ఎంజీ మోటార్స్‌ ‘జెడ్‌ఎస్‌’ ఆవిష్కరణ | MG ZS Is To Be Launched In India In January 2020 | Sakshi
Sakshi News home page

ఎంజీ మోటార్స్‌ ‘జెడ్‌ఎస్‌’ ఆవిష్కరణ

Published Fri, Dec 6 2019 12:52 AM | Last Updated on Fri, Dec 6 2019 12:52 AM

MG ZS Is To Be Launched In India In January 2020 - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎంజీ మోటార్స్‌.. ‘జెడ్‌ఎస్‌’ పేరిట ఎలక్ట్రిక్‌ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఈ కారు విక్రయాలను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్‌ 143 పీఎస్‌ పవర్‌తో అందుబాటులోకి రానుందని, ఒక్కసారి చార్జ్‌ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుందని కంపెనీ వివరించింది.

తొలుత ఈ కారు ఢిల్లీ/ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉండనుందని కంపెనీ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా అన్నారు. ఇక రూ. 10 లక్షల లోపు ఉండే చిన్నపాటి ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement