భద్రాద్రి జిల్లా మోరంపల్లి బంజర వద్ద గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారి వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రోహిత్‌రాజు
బూర్గంపాడు: ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈమేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర వద్ద 82 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. శనివారం ఉదయం మోరంపల్లి బంజర వద్ద బూర్గంపాడు ఎస్సై జితేందర్ వాహ నాలను తనిఖీ చేస్తూ రెండు ద్విచక్ర వాహనా లను ఆపుతుండగా వాటిపై ఉన్న నలుగురు పారిపో యేందుకు యత్నించారు.
దీంతో వారిని వెంబ డించి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. మహా రాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రాజేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ విలాస్ భలేరావు, ఉమేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ సుధాకర్ భలేరావు ఏపీలోని సీలేరులో సురేశ్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసు కెళ్తున్నట్లు విచారణలో వెల్లడించారు. కాగా, ఔరం గాబాద్‌కు చెందిన సందీప్ సాటే వీరిని గంజా యి కోసం పంపించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకు న్న గంజాయి విలువ రూ.16.48 లక్షలు ఉంటుం దని ఏఎస్పీ తెలిపారు.
పెద్ద వాహనాలైతే పట్టుబ డతామనే భావనతో వీరు గంజాయి తర లింపునకు ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ సీఐ సత్యనారాయణ, బూ ర్గంపాడు ఎస్సై జితేందర్, ట్రైనీ ఎస్సై విజయలక్ష్మి, ఏఎస్సై ఖాజా మొయినుద్దీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment