IPL 2023: Gujarat Titans Name Dasun Shanaka As Kane Williamson Replacement - Sakshi
Sakshi News home page

Dasun Shanaka: గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్‌

Published Tue, Apr 4 2023 10:32 PM | Last Updated on Wed, Apr 5 2023 9:07 AM

IPL 2023: Dasun Shanaka Set-Join Gujarat Titans Replace Kane Williamson - Sakshi

IPL 2023: గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌. గాయంతో టోర్నీకి దూరమైన కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో లంక కెప్టెన్‌ దాసున్‌ షనకను ఎంపిక చేసింది. ఈ మేరకు గుజరాత్‌ టైటాన్స్‌ షనక ఎంపికను ఖరారు చేసింది. సీఎస్‌కేతో జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తూ క్యాచ్‌ తీసుకునే క్రమంలో కేన్‌ విలియమ్సన్‌ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతని కుడి కాలు బెణికినట్లు తెలిసింది. ప్రస్తుతం చికిత్స కోసం న్యూజిలాండ్‌ వెళ్లిపోయిన విలియమ్సన్‌ ఐపీఎల్‌ మొత్తానికి దూరమయ్యాడని గుజరాత్‌ పేర్కొంది.

తాజాగా కేన్‌ మామ స్థానంలో షనకను రూ.50 లక్షల కనీస ధరకు తీసుకున్నట్లు తేలింది. ఇక లంక కెప్టెన్‌గా షనక తన జోరు కనబరుస్తున్నాడు. ఇటీవలే టీమిండియాతో జరిగిన టి20 సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 124 పరుగులు చేశాడు. వన్డే సిరీస్‌లోనూ 121 పరుగులతో లంక టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కాగా షనకకు ఇదే తొలి ఐపీఎల్‌ కావడం విశేషం. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన షనక రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలింగ్‌తో వికెట్లు తీయగల నైపుణ్యం అతని సొంతం.  కాగా షనక సారధ్యంలోనే లంక జట్టు 2022లో ఆసియా కప్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. దసున్‌ షనకతో కేన్‌ విలియమ్సన్‌ స్థానాన్ని భర్తీ చేస్తారంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో యూజర్లను ఆకట్టుకుంటోంది.

చదవండి: నక్క తోక తొక్కిన వార్నర్‌.. 

రిషబ్‌ పంత్‌ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement