New Zealand Captain Williamson Set To Miss World Cup After Knee Injury - Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ క్రికెట్‌కు అతి భారీ షాక్‌

Published Thu, Apr 6 2023 8:15 AM | Last Updated on Thu, Apr 6 2023 9:08 AM

Williamson To Undergo Knee Surgery, Set To Miss World Cup 2023 - Sakshi

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు అతి భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌, స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు దూరంకానున్నాడని సమాచారం. ఇటీవల చెన్నైసూపర్‌కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్‌-2023 మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన కేన్‌ మామ, మోకాలికి మేజర్‌ సర్జరీ చేయించుకోనున్నాడని తెలుస్తోంది. విలియమ్సన్ కుడి మోకాలి భాగం ఛిద్రం అయినట్లు స్కాన్‌లలో వెల్లడికావడంతో సర్జరీ తప్పదని వైద్యులు సూచించారు.

శస్త్రచికిత్స ప్రక్రియ మొత్తం పూర్తై, కోలుకునేందుకు కనీసం 6 నెలల సమయం పట్టనుండటంతో విలియమ్సన్‌ వరల్డ్‌కప్‌ ఆడటం దాదాపుగా అసంభవమని తెలుస్తోంది.  గత వరల్డ్‌కప్‌లో (2019) ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచి, తన జట్టును ఫైనల్‌ వరకు తీసుకెళ్లిన విలియమ్సన్‌ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌కు అందుబాటులో ఉండకపోతే, అది న్యూజిలాండ్‌ విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Photo Credit: IPL Twitter

కాగా, ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్.. ‌అహ్మదాబాద్‌ వేదికగా చెన్నైసూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆపబోయి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతను ఐపీఎల్‌-2023 సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. విలియమ్సన్‌ సరిగ్గా నిలబడలేక, ఊత కర్రలు, ఇతరులు సాయంతో నడుస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement