ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ అధినేత ముఖేష్ అంబానీ తర్వలో భారీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుమారు 1.6 బిలియన్ల మేర రుణాల్ని సమీకరించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.
బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా నుంచి ఎక్విప్‌మెంట్ కొనుగోలు నిమిత్తం భారీ ఎత్తున లోన్ రూపంలో రిలయన్స్ నిధుల్ని సమకూర్చుకోనుంది. కొనుగోలు ఒప్పందం గడవు సమీపిస్తున్న తరుణంలో సిటీ గ్రూప్ ఐఎన్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో’ సంస్థల నుంచి ఈ మొత్తాన్ని తీసుకోనున్నట్లు సమాచారం.
రిలయన్స్ జియో ప్రతినిధులు పైన పేర్కొన్న సంస్థల అధినేతలతో చర్చించనున్నారని, ముఖేష్ అంబానీ 15 కాల పరిమితితో రుణాన్ని తీసుకోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి, ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. అయితే, ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ ఫిన్వెరా రిలయన్స్ తీసుకునే లోన్ మొత్తానికి గ్యారెంటీ కవర్‌కు ముందుకు వచ్చింది.
గత ఏడాది అక్టోబర్‌లో ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా .. దేశీయ టెలికాం దిగ్గజం జియో 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు కావాల్సిన పరికరాల్ని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. జియో సైతం స్ప్రెక్టం కొనుగోలు కోసం బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన సంస్థగా చరిత్రకెక్కింది. కాగా, రిలయన్స్ సంస్థ రుణాల కోసం తమతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదికల్ని జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలు ఖండించాయి. నోకియా అధికార ప్రతినిధి,రిలయన్స్ సైతం ఇదే తరహాలో స్పందించాయి.
Comments
Please login to add a commentAdd a comment