మాట్లాడుతున్న డీసీపీ వెంకట్‌రెడ్డి
భీమారం వరంగల్ : ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం గొల్లబజార్‌కు చెందిన మడిపల్లి శ్రీకాంత్ అదే జిల్లాలో డిగ్రీ చదువుతు మాధ్యలోనే మానివేశా డు. అనంతరం బీసీ విద్యార్థి సమాఖ్య పేరుతో 2015లో సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకుని, హైదరా బాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి కార్యకలాపాలు ప్రా రంభించాడు. రెండేళ్ల క్రితం శ్రీకాంత్ వరంగల్‌కు వచ్చి తన మిత్రుడైన రాజేష్ ద్వారా గడ్డం రణధీర్‌తో పరిచయం పెంచుకున్నాడు.
ఐఏఎస్, మంత్రులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని శ్రీ కాంత్ మాయమాటలు చెబుతూ వచ్చాడు. హాస్ట ల్ వేల్ఫెర్ ఉద్యోగాలు అయితే తనచేతిలో పనినం టూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన రణ« దీర్ హాస్టల్ వేల్పెçర్ ఉద్యోగానికి రూ.6 లక్షలు ఇ చ్చాడు. అదేవిధంగా ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన గోశాల శరత్ రూ.4.50 లక్షలు, జఫ ర్‌గడ్‌కు చెందిన నల్లబెట్ల రాజు రూ.10 లక్షలు, సుబేదారికి చెందిన మమ్మెజీ వంశీ కృష్ణ రూ.3 లక్షలు, వేములవాడకు చెందిన కిరణ్ రూ. 2 లక్షలు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన నిరుద్యోగ యువకులు ఏడాది పాటు వేచి చూశారు. ఉద్యోగం ఇప్పుడు వస్తుందని అడిగితే శ్రీకాంత్ సమాధానం చెబు తూ దాట వేసే ప్రయత్నాలు చేశాడు. డబ్బులు ఇస్తావా ఉద్యోగం ఇప్పిస్తావా అంటూ శ్రీకాంత్‌పై ఒత్తిడి తీసుకు వచ్చారు.
స్నేహితుడి ఇంటర్నెట్ సెంటర్ నుంచి..
బాధితుల ఒత్తిడి మేరకు శ్రీకాంత్ ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించాడు. ఖమ్మంలోని తన స్నేహితుడు వేముల సతీష్ ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫోర్జరీ ఉద్యోగ నియామక పత్రాన్ని తయారు చేశారు. దానిపై కుందూ రు కిశోర్‌కుమార్‌రెడ్డితో బీసీ కమిషనర్ హైదరాబాద్ పేరుతో ఫోర్జరీ సంతకం చేయించారు. ఆ ఉద్యోగనియామక పత్రాన్ని గడ్డం రణధీర్‌కు అం దజేశాడు. అతడితోపాటు మరో నలుగురిలో కొం దరికి నేరుగా, మరికొందరికి మెయిల్ ద్వారా ఉద్యోగం వచ్చినట్లు నియామక పత్రాలు పంపిం చినట్లు డీసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. దీని ప్రతులు కలెక్టర్, హాస్టల్ వెల్ఫేర్ కమిషనర్ పంపించా డని చెప్పారు.
బాధితుడికి షాక్..
ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న రణధీర్ నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి విచారించా రు. అయితే తమకు ఎలాంటి ఆర్డర్ పత్రాలు రాలేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో షాక్‌కు గురయ్యాడు. ఈ విషయమై శ్రీకాంత్‌ను ప్రశ్నిస్తే కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో బాధితుడు రణధీర్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులు శ్రీకాంత్, అతడికి సహకరించిన వేముల సతీష్, కిశోర్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు.
నిందితుల నుంచి కారు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ సీపీయూ, మానిటర్‌తో పాటు రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. వీరిపై ఇప్పటీకే ఆయా పోలీస్‌స్టేషన్ల కేసులు నమోదైనట్లు వివరించారు. సమావేశంలో సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, ఎస్సైలు భీమేష్, ప్రవీణ్, ఏఎస్సై భీమారెడ్డి పాల్గొన్నారు.
దళారులను నమ్మొద్దు..
ఉద్యోగాలు ఇప్పిస్తానని వచ్చే వారిని నమ్మొద్దని డీసీపీ వెంకట్‌రెడ్డి సూచించారు. ఉద్యోగాలను పూర్తిగా టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదలైందని, తనకు పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎస్పీలు తెలుసని కొంతమంది వ్యక్తులు దళారులుగా అవతారమెత్తే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment