హ్యాండ్‌సెట్‌ల రంగంలో తనదైన ముద్రవేసిన నోకియా.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. సామాన్యుల కోసం తక్కువ ధర, వన్ ఇయర్ రిప్లెస్ మెంట్ గ్యారెంటీతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా నోకియా సి20 పేరుతో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది.
ఇటీవల బండకేసి బాదినా పగలని నోకియా ఎక్స్ఆర్20ని విడుదల చేసి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు నోకియా సి20తో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. వాస్తవానికి ఈ ఫోన్ రెండునెలల క్రితమే విడుదల కావాల్సి ఉండగా..అప్ గ్రేడ్ తో పాటు ఇతర కారణాల వల్ల భారత్‌లో విడుదలవ్వడం ఆలస్యమైంది. అయితే తాజాగా ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో పాటు సాఫ్ట్‌వేర్లను క్లీన్ చేసున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు నోకియా సి 20 ప్లస్‌పై ఒక సంవత్సరం రీప్లేస్‌మెంట్ గ్యారెంటీని కూడా ఇస్తుంది. అంటే మీరు కొన్న నోకియా ఫోన్ సంవత్సరంలోపు ఉపయోగంలో లేకపోతే కొత్త ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ సందర్భంగా సీ20 ప్లస్‌లో నోకియా సి 1 ప్లస్,నోకియా సి30, తో పాటు 5జీ స్మార్ట్ ఫోన్ నోకియా ఎక్స్ ఆర్ 20ను త్వరలో విడుదల చేయనుంది.
నోకియా సి20 ప్లస్ ధర
నోకియా సి20 ప్లస్ 2జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ రూ. 8,999కే అందిస్తుండగా..3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ రూ. 9,999కే దక్కించుకోవచ్చు.జియో ఎక్స్ క్లూజీవ్ ప్రోగ్రాంలో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. కాకపోతే జియో సిమ్ కార్ట్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో ఆఫర్‌తో ఫస్ట్ వేరియంట్ ధర రూ .8,099, సెకండ్ వేరియంట్ రూ. 8,999 సొంతం చేసుకోవచ్చు. జియోఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రామ్ కింద రూ .4,000 విలువైన ఆఫర్లు అందుబాటులోకి ఉండనున్నాయి.
నోకియా సి 20 ప్లస్ స్పెసిఫికేషన్‌లు
నోకియా సి 20 ప్లస్ 6.5-అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లే,నాచ్ టాప్ 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 3జీబీ ర్యామ్‌తో ఆక్టా కోర్ యునిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్, 32జీబీ ఆన్‌బోర్డ్ మెమరీతో పాటు స్టోరేజీని పెంచుకుంనేందుకు ఎస్‌డీ మైక్రో కార్డ్‌లను యాడ్ చేసుకోవచ్చు.ఫోన్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)ను రన్ చేస్తుంది. మీరు గూగుల్ నుండి జిమెయిల్, యూట్యూబ్,మ్యాప్స్ ను ఉపయోగించుకోచ్చు.
ఫోన్ వెనుక భాగంగా 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను డిజైన్‌తో వస‍్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, నాచ్ లోపల 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫోన్ రెండు సిమ్ కార్డ్ స్లాట్స్, ఎఫ్‌ఎం రేడియో, 4జీ VoLTE, వైఫై, బ్లూటూత్,3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌కు సపోర్ట్ చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వినియోగించుకునేలా 4950ఏఎంచ్ బ్యాటరీని అందిస్తున్నట్లు నోకియా ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment