
ఆదిలాబాద్: మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఇద్దరు బాలికలు మూత్రశాలలకు వెళ్తుండగా పాము వారి కాళ్ల మధ్యలో నుంచి వెళ్లింది. దీంతో వారు ఆందోళనకు గురికావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు ప్రమాదం ఏమి లేదని తెలిపాడు.
అనంతరం పరిశీలన కోసం భైంసాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కసూ్తరిబా పాఠశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా విద్యార్థినులు పామును చూపి బయపడ్డారని, పరిశీలన కోసం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment