సింగపూర్: భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(46)ను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. కాగా, తంగరాజు.. సింగపూర్‌కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో, ఉరిశిక్షను అధికారులు అమలు చేశారు.
వివరాల ప్రకారం.. సింగపూర్‌కు కిలోకిపైగా గంజాయిని రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో, తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజు సుప్పయ్యను ఉరి తీసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్పయ్య కుటుంబ సభ్యులు, ఐక్యరాజ్య సమితి యాక్టివిస్టులు విజ్ఞప్తులు చేసినప్పటికి సింగపూర్ అధికార యంత్రాంగం ఉరి శిక్షను అమలు చేసింది.
ఇదిలా ఉండగా.. తంగరాజు సుప్పయ్య కుటుంబ సభ్యులు, యాక్టివిస్టులు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్‌కు చివరి నిమిషంలో లేఖ రాశారు. అయినప్పటికీ ఉరి శిక్షను అమలు చేయడం గమనార్హం. అయితే, తంగరాజు.. నేరం చేయలేదనే బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో దోషిగా తేలాడు. ఆయనకు విచారణ సమయంలో కూడా పరిమితంగా లీగల్ మద్దతు లభించిందని యాక్టివిస్టులు చెబుతున్నారు. మరోవైపు.. తంగారాజు ఉరిశిక్షపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వారం తంగరాజు ఉరిశిక్షకు సంబంధించిన నోటీసు వచ్చిన తర్వాత ఛాంగి జైలులో గ్లాస్ కిటికీ మధ్యలో నుంచి తాము సుప్పయ్యను చూసేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఈ రోజు వస్తుందని తంగరాజు మానసికంగా సిద్ధమై ఉన్నారని, అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారని చెప్పారు.
కాగా, సింగపూర్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సింగపూర్ చెబుతోంది. అందుకు ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు.
Singapore has hanged 46-year-old Tangaraju Suppiah who was found guilty in 2018 of trafficking more than 1kg of cannabis https://t.co/TZ5yq6rIVv pic.twitter.com/P5aM22AUIa
— Al Jazeera English (@AJEnglish) April 26, 2023
Comments
Please login to add a commentAdd a comment