సిట్రోయెన్‌ వాహనాలకు జియో–బీపీ చార్జింగ్‌ సదుపాయాలు | Jio Bp To Build Ev Charging Infra For Citroen India | Sakshi
Sakshi News home page

సిట్రోయెన్‌ వాహనాలకు జియో–బీపీ చార్జింగ్‌ సదుపాయాలు

Published Sat, Jan 14 2023 9:49 AM | Last Updated on Sat, Jan 14 2023 9:59 AM

Jio Bp To Build Ev Charging Infra For Citroen India - Sakshi

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం సిట్రోయెన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు (ఈవీ) అవసరమైన చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను జియో–బీపీ అందించనున్నాయి. దేశవ్యాప్తంగా సిట్రోయెన్‌ కీలక డీలర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లలో డీసీ ఫాస్ట్‌ చార్జర్లను ఏర్పాటు చేయనున్నాయి.

ఈవీ కార్ల కస్టమర్లందరికీ కూడా ఈ చార్జర్లు అందుబాటులో ఉంటాయని జియో–బీపీ వెల్లడించింది. సిట్రోయెన్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఈ–సీ3 ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ప్రవేశపెట్టనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement