కొత్తగా మరో 2,842 నియామకాలు | Replacement of posts in each district in AP | Sakshi
Sakshi News home page

కొత్తగా మరో 2,842 నియామకాలు

Published Thu, Oct 8 2020 3:26 AM | Last Updated on Thu, Oct 8 2020 3:44 AM

Replacement of posts in each district in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతూనే ఉంది. గడిచిన ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కపోస్టుకూ నియామకం ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీగా నియామకాలు చేసిన సర్కారు ఇప్పుడు కొత్తగా మరో 2,842 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో వివిధ పథకాల అమలుకు ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలోనే..
► పోస్టుల వివరాలన్నీ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి.
► దరఖాస్తులు అక్కడే ఇస్తారు. దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలు జతచేసి గడువులోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇవ్వాలి.
► నియామకం జరిగే పోస్టుల్లో సుమారు 30 కేటగిరీలకు పైనే ఉన్నాయి. ఎక్కువగా మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి.
► 2,842 పోస్టులు కాకుండా మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు.
► అర్హత, పోస్టుల వివరాలు వంటివన్నీ కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

పారదర్శకంగా నియామకాలు
ఈ ప్రభుత్వం వచ్చాక వేలాది నియామకాలు జరిపాం. ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా పూర్తయింది. కొత్తగా నియామకాలు జరిగే వీటి విషయంలోనూ అంతే పారదర్శకంగా జరపాలని అధికారులను ఆదేశించాం. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది.
– ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

పథకాల అమలు మరింత పటిష్టంగా..
కొత్తగా నియామకాల వల్ల మానవ వనరుల బలం పెరుగుతుంది. దీనివల్ల పథకాల అమలు పటిష్టంగా జరుగుతుంది. ఈ నెలాఖరుకు కొత్తగా ఎంపికైన వారు విధుల్లో చేరతారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన సేవలందేలా చేస్తాం.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement