Alla Kali Krishna Srinivas
-
పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం జగన్
-
ప్రజలు కష్టాల్లో ఉన్నా రాజకీయాలేనా!
ఏలూరు టౌన్: ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని.. వారికి అండగా నిలబడి భరోసా కల్పించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ధ్వజమెత్తారు. ఏలూరులో పారిశుధ్యానికి సంబంధించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు బుధవారం ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉంటే రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. ఏలూరు ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనతో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి దుష్టరాజకీయాలు చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అంతుచిక్కని వ్యాధిబారిన పడిన వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారని, ఇక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షించి సత్వర వైద్య సేవలకు ఆదేశించారని గుర్తు చేశారు. దానిపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించటం దుర్మార్గమన్నారు. 40 ఏళ్ల అనుభవంతో మంచిగా సూచనలు, సలహాలు చేయటం మానేసి ఇలా నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. ఎక్కడో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనా«థ్‌రెడ్డికి ఏలూరులోని అంతుచిక్కని వ్యాధికి సంబంధం అంటగట్టటానికి చంద్రబాబుకు నోరెలా వచ్చిందో అర్థం కావట్లేదన్నారు. బాబుపై దృష్టి పెట్టేంత సమయం లేదు తమకు చంద్రబాబుపై దృష్టిపెట్టే ఆలోచన గాని, అంత సమయం గాని లేదని మంత్రి నాని స్పష్టం చేశారు. తమ దృష్టి అంతా ప్రజలపైనే ఉంటుందని, వారికి ఏ విధంగా సాయం చేయాలి, ఏ విధంగా అండగా నిలబడాలనే దృష్టితోనే తాము పని చేస్తామే తప్ప చవకబారు రాజకీయాలు చేయటం రాదన్నారు. ఏలూరు ప్రజలకు అండగా ఉంటూ వ్యాధిని నిర్మూలించేందుకు, మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిత్యం ఏలూరు పరిస్థితులపై సమీక్షిస్తూ, ముందుస్తు చర్యలకు ఆదేశాలిస్తున్నారని చెప్పారు. నగరంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకునేందుకే తాను పాదయాత్ర చేపట్టానని మంత్రి నాని స్పష్టం చేశారు. -
బోలెడు పడకలు ఖాళీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ విషయాన్ని ఖాళీగా ఉన్న పడకలే రుజువు చేస్తున్నాయి. ఒకప్పుడు రోజుకు సగటున 40 వేల పడకల్లో కరోనా బాధితులుండేవారు. ఇప్పుడు వాటి సంఖ్య ఐదు వేలకు పడిపోయింది. మరోవైపు కరోనా ఆస్పత్రుల సంఖ్యా గణనీయంగా తగ్గింది. మొన్నటి దాకా ప్రభుత్వ, ప్రయివేటులో కలిపి 248 ఆస్పత్రులను కోవిడ్ సేవల కోసమే వినియోగించగా, ఇప్పుడా ఆస్పత్రుల సంఖ్యను 169కి తగ్గించారు. మరోవైపు మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఒక దశలో రోజుకు 90 మంది కూడా మరణించిన రోజులున్నాయి. ప్రస్తుతం మరణాలు 10కి తగ్గింది. కేసులే కాదు.. తీవ్రతా తగ్గింది! కేసులు తగ్గుముఖం పట్టడమే కాదు తీవ్రత కూడా తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. కేవలం కోవిడ్ కేర్ సెంటర్లలోనే 16,134 పడకలుండగా, 1,882 పడకల్లో మాత్రమే బాధితులున్నారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో కోవిడ్ చికిత్సకు కేవలం నాలుగు ఆస్పత్రులే ఉన్నాయి. వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. అన్స్టేబుల్.. అంటే కరోనాతో విషమ పరిస్థితుల్లో ఉన్న వారి సంఖ్య జీరోగా ఉంది. పడకలు లేదా చికిత్సకు సంబంధించి 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగానే బాధితులకు తక్షణమే సాయం, వారు అడిగిన వివరాలు అందిస్తున్నారు. ఎక్కువ మంది బాధితులు వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులవైపే మొగ్గుచూపుతున్నారు. అయినా అప్రమత్తంగా ఉండాల్సిందే.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం వంటివి పాటించాల్సిందే. వీటిపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. కరోనా తగ్గిందని ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ మంత్రి -
కొత్తగా మరో 2,842 నియామకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతూనే ఉంది. గడిచిన ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కపోస్టుకూ నియామకం ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీగా నియామకాలు చేసిన సర్కారు ఇప్పుడు కొత్తగా మరో 2,842 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల అమలుకు ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలోనే.. ► పోస్టుల వివరాలన్నీ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి. ► దరఖాస్తులు అక్కడే ఇస్తారు. దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలు జతచేసి గడువులోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇవ్వాలి. ► నియామకం జరిగే పోస్టుల్లో సుమారు 30 కేటగిరీలకు పైనే ఉన్నాయి. ఎక్కువగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి. ► 2,842 పోస్టులు కాకుండా మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు. ► అర్హత, పోస్టుల వివరాలు వంటివన్నీ కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపర్చారు. పారదర్శకంగా నియామకాలు ఈ ప్రభుత్వం వచ్చాక వేలాది నియామకాలు జరిపాం. ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా పూర్తయింది. కొత్తగా నియామకాలు జరిగే వీటి విషయంలోనూ అంతే పారదర్శకంగా జరపాలని అధికారులను ఆదేశించాం. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పథకాల అమలు మరింత పటిష్టంగా.. కొత్తగా నియామకాల వల్ల మానవ వనరుల బలం పెరుగుతుంది. దీనివల్ల పథకాల అమలు పటిష్టంగా జరుగుతుంది. ఈ నెలాఖరుకు కొత్తగా ఎంపికైన వారు విధుల్లో చేరతారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన సేవలందేలా చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
ఉద్యోగ భద్రతపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి
సాక్షి, అమరావతి : ఉద్యోగ భద్రత విషయంలో గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్ల (ఏఎన్ఎం)కు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన ఏఎన్ఎంలకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకముందే.. విష ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన తప్పుబట్టారు. ఏఎన్ఎంల ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏఎన్ఎంలను ఉద్యోగాల నుంచి తీసివేస్తారన్న ప్రచారం ఎందుకు జరుగుతోందని అధికారులను ఆయన ఆరా తీశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ తనకు చెప్పారని పేర్కొన్న ఆళ్ల నాని.. ఈ అంశంపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. ఏఎన్ఎంల ఉద్యోగ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని, రాష్ట్రవ్యాప్తంగా 7,418 మంది ఏఎన్ఎంలు.. కాంట్రాక్టు, సెకండ్ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎం తదితర కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో భాగంగా 13,540 మంది ఏఎన్ఎంలను నియమిస్తున్నామని, ఈ పోస్టుల కోసం పైమూడు పద్ధతుల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు కూడా దరఖాస్తు చేసుకొని.. పరీక్షలకు హాజరుకావొచ్చునని వెల్లడించారు. ఇలా పరీక్షలు రాసేవారికి 10శాతం వెయిటేజీ కూడా ఇస్తున్నామని తెలిపారు. సచివాలయ పోస్టులకు ఎంపిక కాకపోయినా ఇప్పుడున్న ఉద్యోగాల్లో ఏఎన్ఎంలను యథావిధిగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయ పోస్టులకు ఎంపికైన వారికి వేతన అంతరంపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని, ఎవ్వరికీ ఎలాంటి నష్టం రాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. -
బీసీలూ.. చంద్రబాబు మాయలో పడకండి
పశ్చిమగోదావరి, చింతలపూడి: చంద్రబాబు మాయలో మరోసారి పడవద్దని ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) బీసీలకు సూచిం చారు. చింతలపూడిలో మంగళవారం నియోజకవర్గ బీసీ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆళ్ల నాని మాట్లాడుతూ చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప నాలుగున్నర ఏళ్లుగా బీసీల సంక్షే మం గురించి పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆదరణ పథకం పెట్టి ఇస్త్రీ పెట్టెలు, కు ట్టుమెషీన్లు ఇస్తే బీసీల స్థితిగతులు మారవన్నారు. నాణ్యత లేని పనిముట్లు ఇచ్చి బీసీలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఓట్లువేసి అధికారంలో కూర్చోబెట్టిన బీసీలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. ఫీజురీయింబర్స్‌మెం ట్ పథకం ద్వారా బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు వైఎస్సార్ కృషిచేశారన్నారు. బీసీ గర్జనను జయప్రదం చేయాలి ఏలూరులో ఈనెల 17న జరిగే బీసీ గర్జనను జయప్రదం చేయాలని ఆళ్ల నాని పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి బీసీలు గర్జనకు తరలివస్తున్నారని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా బీసీలను అభివృద్ధి చేసే విధంగా ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్‌ను సభలో ప్రకటిస్తారని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారు చెప్పిన వారికే ఆదరణ పథకాలు అందించారని, అర్హులకు అందలేదన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాద్, జిల్లా అధికార ప్రతిని«ధులు బొడ్డు వెంకటేశ్వరరావు, పోల్నాటి బాబ్జి, నాయకులు డి. నవీన్‌బాబు, వందనపు సాయిబాలపద్మ, కె.దినేష్‌రెడ్డి, ముసునూరి వెంకటేశ్వరరావు, మిడతా ర మేష్, వామిశెట్టి హరిబాబు, సోంబాబు, చిలుకూరి జ్ఞానారెడ్డి, మట్టా సురేష్, రెడ్డి బాబ్జి, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీసీల సత్తా చాటండి జిల్లాలో బీసీల సత్తాచాటాలని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. చింతలపూడి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స మన్వయకర్త వీఆర్ ఎలీజా అధ్యక్షతన ముఖ్య నా యకులతో సమావేశమయ్యారు. బీసీ గర్జన స భను జయప్రదం చేసేందుకు ప్రతిఒక్కరూ కష్టపడాలన్నారు. బీసీ గర్జనతో పార్టీకి బీసీల్లో ఉన్న బలాన్ని నిరూపించాలని కోరారు. ప్రతిగ్రామం నుంచి బీసీలు అధిక సంఖ్యలో గర్జన సభకు తరలివచ్చేలా చూడాలన్నారు. -
రైతు దీక్షను విజయవంతం చేద్దాం
తాడేపల్లిగూడెం : చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలిచ్చి రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను తీవ్ర ఇక్కట్ల పాలు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) విమర్శించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ నివాసంలో ఆయన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. రైతుల బాధలు తీర్చడానికి, వారిలో భరోసా కల్పించి, వారి పక్షాన పోరు చేయడానికి ఈనెల 31, ఫిబ్రవరి ఒకటో తేదీన తణుకులో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నారన్నారు. వివిధ రూపాలలో ఇబ్బందులు పడుతున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా జిల్లాలో జరుగుతున్న దీక్షను పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి మాట్లాడుతూ అబద్దాల వాగ్దానాలతో ఎన్నికల సమయంలో ప్రజలు నిలువునా ముంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందని, రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ హామీతో సీఎం మోసం చేశారని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడటంలో ఎప్పుడూ ముందుండే జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని, నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు కదిలిరావాలని కోరారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు యెగ్గిన నాగబాబు, జిల్లా కమిటీ సభ్యులు రాజా త్రినాథ్ పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలాన్ని నిరూపించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని నిరూపించడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త చొరవ చూపాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి తణుకులో నిర్వహించనున్న రైతు దీక్షను విజయవంతం చేసే అంశంపై నగరంలోని పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు రామచంద్రరావు నివాసంలో గురువారం ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా రైతుల రుణమాఫీ అమలు చేయించడం కోసం ప్రభుత్వంతో బహిరంగ పోరాటానికి దిగిన ఏకైక నాయకుడు జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకునిగా తొలిసారి చేస్తున్న రైతు దీక్షకు జిల్లాను వేదికగా ఎంచుకోవడం ఆయనకు జిల్లా ప్రజలపై ఉన్న అపార నమ్మకమే కారణమన్నారు. దీక్షను జయప్రదం చేయాలని, దీనిపై రైతుల్లో, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలను కోరారు. ముఖ్యనాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు కొఠారు రామచంద్రరావు, అప్పన ప్రసాద్, ఘంటా ప్రసాదరావు, మెట్టపల్లి సూరిబాబు, అక్కినేని సతీష్, మొరవనేని భాస్కరరావు, ఎంవీఎస్ఎన్ ప్రసాద్ (జానంపేట బాబు), చల్లగుళ్ళ తేజ, వీవీఎంజీహెచ్ కే ప్రసాద్ (మున్ని), తేరా ప్రసాద్, అబ్బదాసు సౌరి, చల్లారి సత్యనారాయణ, పొన్నూరి సత్యనారాయణ, షేక్ బుజ్జి పాల్గొన్నారు. -
జగన్‌తోనే రైతులకు న్యాయం
ఏలూరు (వన్‌టౌన్) : ‘చంద్రబాబు కొద్ది నెలల పాలనలోనే రైతులను ఎన్నో రకాలుగా వంచించారు. మీకు చంద్రబాబుతో న్యాయం జరగదు. కేవలం ఒక్క జగన్మోహన్రెడ్డి వల్లే రైతన్నలకు న్యాయం జరుగుతుంది. రైతుల కోసం మొన్న రాజన్న, నిన్న జగనన్న, నేడు నేను ఒకే మాటగా మీ కోసం చేస్తున్న ధర్మపోరాటంలో భాగస్తులు కండి. మీ ఆకలికేకలనే నినాదాలు చేసి హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం రండి’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు రూ.లక్షా 50 వేలుగా రుణమాఫీ హామీ దఫదఫాలుగా వడపోతలు చేపట్టి చివరకి ఎవరికీ ఉపయోగం లేని 50 వేల రుణం రైతులకు ఎరగా వేశారని విమర్శించారు. దీనివల్ల రైతులకు కనీసం వడ్డీకూడా కట్టలేని పరిస్థతి దాపురించిందన్నారు. పదవి కోసం ప్రజలను మోసం చేయటం ఒక్కటే చంద్రబాబు నేర్చుకున్న రాజకీయపాఠంలా కనబడుతోందని దుయ్యబట్టారు. ‘దేశానికి వెన్నుముక మీరే.. మీ కోసం నేనిచ్చే వరం ‘రుణ మాఫీ’. గెలిపించిన వెంటనే నేను పెట్టబోయే తొలిసంతకం రుణమాఫీ పైనే అంటూ చంద్రబాబు హామీలిచ్చి ప్రస్తుతం వంద రోజుల పాలన పూర్తయినందుకు వేడుకలు చేసుకోవడం తప్ప రైతులకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయకపోగా కొత్త రుణాలు మంజూరుకాక రైతులు నిరాశా నిస్పృహలతో కుప్పకూలిపోయారనేది నిజం కాదా అని ప్రశ్నించారు. రుణాలు కట్టలేక తాము మోసపోయామని గ్రహించి ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 85 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా ఇంకా కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు తీరులో మాత్రం మార్పేలేదన్నారు. హామీల సాధన కోసం, మోసపూరిత పాలనను ఎండగట్టేందుకు ప్రతి రైతు మహోద్యమంలా కదిలిరావాలన్నారు. రుణమాఫీపైనే ఆశలన్నీ పెట్టుకున్న జిల్లా రైతులు ఎంతగా మోసపోయారో ఇప్పటికే గ్రహించారన్నారు. ఇప్పటికైనా కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి హామీల అమలుకు చిత్తశుధ్దితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. అన్ని బ్యాంకులలో రైతులు తీసుకున్న పంటరుణాలు మాఫీచేస్తానన్న బాబు తన మాట నిలబెట్టుకునే వరకూ ఉద్యమించాలని కోరారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం రైతులతో నిర్వహించే ధర్నాకు రైతులంతా వచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
టీడీపీ దాష్టీకాలను అడ్డుకుందాం
యలమంచిలి (పాలకొల్లు అర్బన్) :తెలుగుదేశం పార్టీ నేతల వల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి వారిపక్షాన పోరాటం చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి యలమంచిలిలోని శ్రీఉమానరసింహ కల్యాణమండపంలో పార్టీ మండల కన్వీనర్ గుబ్బల వేణుగోపాలస్వామి (వేణు) అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గస్థాయి, మండల స్థాయి సమావేశాలు ఇప్పటికే పూర్తిచేశానన్నారు. అవసరమైతే గ్రామస్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలందరికీ అండగా నిలబడతానన్నారు. తెలుగుదేశం నేతలు చేస్తున్న దుర్మార్గాలు ప్రతిరోజు తన దృష్టికి వస్తున్నాయని, వాటినిృఆయా మండల స్థాయి అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. త్వరలోనే జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు నియామకం పూర్తిచేస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే 12 అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించినట్టు చెప్పారు. 5న జరిగే ధర్నా జయప్రదం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ రైతులు, మహిళ పక్షాన జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 5న విశాఖలో తలపెట్టిన ధర్నాకి మద్దతుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాని జయప్రదం చేయాలని నాని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు ఇలపకుర్తి నరసింహరావు, బీడిళ్ల సంపతరావు, ఉచ్చుల స్టాలిన్, పొత్తూరి బుచ్చిరాజు, జక్కంశెట్టి బోసు, గొల్లపల్లి శ్రీనివాస్, పాలపర్తి ఇమ్మానియేలు తదితరులు మాట్లాడుతూ గ్రామ, బూత్‌స్థాయి కమిటీలను నియమించాలని కోరారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ మహిళల్ని అడ్డుపెట్టుకుని ఇసుక దందా చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర సాదరాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టిం చిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. మండల కన్వీనర్ గుబ్బల వేణుగోపాలస్వామి (వేణు), ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు, జిల్లా యూ త్ అధ్యక్షుడు ముప్పిడి సంపత్, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, నడపన సత్యనారాయణ, పాలపర్తి ఇమ్మానియేలు, చేగొండి సూర్యశ్రీనివాస్, శిరిగినీడి రామకృష్ణ, మోకా నరసింహరావు, బోనం బులి వెంకన్న, పొత్తూరి బుచ్చిరాజు, వీరా ఉమాశంకర్, గుడాల సురేష్, కల్యాణం గంగాధరరావు, లంక చిరంజీవి పాల్గొన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేద్దాం పాలకొల్లు : అసత్య, అబద్దపు వాగ్దానాలతో అందలమెక్కిన తెలుగుదేశంపార్టీ అసలు బండారం బయటపడేలా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి స్ఫూర్తిగా గ్రామస్థాయిలో కూడా పార్టీ తరపున ప్రజలకు అండగా నిలుద్దామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణప్రసాద్ (నాని) పిలుపునిచ్చారు. బుధవారం పాలకొల్లు మండలం పూలపల్లిలోని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసం వద్ద నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికి వదిలివేయడంతో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. పార్టీని విస్తృతస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి ఇప్పటికే జిల్లాస్థాయిలో పటిష్టమైన నాయకత్వంతో 12 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశామని, దీనికి మండల, గ్రామస్థాయికి విస్తరించాల్సి ఉందన్నారు. గ్రామాల్లో పార్టీకోసం కష్టించి పనిచేసేవారికే పదవులు అప్పగిస్తామన్నారు. గత ఎన్నిక సమయం నాటికి వైఎస్సార్ సీపీకి గ్రామస్థాయిలో పటిష్టమైన కమిటీలు లేకపోవడం వల్లనే చంద్రబాబు అబద్దపు ప్రచారాన్ని అడ్డుకోలేక ఓటమి చెందామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ అసత్యవాగ్దానాలతో అందలమెక్కిన చంద్రబాబు వాటిని కప్పిపుచ్చుకోడానికి మరిన్ని అబద్దాలాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్నారని దీనిని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తరపున అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ పార్టీ సభ్యత్వ నమోదులోను రాయితీల పేరుతో మోసం చేస్తోందని విమర్శించారు. పలుగ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ గ్రామ, మండలస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే నాయకులతో కమిటీలు ఏర్పాటుచేయాలని కోరారు. కమిటీల నియామకంలో బంధుత్వాలు, మోహమాటాలకు తావులేకుండా పార్టీకోసం కష్టించి పనిచేసేవారిని గుర్తించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు చెల్లెం ఆనందప్రకాష్, ఘంటా ప్రసాదరావు, అస్లామ్, పాలకొల్లు మునిసిపల్ ప్రతిపక్షనేత యడ్ల తాతాజీ, నడపన సత్యనారాయణ, ఎం.మైఖేల్‌రాజు, గుణ్ణం సర్వారావు, గవర బుజ్జి పాల్గొన్నారు. -
ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం
ఉంగుటూరు : ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబానికి అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి నారాయణపురంలో ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాని మాట్లాడారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వారికి అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలతో మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలకు అండగా ఉండి పోరాడతామని నాని చెప్పారు. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడితే అవసరమైతే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడతారన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయటంతో పాటు, మండల, జిల్లా కమిటీలలో నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామన్నారు. రుణమాఫీ, ఎన్నికల వాగ్ధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారని, ఆయన కుతంత్రాలను ప్రజలు గ్రహించాలన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. యానిమేటర్ల సమ్మె, వారి సమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో ప్రస్తావిస్తామని నాని హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి కార్యకర్త ఉద్యమించాలని ఆళ్ల నాని పిలుపునిచ్చారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో సమస్యలపై నిలదీయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జీఎస్ రావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రుణామాఫీని పంచవర్ష ప్రణాళికగా అమలు చేస్తామని చెప్పటం అందరినీ మోసగించటమేనన్నారు. పింఛన్‌దారుల ఎంపికలో పచ్చ చొక్కాలకే అవకాశమిచ్చారని, అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు మాట్లాడుతూ తప్పులు వాగ్ధానాలు చేసి చంద్రబాబు గెలిచారని, ప్రజలు మోసపోయినట్టు ఇప్పుడు గ్రహిస్తున్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ నియోజకవర్గ కార్యకర్తలకు ఎప్పడూ అండగా ఉంటానని చెప్పారు. ఏ ఒక్కరినీ మరిచిపోనని, ఎక్కడైనా సమన్వయలోపం ఉంటే సరిదిద్దుకుని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తాన్నారు. సమావేశానికి ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీ జిల్లా నాయకుడు ఘంటా ప్రసాదరావు, ఏలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పటగర్ల రామ్మోహనరావు, ఎంపీటీసీ సభ్యులు తోట సత్యనారాయణ, గాలింకి ప్రమీలారాణి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నేకూరి ఆశీర్వాదం, వైఈసీ నాయకులు బండారు నాగరాజు, సలాది భీమరాజు, కలిదిండి సుబ్బతాతరాజు, చల్లా సూర్యారావు, నడిపంల్లి సోమరాజు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. -
ఇసుక దొంగలకు అధికార పార్టీ అండ
సాక్షి, ఏలూరు : ఇసుక దొంగలు జిల్లాలో రెచ్చిపోతున్నా వారిని అడ్డుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) దుయ్యబట్టారు. ఆ దొంగలకు అధికార పార్టీ అండదండటుండటమే ఇసుక అక్రమ రవాణాకు కారణమని ఆరోపించారు. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ఆదివారం ఆయ న స్పందించారు. టీడీపీ నేతలే ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ సొ మ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. సామాన్యులకు అందుబాటులోలేని విధంగా ఇసుకకు డిమాండ్ సృష్టించి లారీ ఇసుకను రూ.30 వేలకు పైగా విక్రయిస్తున్నారని అన్నారు. దీనివల్ల భవనాలు, ఇళ్లు నిర్మాణాలు నిలిచిపోయి భవన నిర్మాణ కార్మికులకు పని దొరకని పరిస్థితి తలెత్తిందన్నారు. మాఫియా చేతుల్లో ఇసుక ఉండటం వల్ల సామాన్యులకు ఇసుక అందడం లేదన్నారు. ప్రజాప్రతినిధుల వత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఇసుక దొంగల్ని ఏమీ చేయలేకపోతున్నారని, ఇకనైనా జిల్లా అధికారులు ప్రజల పక్షాన పనిచేయాలని సూచించారు. అలా చేయకపోతే ప్రజల్లో చులకనైపోతారని హెచ్చరించారు. డ్వాక్రా గ్రూఫులకు ఇసుక రీచ్‌లను కేటాయించటంలోనూ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. పెద్ద రీచ్‌లను టీడీపీ పెద్దల చేతుల్లోనే ఉంచి ఆదాయంరాని చిన్న రీచ్‌లను మహిళలకు కేటాయిస్తున్నారని చెప్పారు. వేలం లేకుండానే రీచ్‌లు కేటాయించడం అధికార పార్టీ కుట్రలో భాగమన్నారు. అన్ని రీచ్‌లకు ఒకే నిబంధనలు ఉండాల్సింది పోయి కొన్నిటికే నిబంధనలు వర్తింపజేయడమేమిటని ప్రశ్నించారు. ఇసుక దొంగలపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ రవాణాను అరికట్టకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పని చేయాల్సి వస్తుందని జిల్లా అధికారులకు నాని స్పష్టం చేశారు. -
కదనోత్సాహంతో..
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహంతో ముందుకు కదులుతోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సారథ్యంలో గురువారం నుంచి క్షేత్రస్థాయి కార్యాచరణకు రూపకల్పన చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆళ్ల నాని, పార్టీ ముఖ్య నేతలు పర్యటించనున్నారు. గురువారం పోలవరంలో పర్యటించడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో అనేక ఉద్యమాలు చేసిన నేపథ్యం ఉన్న ఆళ్ల నాని గతంలోనూ ఏలూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. తాజా పర్యటనలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇబ్బందులను తెలుసుకుని వారిలో ధైర్యం నింపనున్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి త్వరలో ఏర్పాటు చేసే అనుబంధ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించనున్నారు. కార్యకర్తలకు అండగా నిలబడటంతోపాటు, ప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబట్టేం దుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా క్షేత్రస్థాయి పర్యటనల్ని మలుస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టబోయే ప్రజా ఉద్యమాలు ఏ విధంగా ఉండాలనే దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించి సూచనలు, అభిప్రాయాలు సేకరించేందుకు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలసి పోలవరం నియోజకవర్గ పరిధిలోని బుట్టాయ గూడెంలో చేపట్టబోయే పాదయాత్రలో పాల్గొనేందుకు ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ మంత్రి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ వస్తున్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. జిల్లా ముఖ్య నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆళ్ల నానితో ఘంటా ప్రసాదరావు భేటీ చివరివరకూ పార్టీ కోసమే పనిచేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఘంటా ప్రసాదరావు స్పష్టం చేశారు. కొన్ని అపార్థాల కారణంగా కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్న ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు అళ్ల నానితో బుధవారం భేటీ అయ్యారు. పార్టీని నడిపించే బాధ్యత నాని తీసుకోవడంతో ఆయన సారథ్యంలో పార్టీ మరింత పటిష్టమవుతుందన్న నమ్మకం ఏర్పడిందని ప్రసాదరావు పేర్కొన్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడితో కలసి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. -
ప్రజల కోసమే పనిచేద్దాం
సాక్షి, ఏలూరు :‘ప్రజల కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.. వారికోసమే పనిచేద్దాం.. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు పునరంకితం అవుదాం’ అని పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని). పార్టీ సారథిగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్ఆర్ పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్ర 13 జిల్లాల్లో అత్యంత దారుణంగా నష్టపోయిన జిల్లా పశ్చిమగోదావరి అని, జిల్లా ప్రజలు కష్టాల్లో ఉన్నారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిక్షణం ప్రజల పక్షాన పోరాడటానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి ముందుకు నడిపిస్తామన్నారు. వచ్చేనెల 15 నుంచి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పర్యటించి, గ్రామస్థాయి వరకూ వెళ్లి ప్రతి కార్యకర్తను కలుస్తానన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా అక్టోబర్ 3 నాటికి జిల్లా కమిటీలను ప్రకటిస్తామని వెల్లడిం చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్ర రాజధాని ఏర్పాటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ప్రభుత్వంపై నాని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రుణమాఫీ పేరుచెప్పి రైతులు, డ్వాక్రా మహిళలను, ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులు, యువకులను చివరకు బడుగు, బలహీన వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛన్లు ఇస్తామంటున్న ప్రభుత్వం ఆ మాటనైనా నిలుపుకోవాలన్నారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరం పోరాడతామన్నారు. జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళతానని ఆళ్ల నాని అన్నారు. నానికి అభినందనల వెల్లువ జిల్లాలోని పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని ముందుకు నడిపించగల సత్తా ఉన్న నేత ఆళ్ల నాని అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. పదేళ్లుగా పదవికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం రాగానే అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇకపై ఆ పార్టీ వారి ఆటలు సాగవని అన్నారు. పార్టీకి నాని చేసిన సేవలకు, ఆయన పడిన కష్టానికి దక్కిన గౌరవమే జిల్లా అధ్యక్ష పదవి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడుతుంటే అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయన్నారు. టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరడం లేదనే విషయాన్ని నాని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులకు పాల్పడటం మినహా ఒక్కపని కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు అన్నారు. డ్వాక్రా రుణాలు సక్రమంగా చెల్లించే మహిళలను డిఫాల్టర్లుగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని వేధిస్తే ఖబడ్దార్’ అని కారుమూరి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా పార్టీని నడిపించాలని మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆకాంక్షించారు. చంద్రబాబుకు అత్యధిక స్థానాలు దక్కడంతో ప్రజలకు మేలు చేస్తారని ఆశించామని, ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు తగిన సమయం కేటారుుంచకపోవడం దారుణమన్నారు. నాని ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోని నెలకొన్న సమస్యలపై పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని రవీంద్ర సూచించారు. నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసుకుని, ప్రతి సోమవారం ప్రజల సమస్యలను మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి సూచించారు. రూ.లక్షన్న మాత్రమే రుణమాఫీ చేస్తే రూ.మూడు లక్షల రుణం ఉన్న రైతులకు వడ్డీకే సరిపోదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టమని ఆనాడు లేఖ ఇచ్చి, కాంగ్రెస్‌పై అవిశ్వాసం పెడితే సహకరించకుండా ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి లేదంటున్న చంద్రబాబు తీరును ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఎండగట్టారు. గతంలో ప్రజల పక్షాన ఏవిధంగా పోరాటం చేశామో అదేవిధాంగా భవిష్యత్‌లోనూ నాని నాయకత్వంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చి సత్తా ఏమిటో మరోసారి చూపించాలని మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని చింతలపూడికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయం అనేది పుట్టిన తరువాత టీడీపీ వంటి అరాచక పార్టీని ఎన్నడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు అన్నారు. నానికి పూర్తిగా సహరించి పార్టీని ముందకు నడిపిస్తామని పార్టీ నేత చీర్ల రాధయ్య అన్నారు. దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలపై సెక్షన్-307 కింద కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇక మీదట అలా జరగకుండా నాని అండగా ఉండాలని పార్టీ నేత తలారి వెంకట్రావు కోరారు. సమావేశంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, పార్టీ నేతలు చలుమోలు అశోక్‌గౌడ్, ఊదరగొండి చంద్రమౌళి, కొఠారు రామచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు, అప్పన ప్రసాద్, పార్టీ నాయకురాలు రంగమ్మ, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పాల్గొన్నారు. రుణమాఫీ చేయకుండా రైతు బడ్జెట్ ఎందుకు: కొత్తపల్లి ‘అధికార పార్టీ ఎన్నికలముందు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చకుండా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం వల్ల ఏం ప్రయోజనం’ అని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ‘రాజకీయాల్లో గెలుపు ఓటములకు కాకుండా బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపిస్తున్నారు. ముఖ్యమంత్రి కాలేకపోయాననే నిరుత్సాహం ఆయనలో ఎక్కడా కనిపించడం లేదు. శాసనసభలో జగన్ ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో 30 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు కూడా ఇంత సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషించలేరు. వైఎస్ జగన్ మాట్లాడుతుంటే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా జరగనివ్వకుండా, మైకులు విరగొట్టిన ఘనత టీడీపీ నేతలది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైకులు పట్టుకుంటే రాద్ధాంతం చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడకూడదనుకున్నప్పుడు అసెంబ్లీలో కాకుండా ఎన్టీఆర్ భవన్లో సమావేశాలు పెట్టుకుంటే మంచిది’ అని పేర్కొన్నారు. జిల్లాలో ఆళ్ల నాని నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఆయనకు పార్టీ నేతలంతా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని సుబ్బారాయుడు స్పష్టం చేశారు. -
ప్రతి కార్యకర్తను కలుస్తా
సాక్షి, ఏలూరు:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడిగా నియమితులైన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఈనెల 27న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏలూరు ఎన్ఆర్ పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఈ వేడుకను అట్టహాసంగా జరపాలని పార్టీ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే నానికి ఫోన్ ద్వారా తమ ఆకాంక్షను వెల్లడించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు కష్టాల్లో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో బాధ్యతల స్వీకారోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుకోవాలని నాని భావిస్తున్నారు. బొకేలు, పూల దండలు తీసుకు రావద్దని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల తర్వాత నిరాశకు గురైన పార్టీ నేతలందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం ఓ అవకాశమ ని ఆళ్ల నాని భావిస్తున్నారు. జిల్లాలోని 15 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సెగ్మెంట్ల ముఖ్యనేతలను ఇప్పటికే ఫోన్ ద్వారా నాని ఆహ్వానించారు. సెప్టెంబర్ 10నుంచి జిల్లా అం తటా పర్యటించేందుకు నిర్ణయించుకున్న ఆయన రోజు కొక నియోజకవర్గం చొప్పున 15 నియోజకర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దశలవారీగా జిల్లా, మండలస్థాయి కమిటీలను నియమించనున్నారు. సీనియర్ నేతల సహకారంతో అందరినీ కలుపుకుని పార్టీకి పునరుజ్జీవం తీసుకురావడానికి పాటుపడతానని నాని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే ప్రతి కార్యకర్తను కలుస్తానని ఆయన చెప్పాన్నారు. పదవీ బాధ్యతల స్వీకారాన్ని వేడుకలా కాకుండా జిల్లాలో పార్టీ పునర్నిర్మాణానికి తొలి అడుగుగా ఉండాలని భావిస్తున్నట్టు ఆళ్ల నాని ‘సాక్షి’తో అన్నారు. పార్టీలో నూతనోత్సాహం పార్టీ జిల్లా సారథిగా నాని నియమితులు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అనుభవం, ఆలోచన ఉన్న నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. పార్టీని ఆయన సమర్థవంతంగా నడిపించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న సీనియర్ నాయకులు నాని నియూమకంతో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. మండలాధ్యక్షుల నియామకాన్ని కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తిచేయాలని నాని ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి సముచిత స్థానం కల్పించేందుకు నాని నిర్ణయించారు.