Cannabis supply
-
భారత సంతతి తంగరాజును ఉరితీసిన సింగపూర్.. కేసు ఇదే..
సింగపూర్: భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(46)ను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. కాగా, తంగరాజు.. సింగపూర్‌కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో, ఉరిశిక్షను అధికారులు అమలు చేశారు. వివరాల ప్రకారం.. సింగపూర్‌కు కిలోకిపైగా గంజాయిని రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో, తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజు సుప్పయ్యను ఉరి తీసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్పయ్య కుటుంబ సభ్యులు, ఐక్యరాజ్య సమితి యాక్టివిస్టులు విజ్ఞప్తులు చేసినప్పటికి సింగపూర్ అధికార యంత్రాంగం ఉరి శిక్షను అమలు చేసింది. ఇదిలా ఉండగా.. తంగరాజు సుప్పయ్య కుటుంబ సభ్యులు, యాక్టివిస్టులు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్‌కు చివరి నిమిషంలో లేఖ రాశారు. అయినప్పటికీ ఉరి శిక్షను అమలు చేయడం గమనార్హం. అయితే, తంగరాజు.. నేరం చేయలేదనే బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో దోషిగా తేలాడు. ఆయనకు విచారణ సమయంలో కూడా పరిమితంగా లీగల్ మద్దతు లభించిందని యాక్టివిస్టులు చెబుతున్నారు. మరోవైపు.. తంగారాజు ఉరిశిక్షపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వారం తంగరాజు ఉరిశిక్షకు సంబంధించిన నోటీసు వచ్చిన తర్వాత ఛాంగి జైలులో గ్లాస్ కిటికీ మధ్యలో నుంచి తాము సుప్పయ్యను చూసేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఈ రోజు వస్తుందని తంగరాజు మానసికంగా సిద్ధమై ఉన్నారని, అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారని చెప్పారు. కాగా, సింగపూర్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సింగపూర్ చెబుతోంది. అందుకు ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. Singapore has hanged 46-year-old Tangaraju Suppiah who was found guilty in 2018 of trafficking more than 1kg of cannabis https://t.co/TZ5yq6rIVv pic.twitter.com/P5aM22AUIa — Al Jazeera English (@AJEnglish) April 26, 2023 -
ఏపీ: ఆపరేషన్ పరివర్తన్ రెండోదశ సక్సెస్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ రెండోదశను కూడా విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 650 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఐదు జిల్లాలకు సంబంధించి దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నాము. దీనిలో 90 శాతం గంజాయి ఒరిస్సా నుండి వచ్చింది. పరేషన్ పరివర్తన ద్వారా గత ఏడాది 7500 ఎకరాల్లో గంజాయిని నిర్మిలించాము. ఈ ఏడాది 650 ఎకరాల్లో ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి నిర్మిలించాము. గంజాయి ధ్వంసం చేసిన 7500 ఎకరాల్లో ఆల్టర్ నేట్ పంటలు వేసుకునేలా ప్రోత్సహించడం జరుగుతుంది. 3500 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తరలి రాకుండా 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. ఒరిస్సా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణా అరికడుతున్నాము. ఆపరేషన్ పరివర్తన్ నిరంతర ప్రక్రియ. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గంజాయి తోటలను నాశనం చేస్తున్నాము. గతంలో కూడా 2 లక్షల ఎకరాల గంజాయిని ధ్వంసం చేశాము. ఆపరేషన్ పరివర్తన్ రెండోదశ విజయవంతం.. ఒడిశా సరిహద్దుల్లోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో అక్కడక్కడ గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును కూడా పూర్తిగా నిర్మూలించడానికి పోలీసు శాఖ ఆపరేషన్ పరివర్తన్ రెండోదశను తాజాగా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ నెలలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మారుమూల ప్రాంతాల్లో ఐదురోజులపాటు ఒడిశా అధికారుల సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసు శాఖ సమర్థంగా కట్టడి చేసింది. ఒడిశా అధికారులతో కలిసి ఏవోబీ పరిధిలో ఆరుమార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేసింది. ఇలా వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 2,45,832 కిలోల గంజాయిని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది. అందులో 70 శాతం గంజాయి ఒడిశా నుంచి మన రాష్ట్రం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నదే కావడం గమనార్హం. ఈ విధంగా ఆపరేషన్ పరివర్తన్ కింద ధ్వంసం చేసిన గంజాయి, దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు శాఖ దహనం చేస్తోంది. ఏలూరు రేంజ్ పరిధిలో శుక్రవారం కాల్చేసింది. -
560 కేజీల గంజాయి స్వాధీనం
రావికమతం : గిరిజన గ్రామం రొచ్చుపణుకు నుంచి తరలించేందుకు బొలేరో వాహనంలో సరకు వేస్తుండగా కొత్తకోట పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి రూ.17లక్షల విలువైన 560 కేజీల గంజాయిని ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారయ్యారు. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి అందించిన వివరాలివి. రొచ్చుపణుకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తరలించేందుకు సిద్ధమైనట్టు తమకు సమాచారం అందడంతో ఎస్ఐ అప్పలనాయుడు, సిబ్బందితో ఆదివారం రాత్రి దాడి చేశామన్నారు. ఈ దాడిలో బొలేరో వాహనంలో నిల్వ చేసిన 24 బస్తాలు గల 560 కేజీల గంజాయి లభ్యమైందన్నారు. అక్కడ వ్యవహారం చేసిన ఇద్దరు వ్యక్తులు మాకవరపాలెం సీతన్న అగ్రహారానికి చెందిన చొప్పా రాజిబాబు,జి.కోడూరుకు చెందిన నమ్మి రాంబాబులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. మరొకరు పరారయ్యారన్నారు. అతని గురించి ఆరా తీస్తున్నామన్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. (చదవండి: జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం) -
ఆపరేషన్ ‘డాన్’.. ఇక వారికి చుక్కలే
సాక్షి, అమరావతి: గంజాయి స్మగ్లింగ్ ముఠాలను నడిపించే డాన్ల ఆటకట్టించే కార్యాచరణకు ఏపీ పోలీస్ శాఖ రంగంలోకి దిగుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల(ఏవోబీ)ను అడ్డాగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయి దందా సాగిస్తున్న కేరళ, మహారాష్ట్ర ముఠా నేతలే లక్ష్యంగా భారీ ఆపరేషన్‌కు సిద్ధపడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో గంజాయి రవాణా చేసే మధ్యవర్తులు, చిన్న నేరస్తులను పట్టుకుని హడావుడి చేసి.. ఆపై మౌనంగా ఉండిపోవడం అలవాటుగా మారిపోయింది. అందుకు పూర్తిభిన్నంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలీసులను ఫుల్ యాక్షన్‌లోకి దింపుతోంది. గంజాయి స్మగ్లింగ్ ముఠాలను నడిపించే బాస్‌లకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును రూపుమాపేందుకు ఇప్పటికే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపట్టింది. గంజాయి సాగుకు వ్యతిరేకంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడం, గంజాయి పంటను ధ్వంసం చేసే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి కీలక కొనసాగింపుగా గంజాయి స్మగ్లింగ్ వెనుక ఉండే అసలు సూత్రధారులకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. కేరళ, మహారాష్ట్ర ముఠాలే అసలు సూత్రధారులు ఏవోబీలో గంజాయి సాగు, స్మగ్లింగ్ పూర్తిగా రాష్ట్రేతర ముఠాల కనుసన్నల్లోనే దశాబ్దాలుగా సాగుతోంది. ఈ దందా నిర్వహిస్తున్న సూత్రధారులంతా కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందినవారే. వారే విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మారుపేర్లతో ఇళ్లు అద్దెకు తీసుకుంటారు. అక్కడి నుంచి ఏజంట్ల ద్వారా మన్యంలో గంజాయి సాగుకు నిధులు సమకూరుస్తారు. పంట పండిన తరువాత వేలంలో కొనుగోలు చేసి పోలీసుల కళ్లుగప్పి కేరళ, మహారాష్ట్ర, హైదరాబాద్‌లకు తరలిస్తున్నారు. కేరళ ముఠాలు ఏకంగా ప్రత్యేక నైపుణ్యం గల వారిని ఏవోబీలోకి పంపించి గంజాయి ఆకుల నుంచి ద్రవ రూప గంజాయి (లిక్విడ్ గంజా)ని తయారు చేస్తూ అక్రమ రవాణా చేస్తున్నాయి. ఈ నెట్వర్క్ దేశవ్యాప్తంగా వేళ్లూనుకుపోయింది. యాక్షన్‌లోకి పోలీస్ టీమ్‌లు ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గంజాయి సాగును నిర్దేశిస్తూ, స్మగ్లింగ్ చేస్తున్న ముఠా నాయకుల్లో కొందరిని పోలీస్ శాఖ ఇప్పటికే గుర్తించింది. కేరళ, మహారాష్ట్రలకు చెందిన డాన్ల పేర్లు, చిరునామాలు, ఏపీలో వారి మారు పేర్లు, ఇతర వివరాలతో జాబితాలు రూపొందించినట్టు సమాచారం. ఇప్పటికే ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులతో యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)తోనూ రాష్ట్ర పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏవోబీలో చేపడుతున్న ఆపరేషన్ పరివర్తన్‌ను ఎన్సీబీకి చెందిన కొందరు అధికారుల బృందం పర్యవేక్షిస్తోంది. ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసే విషయంలో సహకరిస్తోంది. గంజాయి డాన్లను లక్ష్యంగా చేసుకుని ఏపీ పోలీసులు ఆపరేషన్‌కు సిద్ధపడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. త్వరలోనే సత్ఫలితాలు సాధిస్తామని పోలీస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
82 కిలోల గంజాయి స్వాధీనం
బూర్గంపాడు: ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈమేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర వద్ద 82 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. శనివారం ఉదయం మోరంపల్లి బంజర వద్ద బూర్గంపాడు ఎస్సై జితేందర్ వాహ నాలను తనిఖీ చేస్తూ రెండు ద్విచక్ర వాహనా లను ఆపుతుండగా వాటిపై ఉన్న నలుగురు పారిపో యేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబ డించి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. మహా రాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రాజేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ విలాస్ భలేరావు, ఉమేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ సుధాకర్ భలేరావు ఏపీలోని సీలేరులో సురేశ్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసు కెళ్తున్నట్లు విచారణలో వెల్లడించారు. కాగా, ఔరం గాబాద్‌కు చెందిన సందీప్ సాటే వీరిని గంజా యి కోసం పంపించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకు న్న గంజాయి విలువ రూ.16.48 లక్షలు ఉంటుం దని ఏఎస్పీ తెలిపారు. పెద్ద వాహనాలైతే పట్టుబ డతామనే భావనతో వీరు గంజాయి తర లింపునకు ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ సీఐ సత్యనారాయణ, బూ ర్గంపాడు ఎస్సై జితేందర్, ట్రైనీ ఎస్సై విజయలక్ష్మి, ఏఎస్సై ఖాజా మొయినుద్దీన్ పాల్గొన్నారు. -
గంజాయి గుప్పు... ఎక్స్ట్రా ముప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోంది. ఈసారి వర్షాలు విస్తారంగా పడటంతో పెద్దెత్తున గంజాయి సాగు చేశారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, ఏపీలో గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు, విశాఖ, శ్రీకాకుళం ఏజెన్సీలో గంజాయి సాగు విస్తీర్ణం పెరిగినట్లు ఎక్సైజ్, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్), ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అనుమానిస్తోంది. వీటిని ఉత్తర భారతంలోని మహారాష్ట్ర, గుజరాత్‌లకు ఎగుమతి చేసే క్రమంలో హైదరాబాద్‌లో దొరికిపోతున్నారు. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి దొరికిన ప్రతీసారి క్వింటాళ్ల కొద్దీ లభిస్తుండటమే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొత్తానికి కరోనా వైరస్‌తో విధించిన లాక్‌డౌన్‌ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. పోలీసుల నిఘా అంతగా లేకపోవడంతో గంజాయి భారీగా సాగు చేశారు. ఇంతకాలం హైదరాబాద్ దాని పరిసరాలకే పరిమితమైన గంజాయి సరఫరా ఇప్పుడు మెల్లగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ పాకుతోంది. లాక్డౌన్ కారణంగా గ్రామాల్లో పెద్దగా పనులు లేకపోవడం, కాలేజీలు లేకపోవడంతో కొందరు యువత మత్తు కోసం గంజాయికి అలవాటు పడుతున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతాలైన కొత్తగూడెం, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖమ్మం, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో గంజాయి వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎన్టీపీసీ, గోదావరి ఖని, రామగుండం తదితర ప్రాంతాల్లో యువత గంజాయి మత్తులో చిత్తవుతున్నారు. ఈ మత్తులోనే వాళ్లల్లో వాళ్లే తగవులు పెట్టుకోవడం లేదా ఇతరులపై దాడులకు దిగడం చేస్తున్నారు. ఇటీవల రాజధానిలోని అంబర్‌పేట, ఖమ్మం జిల్లాలో యువత గంజాయి మత్తులో దారిన వెళ్లేవారిపై దాడులకు దిగడం కలకలం రేపింది. ఈ విషయంలో జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికడుతూనే సరఫరా చేస్తున్న వారిపై పీడీ కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్సీబీ, డీఆర్ఐ వద్ద క్వింటాళ్లకొద్దీ.. ఈసారి రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తారంగా గంజాయి సాగు చేసినట్లు ఎన్సీబీ, డీఆర్ఐ, ఎక్సైజ్‌శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఆగస్టులో హయత్‌నగర్ వద్ద 995 కేజీల గంజాయిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అదే నెలలో డీఆర్ఐ అధికారులు పంతంగి టోల్ గేట్ వద్ద దాదాపు రూ.3.6 కోట్ల విలువైన 1,500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత వివిధ సందర్భాల్లో దాదాపు 4వేల కిలోల గంజాయిని ఒక్క ఎన్సీబీ అధికారులే పట్టుకోవడం గంజాయి అక్రమ రవాణా ఎలా సాగుతోందనడానికి నిదర్శనం. ఎక్స్ట్రా కేబిన్ ఏర్పాటు చేసి.. భద్రాచలం, ములుగు, తూర్పు గోదావరి ఏజెన్సీ నుంచి భద్రాచలం పట్టణానికి గంజాయి తరలిస్తారు. ఆపై సరుకును కొత్త గూడెం, మహబూబాబాద్, నర్సంపేటల మీదుగా వరంగల్ నుంచి హైదరాబాద్ శివార్లకు తీసుకొస్తారు. అక్కడ నుంచి నగర పరిసర జిల్లాలకు రవాణా చేస్తున్నారు. సాధారణంగా పాలు, కూరగాయలు, ఊక లారీల అడుగున గంజాయి రాజధానికి చేర్చేవారు. ఇప్పుడు స్మగ్లర్లు రూటుమార్చారు. భద్రాచలం, ములుగు ఏజెన్సీ ఏరియాలకు వస్తున్న లారీల్లో ఎక్స్ట్రా రహస్య కేబిన్ ఏర్పాటు చేసి అందులో గంజాయిని తరలిస్తున్నారు. ఈ లారీలను తనిఖీ చేసినా ఖాళీగా ఉంటుంది కాబట్టి.. పోలీసులకు కూడా అనుమానం రాదు. సమాచారం ఉంటే తప్ప వాటిని గుర్తించడం కష్టం. గట్టి నిఘా ఏర్పాటు.. ‘రాష్ట్రంలో ఈసారి భద్రాచలం, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా గంజాయి సాగు చేసినట్లు మా వద్ద సమాచారం ఉంది. గంజాయి రవాణాపై కూడా దృష్టిసారించాం. ఈ క్రమంలోనే తాజా తనిఖీల్లో పెద్దెత్తున సరుకు పట్టుబడింది. గంజాయి రవాణా ఏ మార్గంలో జరిగినా.. పట్టుకునేలా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం’అని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
మత్తు.. చిత్తు
సాక్షి, జనగామ: అమాయక యువతను మత్తు మాఫి యా విష వలయంలోకి లాగుతోంది. హైదరాబాద్ కల్చర్ జిల్లాకు అంటుకుంది. ఇన్నాళ్లు పెద్దలకే పరిమితమైన గంజాయి వ్యసనం ఇప్పుడు యువతను చెడగొడుతోంది. నిషేదిత గంజాయి విక్రయాలను కొందరు యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసిన మత్తు మాఫియా వారిని నాశనం చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొంతమంది యువత అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న వారు.. ‘మత్తు’లోకి దింపుతూ.. బానిసలుగా మార్చేస్తున్నారు. రేపటి తరానికి దిక్సూచిగా నిలవాల్సిన యువత అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ప్యాకెట్ మనీల పేరుతో తల్లిదండ్రుల గారాబంతో మరింత నాశనమవుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంగా గంజాయి ప్యాకెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం సాగుతుంది. గతంలో పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోగా బచ్చన్నపేట, రఘునాథపల్లిలో పెద్ద ఎత్తున పట్టుబడిన సంగతి తెలిసిందే. విద్యార్థులే లక్ష్యంగా.. అడ్డదారిలో డబ్బులు సంపాదనే లక్ష్యంగా కొంతమంది జనగామ కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలను సాగిస్తున్నట్లు సమాచారం. గంజాయిని హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి.. చిన్న చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, గుంటూరు తదితర పట్టణాల నుంచి ఇక్కడికి గంజాయి సరఫరా అవుతున్నట్లుగా తెలుస్తుంది. అర్థరాత్రి సమయంలో రహస్య ప్రదేశాలకు తరలిస్తూ.. 10 గ్రాముల ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తూ..డంపింగ్ చేస్తున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా..జిల్లా కేంద్రంలోని వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలతో పాటు కళాశాలల వద్ద గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా చా కచక్యంగా తప్పించుకుంటూ గంజాయి అమ్మకా లు సాగుతున్నాయని సమాచారం. జిల్లా కేంద్రం చుట్టూ.. సిద్దిపేట, సూర్యపేట, వరంగల్, హైదరాబాద్ రహదారుల శివారులో సాయంకాలం 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 10 గంట ల వరకు గంజాయి పీలుస్తూ.. అనుభూతి పొం దినట్లుగా బ్రమపడుతున్నారు. స్థానికంగా నమ్మకం ఉన్న వారికి పెద్ద ఎత్తున కమీషన్ల ఎరచూపిస్తూ గంజాయి ప్యాకెట్లను అమ్మకాలు చేయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కసారి పీలిస్తే.. గంజాయి ఆకును ఒక్కసారి పీల్చిన యువత.. దూరం కావాడం చాలా కష్టం. ప్రతి వ్యక్తి శరీరంలో ఆల్కహాల్ ఎంత అవసరమో అంతే ఉండాలి. అవసరమైన దాని కంటే ఎక్కువగా డ్రగ్స్ తీసుకు వారి ఆయుష్సు రోజు రోజుకు తగ్గిపోతుంది. అంతే కాకుండా ప్రతి రోజు సమయానుకూలంగా మత్తు కావాలనే కోరిక పుడుతుంది. పొడి గంజా యితో పాటు ఇంజక్షన్ల రూపంలో కూడా వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. మత్తు ఇంజక్షన్లను తీసుకోవడం వల్ల పూర్తిగా నరాల వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. మత్తు దొరకని సమయంలో దీనికి అలవాటు పడిన వారు ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. అంతే కాకుండా సైకోగా మారే అవకాశం ఉంటుంది. దర్జాగా అమ్మకాలు.. పోలీసులకు.. పౌరులకు అనుమానం రాకుండా చాలా చోట్ల గంజాయి ఉన్న సిగరెట్లను అమ్మకా లు చేస్తున్నారు. గతలో జనగామ జిల్లా కేంద్రంలో విదేశీ సిగరెట్లతో పాటు గుట్కా అమ్మకాలు చేస్తు న్న వారిని పోలీసులు పట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయం కావడంతో అధి కారులు.. పోలీసు నిఘాతో పాటు బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. తనిఖీలను తప్పించుకునేందుకు విద్యార్థుల రూపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున గం జాయిని సరఫరా చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు డబ్బుల కోసం తల్లిదండ్రులను పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలు కోకొల్లలు. పీడీ యాక్టు తప్పదు గుట్కా, గుడుంబా, గంజాయి, హుక్కా అమ్మకాలు చేస్తూ రెండుసార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తాం. వీటి అమ్మకాలపై గట్టి నిఘా వేసినం. అమ్మకాలు చేస్తూ పట్టుబడితే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుడుంబా, గుట్కా అమ్మకం దారులను తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తు జమానత్ తీసుకుంటున్నాం. ఒక సారి కేసు నమోదైన వారు తిరిగి విక్రయిస్తే.. లక్ష జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ చర్యగా భావిస్తాం. గంజాయి, గుట్కా అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తాం. వినోద్‌కుమార్, ఏసీపీ, జనగామ -
420 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం(చౌడవరం): విశాఖపట్నం జిల్లా చౌడవరంలో పోలీసుల చేపట్టిన వాహన తనిఖీల్లో 420 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం రావికమతం మండల శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో 420 కేజీల గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు తుపాకులు, 32 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 42లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మారణాయుధాలు ధరించి గంజాయి తరలించడం ఇదే మొదటిసారని పోలీసులు అంటున్నారు. కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివీ..రావికమతం మండలం మర్రివలస గ్రామానికి చెందిన అమిరెడ్డి వెంకటరమణ, విశాఖకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. రావికమతం, కొత్తకోట, రోలుగుంట ఎస్ఐలు సురేష్‌కుమార్, ఉమామహేశ్వరరావు, శిరీష్‌కుమార్, వెంకటరావు సిబ్బందితో పలు దారుల్లో మాటువేశారు. రోలుగుంట మండలం బుచ్చెంపేట ఆర్చ్ వద్ద వ్యాన్‌లో 360 కిలోల గంజాయితో రమణ పట్టుబడ్డాడు. వడ్డాది సమీపంలో వెంకటేశ్వరరావు కారులో 60 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. రమణ వద్ద పిస్తోలుతోపాటు 9 బుల్లెట్లు, వెంకటేశ్వరరావు వద్ద పిస్తోలు 19 బుల్లెట్లు ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనలో నర్సీపట్నానికి చెందిన మహరాజా హోటల్ నిర్వాహకుడు, రమణ బంధువు పరారీలో ఉన్నాడు. ఉజ్జయినీలో పిస్తోళ్ల కొనుగోలు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీ సమీపంలోని రేవ్ అనే గ్రామంలో తాము పిస్తోళ్లు కొనుగోలు చేసినట్లు పట్టుబడిన వెంకటరమణ, వెంకటేశ్వరరావు వెల్లడించారు. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ఒక్కింటి శ్రీనివాసచౌదరి (బాబా)తో వ్యాపార గొడవలున్నాయని, తమ వ్యాపారాన్ని తరచూ అడ్డుకుంటుండటంతో అతనిని నిలువరించాలన్న ఉద్దేశంతో పిస్తోళ్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు.