
వినతులు స్వీకరిస్తున్న ఏజేసీ, డీఆర్వో
- మైనార్టీ గురుకులాల్లో తీరుపై ఫిర్యాదు
- గ్రీవెన్స్‌లో అధికారుల దృష్టికి వినతులు
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా కేంద్రం ఖమ్మంలోని ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 240 బాలికల సీట్లకు గాను 120 మాత్రమే భర్తీ చేశారని, మిగిలిన 120 సీట్లను వెంటనే భర్తీచేయాలని కలెక్టర్ ఆదేశించినా మైనార్టీ, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పరిషత్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఏజేసీ శివశ్రీనివాస్, డీఆర్వో శ్రీనివాస్ వద్ద మొరపెట్టుకున్నారు. స్పందించిన ఏజేసీ వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
lఏన్కూరు మండలం మాన్యతండాకు చెందిన రైతులు తమకు రుణమాఫీ కాలేదని, బ్యాంక్ అధికారులు తిప్పించుకుంటున్నారని విన్నవించారు.
lఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి, పల్లెగూడెం, ఎంవెంకటాయపాలెం, కాచిరాజుగూడెం గ్రామాల్లో జాతీయ రహదారి పనుల కోసం ఇళ్లు పోకుండా చూడాలని కోరారు.