ఐపీఎల్‌ 2021: బెయిర్‌ స్టో స్థానంలో విండీస్‌ స్టార్‌ ఆటగాడు | IPL 2021: SRH Signed With Sherfane Rutherford Replace Jonny Bairstow | Sakshi
Sakshi News home page

IPL 2021: బెయిర్‌ స్టో స్థానంలో విండీస్‌ స్టార్‌ ఆటగాడు

Published Sun, Sep 12 2021 9:43 AM | Last Updated on Mon, Sep 20 2021 11:56 AM

IPL 2021: SRH Signed With Sherfane Rutherford Replace Jonny Bairstow - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 సీజన్ రెండో అంచె పోటీలకు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాళ్లు దూరమవుతున్న సంగతి తెలిసిందే. జానీ బెయిర్‌ స్టో, క్రిస్‌ వోక్స్‌, డేవిడ్‌ మలాన్‌లు ఐపీఎల్‌ 14వ సీజన్‌కు దూరంగా ఉండనున్నారు. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీష్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బెయిర్‌ స్టో స్థానంలో వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ షెర్పెన్‌ రూథర్‌ఫోర్డ్‌ను తీసుకున్నట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం సీపీఎల్‌లో ఆడుతున్న రూథర్‌ఫోర్ట్‌ త్వరలోనే దుబాయ్‌కు చేరుకోనున్నాడు. జానీ బెయిర్‌ స్టో స్థానంలో కరీబియన్‌ రైసర్‌ వస్తున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌ టూ షెర్పెన్‌ రూథర్‌ఫోర్ట్‌ అంటూ కామెంట్‌ చేసింది.

చదవండి: Viral Video: రనౌట్‌ అవకాశం; ఊహించని ట్విస్ట్‌.. ఫీల్డర్ల పరుగులు

ఇక 2018లో వెస్టిండీస్‌ తరపున అరంగేట్రం చేసిన రూథర్‌ఫోర్ట్‌ 6 టీ20 మ్యాచ్‌లాడి 43 పరగులు చేయడంతో పాటు ఒక వికెట్‌ తీశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టీ20 మ్యాచ్‌లాడి 624 పరుగులు చేశాడు. కాగా ఇంతకముందు రూథర్‌ఫోర్డ్‌ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిరాశజనక ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కరోనాతో లీగ్‌ వాయిదా పడడానికి ముందు డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో కేన్‌ విలియమ్‌సన్‌కు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

చదవండి: IPL 2021: కళ తప్పనున్న మలిదశ ఐపీఎల్‌.. ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లు దూరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement