సాక్షి, జనగామ: అమాయక యువతను మత్తు మాఫి యా విష వలయంలోకి లాగుతోంది. హైదరాబాద్ కల్చర్ జిల్లాకు అంటుకుంది. ఇన్నాళ్లు పెద్దలకే పరిమితమైన గంజాయి వ్యసనం ఇప్పుడు యువతను చెడగొడుతోంది. నిషేదిత గంజాయి విక్రయాలను కొందరు యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసిన మత్తు మాఫియా వారిని నాశనం చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు.
కొంతమంది యువత అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న వారు.. ‘మత్తు’లోకి దింపుతూ.. బానిసలుగా మార్చేస్తున్నారు. రేపటి తరానికి దిక్సూచిగా నిలవాల్సిన యువత అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ప్యాకెట్ మనీల పేరుతో తల్లిదండ్రుల గారాబంతో మరింత నాశనమవుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంగా గంజాయి ప్యాకెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం సాగుతుంది. గతంలో పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోగా బచ్చన్నపేట, రఘునాథపల్లిలో పెద్ద ఎత్తున పట్టుబడిన సంగతి తెలిసిందే.
విద్యార్థులే లక్ష్యంగా..
అడ్డదారిలో డబ్బులు సంపాదనే లక్ష్యంగా కొంతమంది జనగామ కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలను సాగిస్తున్నట్లు సమాచారం. గంజాయిని హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి.. చిన్న చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, గుంటూరు తదితర పట్టణాల నుంచి ఇక్కడికి గంజాయి సరఫరా అవుతున్నట్లుగా తెలుస్తుంది. అర్థరాత్రి సమయంలో రహస్య ప్రదేశాలకు తరలిస్తూ.. 10 గ్రాముల ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేస్తూ..డంపింగ్ చేస్తున్నారు.
ఎవరికి అనుమానం కలుగకుండా..జిల్లా కేంద్రంలోని వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలతో పాటు కళాశాలల వద్ద గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా చా కచక్యంగా తప్పించుకుంటూ గంజాయి అమ్మకా లు సాగుతున్నాయని సమాచారం. జిల్లా కేంద్రం చుట్టూ.. సిద్దిపేట, సూర్యపేట, వరంగల్, హైదరాబాద్ రహదారుల శివారులో సాయంకాలం 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 10 గంట ల వరకు గంజాయి పీలుస్తూ.. అనుభూతి పొం దినట్లుగా బ్రమపడుతున్నారు. స్థానికంగా నమ్మకం ఉన్న వారికి పెద్ద ఎత్తున కమీషన్ల ఎరచూపిస్తూ గంజాయి ప్యాకెట్లను అమ్మకాలు చేయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఒక్కసారి పీలిస్తే..
గంజాయి ఆకును ఒక్కసారి పీల్చిన యువత.. దూరం కావాడం చాలా కష్టం. ప్రతి వ్యక్తి శరీరంలో ఆల్కహాల్ ఎంత అవసరమో అంతే ఉండాలి. అవసరమైన దాని కంటే ఎక్కువగా డ్రగ్స్ తీసుకు వారి ఆయుష్సు రోజు రోజుకు తగ్గిపోతుంది. అంతే కాకుండా ప్రతి రోజు సమయానుకూలంగా మత్తు కావాలనే కోరిక పుడుతుంది. పొడి గంజా యితో పాటు ఇంజక్షన్ల రూపంలో కూడా వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. మత్తు ఇంజక్షన్లను తీసుకోవడం వల్ల పూర్తిగా నరాల వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. మత్తు దొరకని సమయంలో దీనికి అలవాటు పడిన వారు ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. అంతే కాకుండా సైకోగా మారే అవకాశం ఉంటుంది.
దర్జాగా అమ్మకాలు..
పోలీసులకు.. పౌరులకు అనుమానం రాకుండా చాలా చోట్ల గంజాయి ఉన్న సిగరెట్లను అమ్మకా లు చేస్తున్నారు. గతలో జనగామ జిల్లా కేంద్రంలో విదేశీ సిగరెట్లతో పాటు గుట్కా అమ్మకాలు చేస్తు న్న వారిని పోలీసులు పట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయం కావడంతో అధి కారులు.. పోలీసు నిఘాతో పాటు బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. తనిఖీలను తప్పించుకునేందుకు విద్యార్థుల రూపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున గం జాయిని సరఫరా చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు డబ్బుల కోసం తల్లిదండ్రులను పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలు కోకొల్లలు.
పీడీ యాక్టు తప్పదు
గుట్కా, గుడుంబా, గంజాయి, హుక్కా అమ్మకాలు చేస్తూ రెండుసార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తాం. వీటి అమ్మకాలపై గట్టి నిఘా వేసినం. అమ్మకాలు చేస్తూ పట్టుబడితే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుడుంబా, గుట్కా అమ్మకం దారులను తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తు జమానత్ తీసుకుంటున్నాం. ఒక సారి కేసు నమోదైన వారు తిరిగి విక్రయిస్తే.. లక్ష జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ చర్యగా భావిస్తాం. గంజాయి, గుట్కా అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తాం. వినోద్‌కుమార్, ఏసీపీ, జనగామ
Comments
Please login to add a commentAdd a comment