khammam distirict
-
దసరా బంపర్ ఆఫర్.. వంద రూపాయలకే 10 కేజీల మేక!
dussehra offer: రండీ బాబూ రండీ.. ఆలసించినా ఆశాభంగం. త్వరపడండి.. మంచి తరుణం మించినా దొరకదు. ఏంటీ హడావుడి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సాధారణంగా దసరా పండుగకు జనమంతా షాపింగ్ చేయడం సర్వసాధారణం. అటు దుకాణాదారులు కూడా ఆఫర్లతో పాటు ఉచిత బహుమతులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.ఇదిలావుంచితే రానున్న దసరా పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులకు వెరైటీ ఆఫర్లు ప్రకటించారు. నేలకొండపల్లి చెందిన కొందరు యువకులు డ్రా ద్వారా బహుమతులు అందించాలని నిర్ణయించారు. అయితే, టీవీలు, కూలర్లు, బైక్‌లు వంటివి కాకుండా ఈసారి వినూత్న బహుమతులను ప్రకటించారు.కేసు బీర్లు, నాటు కోళ్లురూ.100 చొప్పున టికెట్లు అమ్మకం చేపట్టి ఈనెల 10న తీయనున్న డ్రాలో మొదటి బహుమతి 10 కిలోల మేక ఇస్తామని పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రెండో బహుమతిగా బ్రాండెడ్ మద్యం బాటిల్, మూడో బహుమతి కేసు బీర్లు, నాలుగో బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదో బహుమతిగా మద్యం బాటిల్ ఇస్తామని ప్రకటించడంతో టికెట్లు జోరుగానే అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.వేములవాడలో కేసు కాగా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలోనూ ఇంతకుముందు ఇలాంటి ఆఫర్లే ప్రకటించారు. ఈ ట్రెండ్ చాలా ఊర్లకు పాకింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం పోలీసులు కన్నెర్ర చేశారు. వేములవాడ పట్టణంలో “100 కొట్టు మేకను పట్టు” క్యాప్షన్‌తో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రైజ్‌మనీల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. -
పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య.. కన్నుమూత!
ఖమ్మం: కంచుమేళం శాశ్వతంగా ఆగిపోయింది. ఆదివాసీ సంప్రదాయ కళల రక్షకుడు, మణుగూరు మండలం బావికూనవరం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) తుదిశ్వాస విడిచారు. అంతరించిపోతు న్న గిరిజన కళలను కాపాడుతూ, కాలినడకన మారుమూల గ్రామాల్లో తిరుగుతూ భవిష్యత్ తరాలకు అందించిన జానపద కళాకారుడు, డోలు వాయిద్య కారుడు అయిన రామచంద్రయ్య కొంతకాలంగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతూ మృతి చెందారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచుతాళం, కంచుమేళంతో ఆదివాసీ కథలు అలవోకగా, కళ్లకు కట్టినట్లు వివరించగలగిన ఏకైక కళాకారుడు రామచంద్రయ్య మృతిపట్ల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ ్వరరావు సంతాపం తెలిపారు.కుటుంబ సభ్యులకు కలెక్టర్ హామీ..భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కూనవరంలోని రామచంద్రయ్య మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం, స్థలం సమస్య ప్రస్తావించగా, పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని, అంత్యక్రియల అనంతరం తన వద్దకు రావాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.అందని నాటి ప్రభుత్వ సాయం..సకిని రామచంద్రయ్య వనదేవతల వీరగాథలు చెప్పడంతో పాటు రెండేళ్లకోసారి వచ్చే ఆదివాసీ జాతరైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజుల వంటి దేవరుల కథను కళ్లకు కట్టినట్లుగా గానం చేయడంతో పాటు సమ్మక్క సారలమ్మ తల్లులను గద్దెల వద్దకు తీసుకు వచ్చే క్రమంలో కీలకంగా వ్యవహరిస్తారు. అంతరించిపోతున్న ఆదివాసీ కళలను కాపాడుతున్న తీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 జనవరి 25న పద్మశ్రీ అవార్డు అందజేసింది.అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సత్కరించింది. ఆ వెంటనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.కోటి ఆర్థికసాయంతో పాటు 426 చదరపు గజాల ఇంటి స్థలం అందిస్తామని ప్రకటించింది. కానీ ఇవ్వలేదు. అనారోగ్యంతో ఉన్న తనకు ఆర్థిక సాయం అందించి, కాపాడాలని కలెక్టరేట్ చుట్టూ తిరిగినా, అధికారులకు విన్నవించినా మోక్షం కలగలేదు. కళాకారులకు అందించే రూ.10 వేల పింఛన్ అందించడంలోనూ జాప్యం జరిగింది.పలుమార్లు కలెక్టర్లకు విన్నవించి నా ఆర్థికసాయం ట్రెజరీ నుంచి రావాలంటూ సమాధానం రావడంతో వైద్య పరీక్షలకు అప్పులు చేసి రూ.4 లక్షలతో వైద్యం చేయించుకున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో మణుగూ రు వచ్చిన రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను కలిసి న్యాయం చేయాలని వేడుకోగా.. ఆమె ఆర్థిక సా యం అందించారు. ఎన్నికల కోడ్ ముగిశాక కలవా లని సూచించగా, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 21న మళ్లీ సీతక్కను కలిశారు. దీంతో నాలుగైదు రోజుల్లో చెక్కు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈ లోపే రామచంద్రయ్య మృతి చెందారు.జానపద కళకు తీరని లోటు: భట్టిఖమ్మంవన్టౌన్ : అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను జీవనాధారంగా చేసుకొని డోలు వాయిద్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించి పెట్టారని కొనియాడారు. రామచంద్రయ్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతో మరణించడం బాధాకరం..ఖమ్మంమయూరిసెంటర్: కోయ అధ్యయన వేదిక ఆత్మీయ మిత్రుడు, సమ్మక్క సారలమ్మ తదితర కోయ వీరపురుషుల కథా గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సకిని రామచంద్రయ్య ఆర్థిక ఇబ్బందులతో మరణించడం బాధాకరమని ప్రముఖ కవులు పద్దం అనసూయ, డాక్టర్ గూడూరు మనోజ, జయధీర్ తిరుమలరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వయసు పైబడి మరణించలేదని, గత ప్రభుత్వం ఇస్తామన్న రూ. కోటి ఆర్థిక సాయం నేటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోయ ఆదివాసీ కళాకారుడు ఇలాంటి స్థితిలో మృతిచెందడం కలచి వేస్తోందని తెలిపారు. -
ఖమ్మం జిల్లా రాజులపాలెం గ్రామంలో ఓటర్ల నిరసన
-
ద్విచక్రవాహనం ఎక్కిన పాము..
ఖమ్మం: మండలంలోని పాలేరు గ్రామంలో ఓ వ్యక్తి టీవీఎస్ మోపెడ్ పైకి పాము ఎక్కడంతో సదరు వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలేరు కిరాణా సరుకుల నిమిత్తం రాగా అతను సరుకులను కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే హ్యాండిల్పైకి పాము పాకుతూ కనిపించింది. దీంతో అతను కంగారుగా వాహనాన్ని నిలిపివేయగా అటుగా వెళ్తున్నవారు పామును చంపివేశారు. -
నేను దేవుడిని.. గుడి కట్టించండి! రోడ్డు వెంట దిమ్మె కింద వెలిశాను
ఖమ్మం: నేను దేవుడిని... నాకు గుడి కట్టించండి... రోడ్డు వెంట దిమ్మె కింద వెలిశాను అంటూ ఓ బాలుడు పూనకంతో చెప్పడం, ఆయన ఓ పార్టీకి చెందిన దిమ్మెను అర్ధరాత్రి పగలగొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో నేలకొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలుడు బుధవారం అర్ధరాత్రి పూనకంతో ఊగిపోతూ ఓ పార్టీ నిర్మించిన దిమ్మె కింద వెలిసినందున గుడి కట్టాలని చెప్పాడు. దీంతో కుటుంబీకులు దిమ్మె పగలగొట్టి పసుపు, కుంకుమ చల్లుతుండగా స్థానికులు అడ్డగించారు. ఇలా గొడవ పెరగడంతో బాలుడి కుటుంబం ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈమేరకు గురువారం ఉదయం గ్రామపెద్దలు, స్థానికులు కలిసి వారిని నిలదీయగా వివాదం ముదురుతుండడంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాలకు చెదరగొట్టారు. -
పొత్తు తెచ్చిన చిక్కులు.. గులాబీ పార్టీలో టెన్షన్
తెలంగాణలో ఎర్ర పార్టీలు, గులాబీ పార్టీ ఏకమవుతున్నాయా? మునుగోడు ఫలితం వారిని మరింత దగ్గర చేసిందా? అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్ పొత్తు ఖరారైందా? అవుననే అంటున్నాయి వామపక్షాల శ్రేణులు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సీట్లు కూడా పంచుకుంటున్నారు. మరి గులాబీ పార్టీలో సిటింగ్‌లు, ఆశావహుల రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోంది? వారు ఏం చేయబోతున్నారు? పాలేరులో ఎవరు పోటీ? ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనరల్ సీట్లు. ఖమ్మంకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పాలేరుకు కందాల ఉపేంద్రరెడ్డి ఎమ్మెల్యే. ఈ సీటు కోసం కందాల, మాజీ మంత్రి తుమ్మల మధ్య పోరు సాగుతోంది. ఇంతలో పాలేరు నియోజకవర్గంలో ఎర్ర జెండా ఎగురుతుందంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన కామెంట్ జిల్లాలో సంచలనం రేపింది. గులాబీ కోటలో టెన్షన్ పెరుగుతోంది. పొత్తుల్లో భాగంగా పాలేరులో తానే పోటీ చేస్తానని పార్టీ సర్కిల్స్‌లో తమ్మినేని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. మరి సిటింగ్ ఎమ్మెల్యే కందాల, సీటుపై ఆశపడుతున్న తుమ్మల పరిస్తితి ఏంటనే చర్చ జిల్లాలో హాట్ హాట్‌గా సాగుతోంది. గ్రౌండ్లో ఎంట్రీ ఇచ్చేశారు వామపక్షాలతో పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని కొంతకాలంగా ఖమ్మం జిల్లాలోని గులాబీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. అయితే పొత్తుపై అగ్ర నాయకులకు క్లారిటీ ఉందని, గులాబీ, ఎర్ర పార్టీల శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాల్సిన రోజులొస్తున్నాయని సూచనలు అందుతున్నాయి. ఇంతలో పాలేరు నియోజకవర్గం పరిదిలోని ముత్తగూడెంలో జరిగిన సిపిఎం నేతల సమావేశంలో తమ్మినేని వీరభద్రం పొత్తుపై చేసిన కామెంట్స్ జిల్లాలో సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పాలేరులో ఎర్రజెండా ఎగరబోతోందని తమ్మినేని కార్యకర్తలకు చెప్పారు. పార్టీకి పట్టున్న గ్రామాల్లో నాలుగు నెలలుగా పర్యటిస్టున్న తమ్మినేని వీరభద్రం కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీల శ్రేణుల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే గులాబీ పార్టీ శ్రేణులే ఈ పరిణామాల్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ముచ్చటగా ముగ్గురికి ఆశలు పాలేరు సీటు సీపీఏంకు ఇస్తే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు పరిస్థితేంటన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఇద్దరు నేతలు టికెట్ పై ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాలేరు తనకే టికెట్ వస్తుందని, మరోసారి తాను ఎమ్మెల్యే కావడం ఖాయమని కందాల అనేక సార్లు చెప్పారు. ఇటు తమ్మల నాగేశ్వరరావు కూడ టికెట్ పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఇటివలే ములుగు జిల్లా వాజేడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సైతం తాను కేసీఆర్ వెంటే ఉంటానంటూ ప్రకటించారు. దీంతో తుమ్మలకు పాలేరు టికెట్ పై కేసీఆర్ ఇంటర్నల్‌గా ఏమైన భరోసా ఇచ్చారా అన్న చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో నడిచింది. ఇద్దరు నేతలు టికెట్ కోసం తీవ్రస్థాయిలో పోటి పడుతుంటే మధ్యలో సీపీఎం వచ్చి టికెట్ తనకే అనడంతో అసలు పాలేరు టీఆర్ఎస్లో ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లయితే పాలేరు సిటింగ్ ఎమ్మెల్యే కందాల, మాజీ మంత్రి తుమ్మల కచ్చితంగా జంప్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ నుంచి వచ్చేవారి కోసం కాంగ్రెస్, బీజేపీలు ఎదురు చూస్తున్నాయి. పాలేరులో ఇంకా ఎన్ని రాజకీయ సంచలనాలు జరుగుతాయో చూడాలి. చదవండి: తెలంగాణలో మరో పాదయాత్ర?.. ఆ నాయకుడెవరు? -
విద్యార్థుల చెంతకే సర్టిఫికెట్లు
ఖమ్మం అర్బన్: విద్యార్థులకు అవసరమయ్యే కులం, ఆదాయ ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పాఠశాలల్లోనే ఆయా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ శ్రీకారం చుట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా గురువారం జిల్లాలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని పాండురంగాపురం, రఘునాథపాలెంలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడకు వెళ్లకుండా సర్టిఫికెట్లను వారి చేతికి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ గౌతమ్‌ను మంత్రి అభినందించారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కలెక్టర్లకు సూచనలు చేస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థుల జాబితాను హెచ్ఎంలు తహసీల్దార్లకు అందిస్తే సర్టిఫికెట్లు జారీ చేస్తారని చెప్పారు. ఒకేరోజు 6 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్డీఓ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
సరిహద్దు వైన్స్‌కు భారీ గిరాకీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఏపీ సరిహద్దు జిల్లాల్లోని మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా ఇక్కడ వ్యాపారం ‘మూడు బాటిళ్లు, ఆరు కాటన్లు’గా ఉంటుందని సదరు వ్యాపారులు లాభమోహాల్లో, ఊహల్లో తేలిపోతున్నారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా కొందరు నేతలు కూడా రంగంలోకి దిగి తమ బినామీలతో దరఖాస్తులు దాఖలు చేయిస్తున్నారు. పాత వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సరిహద్దు జిల్లాలవారీగా.. ఖమ్మం 122, భద్రాద్రి కొత్తగూడెం 88, నల్లగొండ 155, సూర్యాపేట 99 మద్యం షాపులున్నాయి. పాతవ్యాపారుల్లో కొత్త ఉత్సాహం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, తల్లాడ, ముదిగొండ, చింతకాని, బోనకల్, ఎర్రుపాలెం మండలాలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, హాలియా, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను సొంతం చేసుకునేందుకు పాత వ్యాపారులు కొత్తకొత్తగా పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా అన్రిజర్వ్డ్ దుకాణాలకు ఈ ప్రాంతాల్లో భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఈ జిల్లాల్లోని పాత వ్యాపారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌కు చెందిన కొం దరు బడానేతలు కూడా తమ బినామీలతో దరఖాస్తు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దుకాణం దక్కించుకుంటే రెండేళ్ల కాల పరిమితి వరకు వ్యాపారం చేసుకోవచ్చు. రెండేళ్ల చివరినాటికి రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఎన్నికలు రానుండటం కూడా దరఖాస్తులు ఎక్కువగా నమోదు కావడానికి మరో కారణంగా చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,280కుపైగా దరఖాస్తులు వచ్చా యి. ఇందులో సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలవే అధికం. రిజర్వ్డ్ దుకాణాలకు పోటాపోటీ ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో రిజర్వ్డ్ దుకాణాలకు పోటాపోటీగా దరఖాస్తులు వస్తున్నాయి. రిజర్వ్ అయిన దుకాణాలకు సంబంధించి ఎవరికీ బినామీలుగా ఉండకుండా తామే దరఖాస్తులు దాఖలు చేయాలని ఆ కేటగిరీకి చెందిన నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత తమ సామాజికవర్గానికి చెందిన ముఖ్యులతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. అదే సామాజికవర్గానికి చెందిన, మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్నవారిని పిలిచి చర్చించినట్లు సమాచారం. ఎవరికీ బినామీలుగా ఉండకుండా తమకు రిజర్వ్ అయిన దుకాణాలకు తమ కేటగిరీవారే దరఖాస్తు చేసేలా ముందుకు వెళ్లాలని సదరు నేత సూచించినట్లు తెలిసింది. రిజర్వ్డ్ కేటగిరీలోనైనా దుకాణాలను దక్కించుకుంటే వచ్చే ఎన్నికల్లో మద్యం అమ్మకాల ద్వారా భారీగా సొమ్ము చేసుకోవచ్చని భావిస్తున్నారు. భాగస్వామిగా ఇతరులకు.. ఈసారి వైన్స్‌ల్లో కొన్నింటిని గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ కేటగిరీలవారు అవసరమైతే ఇతర కులాలవారినీ వ్యాపార భాగస్వాములుగా చేర్చుకోవచ్చని ఈ నెల 8న జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఎక్సైజ్ కమిషనర్ పూర్తిస్థాయి విచారణ జరిపి భాగస్వామికి అర్హతలున్నాయని భావించిన తర్వాతే అనుమతిస్తారు. భాగస్వామి రిటైల్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్‌లో 3 శాతం లేదా రూ.3 లక్షల్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ ఫీజు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భాగస్వామిగా చేరేందుకు కూడా కొందరు పాత వ్యాపారులు రిజర్వ్ కేటగిరీ వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ 1 వద్ద దరఖాస్తులు దాఖలు చేసేందుకు సోమవారం రాత్రి వేచి ఉన్న ఔత్సాహికులు -
82 కిలోల గంజాయి స్వాధీనం
బూర్గంపాడు: ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈమేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర వద్ద 82 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. శనివారం ఉదయం మోరంపల్లి బంజర వద్ద బూర్గంపాడు ఎస్సై జితేందర్ వాహ నాలను తనిఖీ చేస్తూ రెండు ద్విచక్ర వాహనా లను ఆపుతుండగా వాటిపై ఉన్న నలుగురు పారిపో యేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబ డించి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. మహా రాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రాజేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ విలాస్ భలేరావు, ఉమేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ సుధాకర్ భలేరావు ఏపీలోని సీలేరులో సురేశ్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసు కెళ్తున్నట్లు విచారణలో వెల్లడించారు. కాగా, ఔరం గాబాద్‌కు చెందిన సందీప్ సాటే వీరిని గంజా యి కోసం పంపించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకు న్న గంజాయి విలువ రూ.16.48 లక్షలు ఉంటుం దని ఏఎస్పీ తెలిపారు. పెద్ద వాహనాలైతే పట్టుబ డతామనే భావనతో వీరు గంజాయి తర లింపునకు ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ సీఐ సత్యనారాయణ, బూ ర్గంపాడు ఎస్సై జితేందర్, ట్రైనీ ఎస్సై విజయలక్ష్మి, ఏఎస్సై ఖాజా మొయినుద్దీన్ పాల్గొన్నారు. -
బడికి వెళ్లాలంటే..అడవికి వెళ్లాలా?
సాక్షి, అశ్వారావుపేటరూరల్: వారంతా రేపటి పౌరులు.. ఈ భావి భారత పౌరులు బడిబాట పట్టాలంటే ముందుగా అడవి బాట పట్టాల్సిందే. అన్ని సౌకర్యాలు ఉన్న గ్రామాల్లోనే ప్రభుత్వ బడులు చాలా వరకు విద్యార్థులలేమితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దాదాపు ముపైమందికిపైగా విద్యార్థులున్న ఆ గిరిజన గ్రామంలో మాత్రం సర్కారు బడి లేకుండా పోయింది. దాంతో ఆ గిరిజన బిడ్డలు ఉన్నత విద్య కోసం మూడు మైళ్ల దూరం అడవిబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మారుమూల అటవీ ప్రాంతంలో కొండతోగు అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మాత్రమే ఉండగా, ప్రాథమిక పాఠశాల లేదు. దాంతో ప్రతి ఏటా బడులు తెరిస్తే చాలు.. ఈ అడవి బిడ్డలు విద్య కోసం మూడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువారిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామంలో ఉన్న బడికి వెళ్లాలంటే కొండతోగు నుంచి అడవి మార్గంలో కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సిందే. వర్షకాలం సీజన్లో ఐతే అడవి మార్గంలో ఉన్న కొండతోగు వాగు పారుతుంది. వర్షం తగ్గిన తర్వాత మెకాళ్లలోతులో ఉండే నీళ్లు దాటుకొని ఈ చిన్నారులు సాహసంతో బడికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు గత ఐదేళ్లుగా నెలకొని ఉన్నప్పటికీ అధికారులు, పాలకులకు కనీసం పట్టడం లేదు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘బడిబాట’కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తున్న క్రమంలో ఈ ‘అడవి బాట’పట్టుతున్న గిరిజన బిడ్డల అవస్థలను సైతం దృష్టిలో పెట్టుకొని, ఆ గ్రామంలో సర్కారు పాఠశాలను ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందేమో కాస్తా ఆలోచించాలి. -
ఖమ్మం జిల్లాలో ఆగని ఆందోళనలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా విభజన నేపథ్యంలో వివిధ డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను ముక్కలు చేయవద్దని కోరుతూ బస్సు యాత్ర కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆదివాసీ బస్సుయాత్ర టేకులపల్లికి చేరుకుంది. షెడ్యూల్డ్ ఏరియాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక బోడు రోడ్డు సెంటర్లో ధర్నా చేపట్టారు. వాజేడు, వెంకటాపురం మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు బంద్ చేపట్టాయి. రెండు మండలాలను వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కలపాలనే ప్రతిపాదనను విర మించుకోవాలని డిమాండ్ చేశారు. -
రెండు బైకులు ఢీ : ఇద్దరి మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా పినపాక మండలంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతే పద్మాపురం గ్రామ సమీపంలో జరిగింది. పద్మాపురం సమీపంలోని ఓ మూల మలుపు వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని భద్రాచలం ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (పినపాక) -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఖమ్మం : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో జరిగింది. వివరాలు..నారాయణపురం గ్రామానికి చెందిన నల్లపు శైలజ(25) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అశ్వారావుపేట) -
చిన్నారిని చిదిమేశారు
ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో నాలుగు నెలల చిన్నారిని హత్య చేసి అనంతరం నీళ్ల ట్యాంకులో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కల్లూరు మండలం ఎర్రబోయిన పల్లికి చెందిన నాగేశ్వరరావు మణుగూరులోని సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన కొడుకు సుమన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్నారు. కాగా, సుమన్ అయిదేళ్ల క్రితం ఆగ్రాకు చెందిన నిధిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. సుమన్ హైదరాబాద్‌లోనే ఉండి చదువుకుంటుండగా నిధి మాత్రం అత్తమామలతో కలిసి కల్లూరులో నివసిస్తుంది. అయితే గురువారం అర్థరాత్రి తరువాత తన మంచంపై ఉన్న చిన్న కుమార్తె కనిపించకపోవడంతో గమనించిన నిధి... తన అత్తమామలకు ఆ విషయం తెలిపింది. దీంతో అందరూ కలసి రాత్రంతా చిన్నారి కోసం వెతికారు. ఆ క్రమంలో శుక్రవారం ఉదయం డాబాపైన ఉన్న నీళ్ల ట్యాంకులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నాగేశ్వరరావు దంపతులను పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించిన చిన్నారి తల్లి మాత్రం ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు. భర్త హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాతే అన్ని విషయాలు చెబుతానంటోంది. కాగా, అత్తమామలు, కోడలికి మధ్య సఖ్యత లేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.