
ఖమ్మం: మండలంలోని పాలేరు గ్రామంలో ఓ వ్యక్తి టీవీఎస్ మోపెడ్ పైకి పాము ఎక్కడంతో సదరు వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలేరు కిరాణా సరుకుల నిమిత్తం రాగా అతను సరుకులను కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు.
కొద్దిదూరం వెళ్లగానే హ్యాండిల్‌పైకి పాము పాకుతూ కనిపించింది. దీంతో అతను కంగారుగా వాహనాన్ని నిలిపివేయగా అటుగా వెళ్తున్నవారు పామును చంపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment