూటర్ సహాయక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రూపకల్పన ------------ సివిల్ ఇంజనీరింగ్ 1. ల్యాండ్ స్లైడ్ల కోసం ప్రత్యేకంగా జియోసింథటిక్స్ ఉపయోగించి నేల స్థిరీకరణ 2. జీఐఎస్ ఉపయోగించి భూగర్భ జలాల గుర్తింపు 3. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి నివాస భవనంలో భూఉష్ణ శక్తి వినియోగం -------------- మెకానికల్ ఇంజనీరింగ్ 1. అగ్రికల్చరల్ పెస్టిసైడ్ స్ప్రేయర్ – కోవిడ్ శానిటైజేషన్ డ్రోన్ 2. గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం బయోగ్యాస్ కంప్రెషన్ - స్టోరేజ్ సిస్టమ్ 3. వ్యవసాయం కోసం స్కాచ్ యోక్ మెకానిజం ఉపయోగించి డ్యూయల్ సైడ్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ------------ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ 1. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా స్మార్ట్ అగ్రికల్చర్ విధానం, మాయిశ్చర్ హ్యుమిడీటీని గుర్తించడం 2. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్మార్ట్ రెస్క్యూ సిస్టమ్ 3. స్మార్ట్ మాస్క్ – సామాజిక దూర హెచ్చరిక --------------- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 1. వ్యవసాయ అవసరాల కోసం నేలలో నీటిశాతం, తేమను కనుగొనేందుకు సోలార్ పవర్‌తో నడిచే ఆటో ఇరిగేషన్ సిస్టమ్ వినియోగం 2. మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇ హెల్త్ కేర్ కంప్యూటింగ్ విధానం అనుసరణ 3. జిగ్బీ ఆధారిత సోలార్ పవర్ ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ సిస్టమ్ డిగ్రీ నాన్‌ప్రొఫెషనల్ విద్యార్థుల కోసం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ విద్యార్ధులకు కూడా వివిధ అంశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఆర్ట్స్ విద్యార్థులకు 51, కామర్స్ విద్యార్థులకు 50, సైన్సు విద్యార్థులకు 38 ప్రాజెక్టులు ఉంటాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, ఉమెన్, యూత్ ఎంపవర్‌మెంటుతో పాటు వివిధ క్యాంపుల నిర్వహణ అంశాలతో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఇదో విప్లవాత్మక కార్యక్రమం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువు పూర్తిచేసి బయటకు వచ్చేనాటికి వారిని సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానిస్తున్నాం. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశారు. కాలేజీలు, పరిశ్రమలు, బిజినెస్ ఎంటర్ప్రయిజర్లను అనుసంధానం చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాం. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థి పూర్తి నైపుణ్యం సాధించేలా చేస్తాం. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమం. -
ఏపీ ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఇప్పటికే 2,900 మంది మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్స్(ఎంఎల్‌హెచ్‌పీలు)ను నియమించిన ప్రభుత్వం.. ఈ నెలాఖరుకల్లా మరో 3,390 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. డిసెంబర్ చివరికి వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలకు చెందిన 6 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఎంఎల్‌హెచ్‌పీల నియామకం కోసం ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీనికి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లిచ్చి 3,390 మంది ఎంఎల్‌హెచ్‌పీలను నియమించనున్నారు. ఆగస్ట్ చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంఎల్‌హెచ్‌పీల ద్వారా సేవలందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న ఒక ఎంఎల్‌హెచ్‌పీతో పాటు ఒక ఏఎన్ఎం ఉంటారు. ఈ క్లినిక్‌లలో 12 రకాల సేవలు.. 65 రకాల మందులు, 14 రకాల నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
కొత్తగా మరో 2,842 నియామకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతూనే ఉంది. గడిచిన ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కపోస్టుకూ నియామకం ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీగా నియామకాలు చేసిన సర్కారు ఇప్పుడు కొత్తగా మరో 2,842 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల అమలుకు ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలోనే.. ► పోస్టుల వివరాలన్నీ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి. ► దరఖాస్తులు అక్కడే ఇస్తారు. దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలు జతచేసి గడువులోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇవ్వాలి. ► నియామకం జరిగే పోస్టుల్లో సుమారు 30 కేటగిరీలకు పైనే ఉన్నాయి. ఎక్కువగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి. ► 2,842 పోస్టులు కాకుండా మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు. ► అర్హత, పోస్టుల వివరాలు వంటివన్నీ కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపర్చారు. పారదర్శకంగా నియామకాలు ఈ ప్రభుత్వం వచ్చాక వేలాది నియామకాలు జరిపాం. ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా పూర్తయింది. కొత్తగా నియామకాలు జరిగే వీటి విషయంలోనూ అంతే పారదర్శకంగా జరపాలని అధికారులను ఆదేశించాం. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పథకాల అమలు మరింత పటిష్టంగా.. కొత్తగా నియామకాల వల్ల మానవ వనరుల బలం పెరుగుతుంది. దీనివల్ల పథకాల అమలు పటిష్టంగా జరుగుతుంది. ఈ నెలాఖరుకు కొత్తగా ఎంపికైన వారు విధుల్లో చేరతారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన సేవలందేలా చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
జూలైలో జాబ్‌లు పెరిగాయ్..!
ముంబై: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ సడలింపుతో జూలైలో ఉద్యోగ నియమాకాలు పెరిగాయి. కేంద్రం అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించడంతో అనేక కీలక పరిశ్రమలు పునఃప్రారంభమయ్యాయి. ఫలితంగా కిందటి నెల జూన్‌లో పోలిస్తే ఈ జూలైలో ఉద్యోగ నియామకాలు పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన పోలిస్తే నియామకాలు భారీగా తగ్గాయి. ఆసక్తికరంగా మైట్రో నగరాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నియామకాలు పెరగడం విశేషం. మీడియా–ఎంటర్టైన్మెంట్, నిర్మాణ, ఇంజనీరింగ్ రంగాల్లో అధికంగానూ.., బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్, ఇన్సూరెన్స్, అటో, టెలికం రంగాల్లో మోస్తారు నియమకాలు జరిగాయి. ఐటీ రంగంలో మాత్రం నియామకాలు అంతంగా మాత్రంగా ఉన్నాయి. నౌకరి జాజ్ ఇండెక్స్ ప్రకారం ఈ జూలైలో మొత్తం 1263 జాబ్ పోస్టింగ్‌లు నమోదయ్యాయి. కిందటి నెల జూన్‌లో జరిగిన 1208 పోస్టింగ్‌లతో పోలిస్తే 5శాతం వృది జరిగింది. అయితే గతేడాది ఇదే జూలైతో నియామకాలు 47శాతం క్షీణించాయి. ‘కిందటి నెలతో పోలిస్తే ఈ జూలైలో నియాయకాలు స్వల్పంగా పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన 47శాతం క్షీణించాయి. రానున్నరోజుల్లో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు ఆంక్షలను మరింత పరిమితం చేయవచ్చు. ఈ ఆగస్ట్‌లో ఉద్యోగాలు మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని నౌక్రీ డాట్‌కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ చెప్పారు. -
టెక్ స్టార్టప్‌లలో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలోని స్టార్టప్స్ (అంకుర సంస్థలు) ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేసింది. నాస్కామ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని టాప్ 15 కంపెనీలు నిరంతరం ఉద్యోగాలను కల్పిస్తూనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. -
వైద్య శాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ
కరీంనగర్: వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో మూడు, నాలుగు చొప్పు న 700 పైగా గురుకుల పాఠశాలలు ఏర్పా టు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అంది స్తున్నామన్నారు. పేద ప్రజలు వ్యాధులబారిన పడినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులను పెంచుతున్నామని, ఉన్న ఆస్పత్రుల్లో కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అన్ని ఆస్పత్రుల్లో వంద శాతం డాక్టర్లు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీవితంలో అనుకోకుండా వచ్చేవి వైద్య ఖర్చులని మంత్రి అన్నారు. అనుకోని వైద్య ఖర్చుల నుంచి పేదవారిని రక్షించేలా ప్రభుత్వం ఉచిత వైద్య సేవల సెంటర్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలందించేది వైద్య శాఖ అని, మెరుగైన వైద్యంతోనే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా సేవలందిస్తామని చెప్పారు. త్వరలో కరీంనగర్లో కొత్త ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. -
విభజన తర్వాతే కొత్త కొలువులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అందుబాటులోకి రావడంతో ఆ మేరకు శాఖల వారీగా ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడంతో ఖాళీలు, నియామకాలపై సందిగ్ధత వీడలేదు. దీంతో ఈ అంశం తేలేవరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం లేదు. పాత జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ నియామకాలన్నీ జిల్లా, జోనల్ స్థాయిల్లోనే జరిగేవి. నూతన జోనల్ విధానంతో ఇకపై జిల్లా స్థాయితో పాటు జోనల్, మల్టీ జోనల్ కేడర్లలో నియామకాలు చేపట్టాలి. నియామకాలు చేపట్టాలంటే ప్రస్తుత ఉద్యోగుల కేడర్‌ను కొత్త జోనల్ విధానం ప్రకారం విభజించాలి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు నియామకాల ప్రక్రియ సాధ్యం కాదని ఉద్యోగ నియామక బోర్డులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. విభజన పూర్తయితేనే నియామకాలు.. కొత్త జిల్లాలు ఏర్పాటై మూడేళ్లయింది. ప్రస్తుతం ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువగా జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగులున్నారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనతో పాటు జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో కూడా పరిధిని ఫిక్స్ చేయాలి. ఇది పూర్తయితే ప్రతి ఉద్యోగికి పరిధిపై స్పష్టత రావడంతో పాటు జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, పనిచేస్తున్న వారి లెక్కలు తేలుతాయి. దీంతో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, నేరుగా భర్తీ చేసేవెన్ని, పదోన్నతులతో నింపేవెన్ని అనేది తెలుస్తుంది. ఉద్యోగులకు ఆప్షన్లు... తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. గత ఆగస్టు నుంచి రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అందుబాటులోకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులను ప్రాథమికంగా విభజించారు. అయితే విభజన పూర్తిస్థాయిలో జరిగితేనే ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారనేది స్పష్టత వస్తుంది. ఉద్యోగుల విభజన చేపట్టే క్రమంలో ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఉద్యోగి ఎంపిక చేసుకునే విధానం ప్రకారం విభజనకు ఆస్కారముంటుంది. ఉద్యోగుల విభజన విషయంలో ప్రభుత్వం పలుమార్లు శాఖాధిపతులతో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు. -
80% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది. వయో పరిమితి.. జీతం ఇలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు విధానం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్‌ను ఏర్పాటు చేసింది. ఏ వెబ్ పోర్టల్‌ను ఓపెన్ చేసినా.. ఒకే తీరున మొత్తం ఐదు విభాగాలతో కూడిన స్క్రీన్ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్ చేస్తే.. భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేస్తే.. ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్–1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, ఆధార్ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతోపాటు మొబైల్ నంబర్, ఫొటోను అప్లోడ్ చేస్తే సంబంధిత అభ్యర్థి ఫోన్ నంబర్‌కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాలు మెసేజ్ అందుతుంది. ఆ ఐడీ వివరాల ప్రకారమే అతడు ఆన్లైన్లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ –2 విభాగంలోని బటన్‌ను క్లిక్ చేస్తే.. అభ్యర్థి మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందిన ఐడీ నంబర్ వివరాలు నమోదుకు బాక్స్‌లు ఉంటాయి. ఐడీ నంబర్ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్ అవుతుంది. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్ బటన్ నొక్కే ముందువరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. నాల్గవ కాలమ్గా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. పోస్టుల వారీగా పరీక్ష విధానం.. వివరాలు -
సెప్టెంబర్ 1న సచివాలయ ఉద్యోగాల పరీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు చేపట్టే ఉద్యోగ నియామకాలకు సెప్టెంబరు 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో దాదాపు 1,33,494 కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలుగా పేర్కొనడంతో పాటు రాతపరీక్ష విధానంలో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష విధానం, విద్యార్హతలు, పరీక్ష విధానంతో పాటు పరీక్ష తేదీతో గురువారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పాటు అవసరమైన 12 శాఖల ఉన్నతాధికారులు రోజూ సమావేశమవుతున్నారు. కాగా ఈ ఉద్యోగాలకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే పలువురు కూడా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 2వ తేదీ కూడా) రాత పరీక్షలు నిర్వహించాలని కూడా ప్రభుత్వ అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. అయితే ఒకే రోజు పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. కాగా రాతపరీక్షను పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహిస్తారు. అధికారుల సమాచారం మేరకు 150 మార్కులకు 150 ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఉంటాయి. ఇందులో 75 మార్కులకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని సమాచారం. -
ఫోర్జరీతో ఉద్యోగ నియామక పత్రాలు
భీమారం వరంగల్ : ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం గొల్లబజార్‌కు చెందిన మడిపల్లి శ్రీకాంత్ అదే జిల్లాలో డిగ్రీ చదువుతు మాధ్యలోనే మానివేశా డు. అనంతరం బీసీ విద్యార్థి సమాఖ్య పేరుతో 2015లో సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకుని, హైదరా బాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి కార్యకలాపాలు ప్రా రంభించాడు. రెండేళ్ల క్రితం శ్రీకాంత్ వరంగల్‌కు వచ్చి తన మిత్రుడైన రాజేష్ ద్వారా గడ్డం రణధీర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఐఏఎస్, మంత్రులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని శ్రీ కాంత్ మాయమాటలు చెబుతూ వచ్చాడు. హాస్ట ల్ వేల్ఫెర్ ఉద్యోగాలు అయితే తనచేతిలో పనినం టూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన రణ« దీర్ హాస్టల్ వేల్పెçర్ ఉద్యోగానికి రూ.6 లక్షలు ఇ చ్చాడు. అదేవిధంగా ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన గోశాల శరత్ రూ.4.50 లక్షలు, జఫ ర్గడ్కు చెందిన నల్లబెట్ల రాజు రూ.10 లక్షలు, సుబేదారికి చెందిన మమ్మెజీ వంశీ కృష్ణ రూ.3 లక్షలు, వేములవాడకు చెందిన కిరణ్ రూ. 2 లక్షలు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన నిరుద్యోగ యువకులు ఏడాది పాటు వేచి చూశారు. ఉద్యోగం ఇప్పుడు వస్తుందని అడిగితే శ్రీకాంత్ సమాధానం చెబు తూ దాట వేసే ప్రయత్నాలు చేశాడు. డబ్బులు ఇస్తావా ఉద్యోగం ఇప్పిస్తావా అంటూ శ్రీకాంత్‌పై ఒత్తిడి తీసుకు వచ్చారు. స్నేహితుడి ఇంటర్నెట్ సెంటర్ నుంచి.. బాధితుల ఒత్తిడి మేరకు శ్రీకాంత్ ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించాడు. ఖమ్మంలోని తన స్నేహితుడు వేముల సతీష్ ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫోర్జరీ ఉద్యోగ నియామక పత్రాన్ని తయారు చేశారు. దానిపై కుందూ రు కిశోర్‌కుమార్‌రెడ్డితో బీసీ కమిషనర్ హైదరాబాద్ పేరుతో ఫోర్జరీ సంతకం చేయించారు. ఆ ఉద్యోగనియామక పత్రాన్ని గడ్డం రణధీర్‌కు అం దజేశాడు. అతడితోపాటు మరో నలుగురిలో కొం దరికి నేరుగా, మరికొందరికి మెయిల్ ద్వారా ఉద్యోగం వచ్చినట్లు నియామక పత్రాలు పంపిం చినట్లు డీసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. దీని ప్రతులు కలెక్టర్, హాస్టల్ వెల్ఫేర్ కమిషనర్ పంపించా డని చెప్పారు. బాధితుడికి షాక్.. ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న రణధీర్ నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి విచారించా రు. అయితే తమకు ఎలాంటి ఆర్డర్ పత్రాలు రాలేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో షాక్‌కు గురయ్యాడు. ఈ విషయమై శ్రీకాంత్‌ను ప్రశ్నిస్తే కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో బాధితుడు రణధీర్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులు శ్రీకాంత్, అతడికి సహకరించిన వేముల సతీష్, కిశోర్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి కారు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ సీపీయూ, మానిటర్‌తో పాటు రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. వీరిపై ఇప్పటీకే ఆయా పోలీస్స్టేషన్ల కేసులు నమోదైనట్లు వివరించారు. సమావేశంలో సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, ఎస్సైలు భీమేష్, ప్రవీణ్, ఏఎస్సై భీమారెడ్డి పాల్గొన్నారు. దళారులను నమ్మొద్దు.. ఉద్యోగాలు ఇప్పిస్తానని వచ్చే వారిని నమ్మొద్దని డీసీపీ వెంకట్‌రెడ్డి సూచించారు. ఉద్యోగాలను పూర్తిగా టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదలైందని, తనకు పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎస్పీలు తెలుసని కొంతమంది వ్యక్తులు దళారులుగా అవతారమెత్తే అవకాశం ఉందన్నారు. -
‘సెల్ఫీ’ ఉద్యోగాలొచ్చాయ్!
♦ ఉద్యోగ నియామకాల్లో సరికొత్త ట్రెండ్ ♦ సెల్ఫీ వీడియో, స్మార్ట్ ఇంటర్వ్యూలతో ఎంపిక ♦ నియామక ప్రక్రియలో 40% పని వీటి ద్వారానే ♦ మార్కెటింగ్‌లోనూ సెల్ఫీ కామెంట్లు, వీడియోలు ♦ దీంతో సగం వ్యయం తగ్గుతుందంటున్న సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్వ్యూ. ఉద్యోగానికి ఇంటర్వ్యూ అనగానే... విద్యార్హతల నుంచి వేసుకునే దుస్తులు, పడాల్సిన టెన్షన్ వరకూ అన్నిటికీ ఓ లెక్కుంది. బోర్డులో ఎవరుంటారో? ఏ ప్రశ్నలడుగుతారో? అనే టెన్షన్‌తో పాటు ఫార్మల్ ప్యాంట్, ప్లెయిన్ షర్ట్ వేసుకొని నీట్‌గా టక్ చేసుకొని.. వీలైతే ఓ కోటు... చేతిలో సర్టిఫికెట్లు... ఇవన్నీ కాక రెజ్యుమె. అన్నీ ఉంటేనే ఇంటర్వ్యూ బాగా చేయగలమనే నమ్మకం వస్తుంది. కానీ, ఇప్పుడంతా స్మార్ట్ కాలమాయె. అందుకే!! డ్రెస్సే కాదు, సర్టిఫికెట్లు కూడా అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన పనే లేదు. అంతా అరచేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచే చేసెయ్యొచ్చు. అదే సెల్ఫీ వీడియో, స్మార్ట్ ఇంటర్వ్యూ!! ఇందుకోసం కొన్ని స్టార్టప్ కంపెనీలు మార్కెట్లోకి సరికొత్త యాప్‌లను విడుదల చేశాయి కూడా. సెల్ఫీల వినియోగం ఇపుడు జాబ్ రిక్రూట్‌మెంట్లలోకి పాకింది. రిక్రూట్మెంట్ల సమాచారం తెలిపే నౌక్రీ, కెరీర్ బిల్డర్, షైన్ వంటి సంస్థలు తమ వద్ద రిజిస్టర్ అయిన నిరుద్యోగులను తమ విద్యార్హతలు, రెజ్యుమెతో పాటు సెల్ఫీ వీడియోలను కూడా అప్లోడ్ చేయమని కోరుతున్నాయి. ఇందులో ఉద్యోగార్థులు స్మార్ట్‌ఫోన్ ముందు తమ అర్హతలు, హాబీలు, గత ఉద్యోగ అనుభవాలు, ప్రస్తుతం ఉద్యోగ అవసరాలు వంటి వివరాలు క్లుప్తంగా, సూటిగా వివరించాలి. ఈ వీడియో నిడివి 60 సెకన్లుంటుంది. ఇది పూర్తవగానే సంబంధిత సెల్ఫీ వీడియో లింక్ నేరుగా ఆయా కంపెనీలకు వెళ్లిపోతుంది. దీంతో కంపెనీ నియామక ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉద్యోగ నియామకాల్లో, మార్కెటింగ్ కార్యకలాపాల్లో సెల్ఫీ రెజ్యుమె, సెల్ఫీ వీడియోల ట్రెండ్ ఎక్కువైందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘హ్యాపీమైండ్స్’ నిర్వాహకులు లీలాధర్ చెప్పారు. ఆతిథ్యం, పర్యాటకం, మార్కెటి ంగ్, మోడలింగ్, ఈ-కామర్స్ రంగాల్లో సెల్ఫీ వీడియో ద్వారా ఉద్యోగ భర్తీ బాగా జరుగుతున్నట్లు తెలియజేశారు. కంపెనీలకు ఏం లాభమంటే.. సెల్ఫీ వీడియో వచ్చాక నియామక కంపెనీలకు ఉద్యోగ నోటిఫికేషన్, ప్రకటనలు, నియామక ప్రక్రియ వంటి ఇబ్బందులు తప్పుతున్నాయి. వీటికోసమయ్యే వ్యయం కూడా తగ్గుతోంది. నియామక ప్రక్రియలో 40% పనిని సెల్ఫీ వీడియో, స్మార్ట్ ఇంటర్వ్యూలతో పూర్తి చేస్తున్నట్లు ‘మైండ్షిఫ్’్ట సీఈఓ జాఫర్ రాయిస్ చెప్పారు. సెల్ఫీ వీడియో ద్వారా ఉద్యోగార్థి ఆత్మ విశ్వాసం, భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి తక్కువ సమయంలోనే తెలుసుకునే వీలుంటుంది. సెల్ఫీ రెజ్యూమ్స్తో నకిలీ ప్రొఫైల్స్ భాద కూడా తప్పుతుంది. జేడబ్ల్యూ మారియట్ సంస్థ ఫ్రంట్ ఆఫీస్, మార్కెటింగ్ విభాగాల్లో ఏటా 70-80 ఉద్యోగాలను సెల్ఫీ రెజ్యూమె, వీడియోల ద్వారానే భర్తీ చేసుకుంటోంది. డిజిటల్ మార్కెటింగ్ సంస్థ మైండ్షిఫ్ట్దీ ఇదే దారి. ‘‘ఇప్పుడు మేం సెల్ఫీ రెజ్యూమెతో పాటు సెల్ఫీ షార్ట్ వీడియోలను కూడా అప్లోడ్ చేయాలని నిరుద్యోగులను కోరుతున్నాం. వాటిని వాట్సాప్ లేదా ఈ- మెయిల్ ద్వారా పంపొచ్చు’’ అని జాఫర్ రాయిస్ చెప్పారు. ‘స్మార్ట్’తో లాభమేంటి..? అభ్యర్థుల మనస్తత్వాన్ని అంచనా వేయటానికే ఫోన్ ఇంటర్వ్యూలన్నది హెచ్ఆర్ నిపుణుల మాట. ‘‘దీనివల్ల ఆ సంస్థలో పనిచేయడానికి అభ్యర్థి నిజంగా ఆసక్తి చూపిస్తున్నాడా? కంపెనీ గురించి ప్రాథమిక సమాచారం సేకరించే ప్రయత్నం చేశారా? భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎలా ఉంది? ఇవన్నీ క్షణాల్లో తెలిసిపోతాయి’’ అని బెంగళూరుకు చెందిన ఈ-పాయిస్ సంస్థ సీఈఓ సచిన్ అగర్వాల్ చెప్పారు. స్మార్ట్ ఇంటర్వ్యూ యాప్‌ను ఈ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. ఓలా, రెడ్‌బస్, ఫ్లిప్‌కార్ట్, బుక్ మై షో సంస్థలు తమ సేవల్ని వినియోగించుకుంటున్నాయని చెప్పరాయన. ‘‘ఈ యాప్‌తో కేవలం హైదరాబాద్‌లోనే కాదు బెంగళూరు, పుణె, చెన్నై దేశవ్యాప్తంగా ఏ కంపెనీలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి? ఏ హోదాలో నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి? జీతభత్యాలెంత? వంటి సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు’’ అని సచిన్ చెప్పారు. మార్కెటింగ్‌లోనూ సెల్ఫీ వీడియో హవా నడుస్తోంది. ఉత్పత్తుల పనితీరును సెల్ఫీతో వివరించటం, కొనుగోలుదార్ల సెల్ఫీ అభిప్రాయడాలను పోస్ట్ చేయటం వంటివి కంపెనీలు చేస్తు న్నాయి. వీటివల్ల ఖర్చు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ నుంచే ఇంటర్వ్యూ.. సాధారణ ఇంటర్వ్యూల మాదిరిగా ప్రాంతం, తేదీ సమయం వంటివి స్మార్ట్ ఇంటర్వ్యూల్లో ఉండవు. ఇది కేవలం మొబైల్ నుంచే జరిగిపోతుంది. అదెలాగంటే ముందుగా స్మార్ట్ ఇంటర్వ్యూ సేవలందించే సంస్థల యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, చిరునామా, ఫోన్ నంబర్, రెజ్యూమె వంటి వివరాలను తొలుత నమోదు చేసుకోవాలి. అపుడు రిక్రూట్మెంట్ ఉన్న కంపెనీల సమాచారం, ఉద్యోగ భర్తీ, నోటిఫికేషన్లు వంటి వివరాలు నేరుగా కస్టమర్ల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో వెళ్లిపోతాయి. ఆ యాప్ నుంచే తమ రెజ్యుమెను నేరుగా కంపెనీలకు పంపొచ్చు. ఆ తర్వాత కంపెనీలు అభ్యర్థికి ముందే సమాచారం ఇచ్చి కాల్ చేస్తాయి. మరికొన్ని కంపెనీలు ఊహించని విధంగా ఫోన్ చేస్తుంటాయి. ఫోన్ ఎప్పుడు మోగుతుందో తెలియదు కనక అభ్యర్థులు ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటే మంచిది. ‘‘సడెన్‌గా కాల్ వచ్చి మీరు ప్రయాణంలో ఉన్నా, మరే ఇతర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా ఫోన్ చేసినవారి నంబర్, పేరు తీసుకోండి. మరో పది నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తానని రిక్వెస్ట్ చేయండి’’ అని హెచ్ఆర్ నిపుణుడొకరు సూచించారు. -
కొలువుల భర్తీకి సీఎం తిరస్కరణ
హైదరాబాద్: బాబొస్తే... జాబొస్తుంది... అంటూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. అంతేకాదు.. ఉద్యోగాలివ్వకపోతే నిరుద్యోగులందరికీ నెలకు రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సైతం హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక ఆ ఊసే మరిచారు. కొత్త రాజధానిలో భూముల సర్వేకోసం సర్వేయర్లు, ఉప సర్వేయర్ల పోస్టులు భర్తీ చేయాలంటూ రెవెన్యూశాఖ చేసిన ప్రతిపాదనలను సైతం సీఎం తిరస్కరించడం ఇందుకు నిదర్శనం. ఈ పోస్టుల భర్తీకి బదులుగా రాజధానిలో సర్వేను కూడా ప్రైవేట్‌పరం చేయాలని ఆయన సూచించడం గమనార్హం. భర్తీ కుదరదు.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 4 వేల సర్వే పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని రెవెన్యూశాఖ తొలుత ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆర్థికశాఖ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష సందర్భంగా సర్వేయర్ల కొరతపైన, ప్రస్తుతమున్న పని ఒత్తిడి తదితర అంశాలపైన రెవెన్యూ(సర్వే విభాగం)శాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రస్తుతం నిధుల కొరత ఉన్నందున పోస్టుల భర్తీ సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 720 మంది సర్వేయర్లే పనిచేస్తున్నారని, 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెవెన్యూ అధికారులు వివరించినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. రిటైరైన వారికి శిక్షణనిచ్చి తీసుకోవాలని, లేదంటే ప్రైవేటు ఏజెన్సీలద్వారా సర్వే చేయించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యక్తులకు శిక్షణనిచ్చి లెసైన్స్ సర్వేయర్లను నియమించుకోవాలన్నా ఒక్కొక్కరికీ శిక్షణకు రూ.40 వేలు అవుతుందని రెవెన్యూశాఖ తెలిపింది. ఆ మేరకైనా నిధుల మంజూరుకు సీఎం ససేమిరా అన్నారు. అంతేగాక రాజధానిలో సర్వే పనిని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని ఆదేశాలిచ్చారు. దీనిపై అధికారులు మండి పడుతున్నారు. ఇది సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు. పాతబాటలోనే బాబు సర్వేయర్, ఉప సర్వేయర్ జిల్లాస్థాయి పోస్టులే. రాష్ట్ర విభజన, రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులతో వీటికి సంబంధం లేదు. అయినా కొత్త పోస్టుల మంజూరు కన్నా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకే సీఎం చంద్రబాబు తిరస్కరించడం చూస్తుంటే.. సర్కారు పోస్టుల భర్తీకి భవిష్యత్‌లోనూ ఆయన ఇష్టపడరనే వాదన అధికార వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో అధికారంలో ఉండగా చంద్రబాబు నాల్గోతరగతి పోస్టుల భర్తీపై నిషేధం విధించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. కేడర్ గ్రేడ్ ఖాళీలు సంఖ్య జోనల్ గెజిటెడ్ 11,105 ఎన్జీవో 11,353 నాల్గోతరగతి 4 జిల్లా గ్రూప్-1 2 గెజిడెట్ 863 ఎన్జీవో 82,760 నాల్గోతరగతి 22,519 ఎయిడెడ్ 9,857 మొత్తం పోస్టులు ఖాళీ 1,38,463