సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 9,920 కండక్టర్, 14,657 డ్రైవర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటి భర్తీ బాధ్యతను యాజమాన్యానికే అప్పగించింది. నేరుగా నియామకాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ జీవోను ఆధారంగా చేసుకుని ఒకట్రెండు రోజుల్లో రవాణా శాఖ మరో జీవో జారీ చేయనుంది. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందినే ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నారు. కాగా ఆర్టీసీలోని పోస్టులతోసహా మొత్తం 26,395 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. హోం, న్యాయ, రెవెన్యూ శాఖల్లోని 734 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, గిరిజన సంక్షేమ శాఖలో 898 టీచర్ పోస్టులు. బేవరేజెస్ కార్పొరేషన్‌లో 175 పోస్టులు భర్తీ చేస్తారు.
ఖాళీలు తెలుసుకుని ఫీజు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ముందుగా తమ విభాగంలో ఖాళీలు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయం సూచించింది. రోస్టర్ పాయింట్ ప్రకారం తమ విభాగం(రిజర్వేషన్) కోటాలో ఖాళీలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తు రుసుం చెల్లించాలని కోరింది.
9,920 కండక్టర్, 14,657 డ్రైవర్ పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం
Published Fri, Jan 3 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement