
న్యూఢిల్లీ: యూపీఐ క్యూఆర్ కోడ్‌కు డిజిటల్ రూపీని (సీబీడీసీ) అనుసంధానం చేసినట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. దీంతో ఇక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్ రూపీ ద్వారా చెల్లింపులు జరపవచ్చని సంస్థ తెలిపింది.
వ్యాపారవర్గాలు నిరాటంకంగా డిజిటల్ రూపీ రూపంలో చెల్లింపులను పొందేందుకు ఇది సహాయపడగలదని బ్యాంకు ఈడీ మదివణన్ బాలకృష్ణన్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా సీబీడీసీ వినియోగాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు యూపీఐ ఇంటరాపరబిలిటీ ఉపయోగపడగలదని వివరించారు. భౌతిక కరెన్సీకి సమాన హోదా ఉండే డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంక్ గతేడాది అధికారికంగా ప్రవేశపెట్టింది.